తెలంగాణ : ఇవాళ రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్

      

ఫిబ్రవరి 27 న జరిగే రాజ్యసభ ఎన్నికలకు తెలంగాణలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు ఎన్నికల కమిషన్ నేడు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈరోజునుండే నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నామినేషన్ల దాఖలుకు గడువు ఈ నెల 15 వరకు ఉంటుంది, 16న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.

20న నామినేషన్ల విత్ డ్రాకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించనుంది. తెలంగాణలో ఉన్న మూడు స్థానాల్లో రెండు అధికార కాంగ్రెస్‌కు, ఒకటికి ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి ఇద్దరు బీఆర్ఎస్ నుంచి ఒకరు నామినేషన్ వేస్తే మాత్రం ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మూడు కన్నా ఎక్కువ నామినేషన్లు పడితే ఎన్నికల నిర్వహణ ఉంటుంది. ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *