దేశ ప్రజలందరికీ ఉచిత విద్యుత్: PM Surya Ghar Muft Bijli Yojana… పథకం ప్రారంభిస్తున్న మోడీ .

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేఫధ్యంలో ప్రజలను ఆకట్టుకునే మరో కొత్త పథకం , “PM Surya Ghar Muft Bijli Yojana”, మోడీ ప్రకటించారు. ఈ పథకానికి రూ. 75,000 కోట్లు ఖర్చు అవుతుందని, ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని, ఈ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా 1 కోటి ఇళ్లలో విద్యుత్ వెలుగులు నింపుతామని,  ఈ పథకం కోరుకునే వారు దీనికి సంబంధించిన వెబ్ సైట్ లో దరఖాస్తు చేస్తుకోవాలని మోడీ పేర్కొన్నారు.

మోడీ ట్విట్టర్ (X ) లో చేసిన ప్రకటన ఇలా వుంది. “ఈ పథకం క్రింద అందించే సబ్సిడీలను, నేరుగా ప్రజల ఖాతాల్లోకి వేస్తాము. Roof top సోలార్ వ్యవస్త ఏర్పాటుకు బ్యాంకుల నుండి రుణాలు పొందవచ్చు, స్థానిక సంస్థలు, పంచాయితీలు తమ పరిధిలోనున్న Roof top సోలార్ వ్యవస్తలను ప్రోత్సహించాలని సూచిస్తున్నాము. ఈ పథకంతో విద్యుత్ బిల్లులు తక్కువ గా వస్తాయ్, స్థానికంగా ఉపాథి అవకాశాలు పెరుగుతాయి,గృహ వినియోగ దారులు, యువత ఈ “సూర్య ఘర్ ” పథకాన్ని బలోపేతం చెయ్యాలని కోరుతున్నాను. దీని కోసం   లో దరఖాస్తు చేసుకోవచ్చు. “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *