Home » హోం » తెనాలి పోలీస్ లు, రౌడీ షీటర్లను , నడి రోడ్డు లో, థర్డ్ డిగ్రీ చేసిన చర్యలో, కులం కార్డు తీసిన సాక్షి

తెనాలి పోలీస్ లు, రౌడీ షీటర్లను , నడి రోడ్డు లో, థర్డ్ డిగ్రీ చేసిన చర్యలో, కులం కార్డు తీసిన సాక్షి

Tenali police arrested rowdy sheeters on the road, in a third degree act,

ముగ్గురు వ్యక్తులను, తెనాలి పోలీస్ లు నడి రోడ్ పై, కూర్చోబెట్టి, పబ్లిక్ అందరూ చూస్తూ ఉండగా, లాఠీలతో చితక్కొట్టిన వీడియో ఇప్పుడు సంచలనం గా మారింది.

అసలు ఈ సంఘటన వెనుక ఏమి జరిగింది అని తెలుసుకోవడం నాకానవసరం అనుకుందేమో సాక్షి, ఏదో దొరికింది ఈ ప్రభుత్వం అన్నట్టు, ఈ వీడియో బయటకు వచ్చిన మరునాడే, సాక్షి పేపర్ లో మొదటి పేజీ మెయిన్ హెడ్డింగ్ పెట్టి, “దళిత మైనారిటీల ఆత్మగౌరవం పై, బాబు సర్కార్ ,’బూటు దెబ్బ “,  అని టైటిల్ పెట్టి, బాబు జమానాలో, పోలీస్ లు దళితులను, మైనారిటీలను హింసిస్తున్నారన్నట్టు, ప్రాజెక్ట్ చేసింది.

రాష్ట్రం లో ఏ సంఘటన జరిగినా, వెంటనే కులం కార్డు తీసి, కులాలను రెచ్చగొట్టడమే సాక్షి పని అని టీడీపీ అభిమానులు విమర్శిస్తున్నారు.

ఈ వీడియో లో చూపించిన సంఘటన ఏప్రిల్ లో జరిగింది, నెల రోజుల తరువాత వెలుగు లోకి వచ్చింది.

అయితే, పోలీస్ లే ఈ వీడియో రిలీజ్ చేసినట్టుగా, వార్తలు వస్తున్నాయి. ఈ వీడియో బయటకు వస్తే, వారి మీద చర్యలు ఉంటాయి, సస్పెన్షన్ లు కూడా వుండే ఛాన్స్ వుంది, అని తెలిసి కూడా ఈ వీడియో పోలీస్ లు రిలీజ్ చేసారంటే దాని వెనుక వారి ఆలోచన ఏమిటి ?

అసలు జరిగింది ఏమిటి ?

తెనాలి, ఐతానగర్ లో కొంతమంది , గంజాయికి బానిస అయి, యువకులు, క్రిమినల్ గా తయారయ్యారు, తరువాత రౌడిషీటర్లుగా ముదిరిపోతున్నారు. జనాల పై దాడులు చెయ్యడం, దోపిడీలు చెయ్యడం ప్రారంభించారు.

ముగ్గురు రౌడీ షీటర్లు, ఆ మధ్య ఒక కానిస్టేబుల్ డ్యూటీ ముగించుకుని వస్తూ ఉండగా, దారి కాచి, అతని పట్టుకుని, చితక్కొట్టారు, కత్తితో పొడిచి చంపబోతే, పారిపోయి తప్పించుకుని వారి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు . ఇప్పటికే వారిమీద 11 క్రిమినల్ కేసులున్నాయి.  ఎన్ని సార్లు చెప్పినా పద్ధతులు ఈ రౌడీ షీటర్లు, పద్ధతులు మార్చుకోవట్లేదు, ఇప్పుడు ఏకంగా ఒక పోలీస్ కానిస్టేబుల్ నే చంపాలని చూసారు.

అందుకే వారి ని , నడి రోడ్ లో కూర్చోబెట్టి, థర్డ్ డిగ్రీ ఇచ్చారు, ఈ శిక్ష చూసి, మిగతా రౌడీ షీటర్లకు కూడా బుద్ధి రావాలని పోలీస్ లు ఇలా చేసారు.

