ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా సాగుతున్నాయి. పార్టీల మధ్య పొత్తుల అంశాన్ని తేల్చేందుకు ప్రధాన పార్టీల అధినేతలు స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగానే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం నాడు ఢిల్లీకి పయనం అవనున్నారు.
బుధవారం రాత్రి ఢిల్లీ చేరుకుని.. అక్కడ కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలనున్నారు చంద్రబాబు. ఈ భేటీలో బీజేపీతో పొత్తు అంశంపై ప్రధానంగా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది.