స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆంధ్ర హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ వాయిదాపడింది. ఈ పిటిషన్ సోమవారం జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్‌తో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే హాజరుకాలేకపోవడంతో విచారణ వాయిదా వేయాలని ఆయన తరఫున మరో సీనియర్ లాయర్ సిద్ధార్థ లూథ్రా అభ్యర్థించారు. అనంతరం ధర్మాసనం విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.
Nice
Simple and precise