అయితే, పోలీస్లు కొట్టిన వారిలో, దళితులు, మైనారిటీలు వున్నారు కాబట్టి, వెంటనే, వైసీపీ, సాక్షి, దళిత్ కార్డు తీసింది, బాబు ప్రభుత్వంలో పోలీస్ లు దళితుల మీద చేస్తున్న దాడిలా అభివర్ణించింది.

క్రిమినల్స్ కులం ఏమిటో అర్ధం కాదు, ఈ కులం వాళ్ళు ఏ నేరాలు చేసినా పర్లేదు, అని రాజ్యాంగంలో ఉందా?,  అని సాక్షి చెప్పాలి.

మరి వైసీపీ అధికారంలో వున్నపుడు, మాస్క్ అడిగిన పాపానికి, ఏ నేరం చెయ్యకపోయినా, దళితుడైన డాక్టర్ సుధాకర్ ను, నడిరోడ్ మీద పెడ రెక్కలు విరిచి పట్టుకుని, వాటిని కట్టేసి, పిచ్చి ఆసుపత్రికి తరలించి, పిచ్చివాణ్ణి చేసి, చనిపోయేలా చేసిన ఉదంతం వైసీపీ మర్చిపోయిందా? దళిత డ్రైవర్ ను చంపేసి, డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు ను జగన్ వెంటబెట్టుకుని తిరిగిన ఉదంతాలు మర్చిపోయిందా ?

అయితే, రౌడీలను అలా పబ్లిక్ గా థర్డ్ డిగ్రీ చేసి, దారిలో పెట్టే మార్గం సరైందేనా ?

వారు ఏ తప్పు చేసినా, గంజాయికి బానిసలే అయినా, ఇలా థర్డ్ డిగ్రీని నడి రోడ్డుమీద ప్రయోగించడం ఏమిటని కొంతమంది మంది ప్రశ్నిస్తున్నారు. చట్ట ప్రకారం కేసులు పెట్టి, కోర్ట్ లో హాజరు పరిచి , జైల్లో పెట్టాలి కానీ, అలా కొట్టే హక్కు పోలీసులకు లేదని చెబుతున్నారు. మరి ఇదే క్రిమినల్స్, రౌడీ లు ఒక పోలీస్ కానిస్టేబుల్ ను కొట్టారు,చంపబోయారు, ఇలా ప్రశ్నించేవారికి , ఆ పోలీస్ కు జరిగిందే వారికీ జరిగితే, అప్పుడూ ఇలానే మాట్లాడతారా ?

నిందితులు దళితులు అంటున్నారు, మరి బాధితుడైన ఆ పోలీస్ కానిస్టేబుల్ బీసీ , అతని భార్య ఎస్సి . మరి వారికి కులం కార్డు వర్తించదా ?

తెలంగాణ లో దిశ కేసు లో ఎన్ కౌంటర్ జరిగింధి, జగన్, కెసిఆర్ ను అసెంబ్లీ లో పొగిడాడు కదా, మరి ఆ ఎన్ కౌంటర్ లో పోయిన వాళ్ళు కూడా క్రింద కులాల వాళ్ళే . మరి అప్పుడు ఎవ్వరికీ ఆ చనిపోయిన వారి కులాలు ఎందుకు గుర్తుకు రాలేదు?

ఉత్తర్ ప్రదేశ్ లో సీఎం యోగి, ఇదే పని చేస్తుంటే, దేశం అంతా , యోగి ని పొగుడుతోంది. మరి ఇప్పుడు అదే పని ఆంధ్ర పోలీస్ లు చేస్తే, మాత్రం ఎందుకు విమర్శిస్తున్నారు ?

పసి పాప పై అత్యచారం చేస్తే, ఆ నిందితుడు దొరికితే, ఆ సందర్భాలలో, వాడిని నడి రోడ్ మీద వురి వేసి చంపాలని ప్రజలందరు డిమాండ్ చేస్తారు. మరి అలాంటి క్రిమినల్స్ నే నడి రోడ్ మీద అందరూ చూస్తూ ఉండగా కొడితే, అది తప్పు అని కొందరు ఎందుకు విమర్శిస్తున్నారు. 

పోలీస్ లు చేసినది, చట్ట పరంగా చూస్తే తప్పు, కానీ నైతికంగా చూస్తే మాత్రం ఒప్పు. కానీ, ఒక్కోసారి కొన్ని పరిస్థితుల్లో, నైతికంగా గానే నడుచుకోవాలి, అప్పుడే పోలీస్ లు ప్రజల మన్నన పొందుతారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *