నిన్న రాజస్థాన్ నుంచి, రాజ్యసభకు నామినేషన్ వేసిన సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనబోనని, ప్రకటన చేస్తూ, ఈ రోజు, 2004 నుంచి , తాను ప్రాతినిధ్యం వహిస్తున్న, రాయ్ బరేలి లోక్ సభ నియోజక ప్రజలకు బహిరంగ లేఖ వ్రాసారు. ‘రాయ్ బరేలి నియోజకవర్గంతో తమ కుటుంబానికి అనుబంధం ఉంది. అని, అక్కడి ప్రజలు , తన కుటుంబానికి అండగా నిలిచారని, అనారోగ్య కారణాల వల్ల వచ్చే లోక్ సభ ఎన్నికలో పోటీ చేయడం లేదు అని’ ఆ లేఖలో పేర్కొన్నారు.
కాంగ్రెస్ అగ్ర నేత, మాజీ అధ్యక్షురాలు అయిన సోనియా గాంధీ, ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలి నియోజకవర్గం నుండి లోక్ సభ గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయిన రాయ్ బరేలి నుండి గతంలోనూ , సోనియా భర్త దివంగత రాజీవ్ గాంధీ, అత్త దివంగత ఇందిరా గాంధీ ప్రాతినిధ్యం వహించారు.
ఆఫీసియల్ గా 1997 లో కాంగ్రెస్ పార్టీ లో చేరిన ఆమె, 1998 లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షరాలిగా ఎన్నికయ్యారు. 1999 లో కర్ణాటక లోని బళ్లారి, ఉత్తర్ ప్రదేశ్ లోని అమేథి నియోజకవర్గాలనుండి గెలిచారు. 2004 ,2009, 2014,2019 లో వరుసగా 4 సార్లు రాయ్ బరేలి నుండే గెలిచి తన సత్తా చాటారు.