అమరావతి: ఏపీ అసెంబ్లీ రెండో రోజు (AP Assembly) సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభ నుంచి టీడీపీ ఎమ్మె ల్యే లను స్పీకర్ తమ్మి నేని సీతారామ్ సస్పెం డ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవలం బిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై టీడీపీ ఎమ్మె ల్యేలు సభలో ఆందోళన చేపట్టిన సమయంలో , స్పీ కర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. పన్నుల భారంతో ప్రజలను పీడించుకుంటున్నారని నినాదాలు చేశారు. టీడీపీ ఎమ్మె ల్యే లు ఆందోళన కొనసాగించడంతో వారిని ఒకరోజు పాటు సభ నుం చి సస్పెం డ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.