కోడికత్తి కేసులో నిందితుడు జనపల్లి శ్రీనివాసరావుకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కేసు వివరాలు మీడియాతో మాట్లాడొద్దని, ర్యాలీలు, సభల్లో పాల్గొనద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పుపై దళిత, పౌర సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. శ్రీను ఐదేళ్లుగా జైలులో మగ్గుతున్నాడు.
కోడికత్తి కేసులో గత ఐదేళ్లుగా నిందితుడు శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శీను జైలులోనే మగ్గుతున్నాడు. ఇప్పటికీ రిమాండ్ ఖైదీగానే జైల్లోనే ఉన్న శ్రీనివాస్ కు బెయిల్ ఈ రోజు లభించిన హై కోర్ట్ బెయిల్ తో ఊరట లభించింది.