ఫిబ్రవరి 27 న జరిగే రాజ్యసభ ఎన్నికలకు , వైసీపీ ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేసింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కడపకు చెందిన మేడా రఘునాథ రెడ్డి, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పేర్లను ఫిక్స్ చేయడం జరిగింది. వీరిలో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కాగా.. ఒకరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం
వైస్సార్ మరణానంతరం నుంచి జగన్ వెంటే వున్న బాబురావు , గతంలో తనకు మంత్రి పదవి ఇవ్వకుండా అధిష్ఠానం తనకు అన్యాయం చేసిందనే అసంతృప్తితో ఉండేవారు. ఈ రాజ్యసభ ఎంపీ టికెట్ బాబురావు కు కేటాయించడంతో, ఆయన అసంతృప్తి చల్లారుతుందని వైసీపీ అధిష్టానం భావిస్తోంది