24th June 2025
తన కూతురు నిహారిక విడాకుల అంశంలో, ఎట్టకేలకు, ప్రముఖ నటుడు, జనసేన ఎమ్మెల్సీ , నాగబాబు స్పందించారు. ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో నిహారిక పెళ్లి-విడాకులు, అలాగే తన కొడుకు వరుణ్ తేజ్ వివాహం విషయం లో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
ఆ ఇంటర్వ్యూ లో నాగబాబు మాటల సారాంశం ఇది.
పిల్లల మీద మన ఆలోచనలు రుద్దుకుడదు, వాళ్ళని స్వేచ్ఛగా బతకనివ్వాలి, ఆలోచించుకొనివ్వాలి, పిల్లలు తప్పు దారిలో నడిచి, నేరం వైపు వెళ్లినా, వాళ్ళ జీవితాలు నష్టం చేసుకుంటున్నా , అప్పుడు మనం కలగజేసుకోవాలి. వాళ్ళు ఎలా బతుకున్నా వదిలెయ్యాలి, వాళ్ళని ఇలానే బతుకు అని శాసించకూడదు , కానీ వాళ్ళు వెళ్లే దారిలో ముళ్ళు ఉంటే, పక్కకు దీసి, వాళ్ళు వెళ్ళేటట్టు నువ్వు చూసుకోవాలి, అంతే తప్ప నాకొడుకు , నాకేమి ఇచ్చాడు,నా కూతురు నాకేం ఇచ్చింది అని మాట్లాడటం సరి కాదు.
” నా కొడుకు, లావణ్యతో క్లోజ్ గా ఉన్నట్టు , నేను మీడియా లో వార్తలు చదివాను, కానీ నేనెప్పుడూ, వాడిని ఈ విషయం గురించి అడగలేదు, ఏదైనా ఉంటే, వాడే చెబుతాడు కదా అని. ఒకరోజు వాడే నా దగ్గరకు వచ్చి, నేను లావణ్యను పెళ్లి చేసుకుంటాను అన్నపుడు, నేను , మూడే ప్రశ్నలు అడిగాను, నీవు ఆమెతో సంతోషంగా ఉండగలవా , భవిష్యత్తులో, ఆమెతో, నీకు సమస్య రాకుండా ఉంటుందా అని అడిగాను, నాకు నమ్మకం వుంది అని వాడు చెప్పాడు, ఓకే , ప్రొసీడ్ అయిపో అన్నాను, అంతే. వాళ్ళు హ్యాపీ గా వున్నారు. నేను ఏమంటానంటే, పిల్లకు ఏమి చెయ్యాలో తెలుసు, మనం చెప్పక్కరలేద్దు. వాడి విషయం లో వాడి జడ్జిమెంట్ కరెక్ట్ అయింది.
నిహారిక విషయం లో అది మేము చేసిన తప్పు, మేము కరెక్ట్ గా జడ్జ్ చేయలేకపోయాము, తనకు సరిగా సింక్ అవలేదు, వారిద్దరూ పరస్పరం అంగీకరించి విడిపోయారు. ఇప్పుడు తను సినిమా ప్రొడక్షన్ లో బిజీ గా వుంది, కొద్దికాలం తరువాత, మరో అబ్బాయిని వివాహం చేసుకుంటుంది. ఆ సంభందం విషయం లో, మేము ఇన్వాల్వ్ అవలేదు, కుదిర్చింది మేమే , కానీ తన అంగీకారంతోనే చేసాము. ఒకబ్బాయి, అమ్మాయి పెళ్లి చేసుకున్న తరువాత, కలిసుండాలా , వద్దా అన్నది వాళ్ళ జడ్జిమెంట్. వాళ్ళు వద్దనుకున్నారు, విడిపోయారు. మధ్యలో నేను కలపడానికి ప్రయత్నించలేదు . వాళ్లనే ఆలోచించుకోమన్నాము , వారిద్దరూ గౌరవంగా నే విడిపోయారు , ఈ మీడియా లో రాసే రాతలు మేము పట్టించుకోము.
ఇదీ నాగబాబు స్పందన.