నేడు మేడిగడ్డను సందర్శించనున్న సీఎం రేవంత్.

భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లోని మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు సీఎం రేవంత్ మంగళవారం వస్తున్నారు. తోటి మంత్రులు, ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో కలిసి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణల నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలనకు ఈ బృందం రానుంది. ఈ పర్యటనపై సీఎం ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించారు. రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సుల్లో మేడిగడ్డకు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లను చేసింది. మేడిగడ్డ బ్యారేజీ సందర్శన అనంతరం సమీపంలోని హోమశాల వద్ద పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు. బ్యారేజీ నిర్మాణ లోపాలను వివరించనున్నారు. ఈ సందర్భంగా జరిగే సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *