సుబ్రహ్మణ్యస్వామిని లాయర్‌గా తీసేసిన టీటీడీ!

ttd removed Subramanian Swamy as a ttd Lawer

బిజేపి మాజీ ఎంపి సుబ్రహ్మణ్య స్వామిని టీటీడీ లాయర్ పదవి నుండి , బీ. ఆర్. నాయుడు ఛైర్మన్ గా వున్న టీటీడీ బోర్డు తొలగించింది.

దీని గురించి చెప్పుకునే ముందు 2018 లో టీటీడీ పై , చంద్రబాబు సిఎం గా వుండగా 2018 లో ఈయన వేసిన పిటిషన్ గురించి చెప్పుకోవాలి. టీటీడీని ఏపీ ప్రభుత్వ ఆధీనం నుంచి తప్పించాలంటూ , అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి సుప్రీం కోర్టు లో పిటిషన్ వేసారు .ఆ పిటిషన్ వేసేముందు దానిగురించి మీడియా తో మాట్లాడుతూ టీటీడీని ఎపి ప్రభుత్వం నుంచి విముక్తి చేయాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసేందుకు చర్చలు జరుపుతున్నామని తెలిపారు. అయితే సుబ్రహ్మణ్య స్వామి వేసిన ఈ పిటిషన్, సుప్రీం కోర్టు లో విచారణ కు వచ్చిన సందర్భంలో సుప్రీం కోర్టు ధర్మాసనం…టిటిడి స్థానిక చట్టాల ఆధారంగా పనిచేస్తోందని, కాబట్టి ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది, ఆ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది.

తమిళనాడుకు చెందిన బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి జయలలితపై అక్రమాస్తుల కేసులతో పాటు, చాలా లిటిగేషన్ కేసులు ఆయన ప్రముఖులపై కేసులు వేసి ఫలితాలు సాధించారు. చాలా పేరు తెచ్చుకున్నారు. . న్యాయవ్యవస్థతో ఎప్పుడు ఎలా ఆడుకోవాలో ఆయనకు బాగా తెలుసని చెబుతారు. అందుకే జగన్ సిఎం అయిన తరువాత ఆయనకు పిలిచి పెద్ద పీట వేశారు. లాయర్ కాని ఆయనకు, టీటీడీ లో, లాయర్ పోస్టు ఇప్పించారు. ఆ సమయంలో ఆంధ్రజ్యోతి టీటీడీ మీద కొన్ని వార్తలు రాసినపుడు, ఆ ఆంధ్రజ్యోతి పత్రికపై పరువు నష్టం దాఖలు చేసేందుకు, సుబ్రహ్మణ్య స్వామికి అనుమతి ఇచ్చారు. ఈ కేసు సందర్భంగా , టీటీడీ సొమ్ముతో ప్రత్యేక విమానాల్లో తిరుపతి టు ఢిల్లీ అప్ అండ్ డౌన్ సుబ్రహ్మణ్య స్వామి చేసేవారు. కోర్టు ముందు మీడియాతో మాట్లాడుతూ చాలా రాజకీయాలు మాట్లాడేవారు. ఆ కేసులో ఇంతవరకు, ఆంధ్రజ్యోతిని కానీ.. ఆర్కేను కానీ ఆయన ఏమీ చేయలేకపోయారు. ఆయన లాయర్ కాదనే విషయాన్ని ఆంధ్రజ్యోతి ఎండి ఆర్కే బయట పెట్టి.. తానే ఎదురు పరువు నష్టం దాఖలు చేస్తున్నానని ప్రకటించేసరికి.. సుబ్రహ్మణ్య స్వామి సైలెంట్ అయిపోయారు.

ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మారి టిడిపి కూటమి ప్రభుత్వం రావడంతో, సుబ్రహ్మణ్య స్వామిని టీటీడీ లాయర్ బాధ్యతల నుంచి వెళ్లగొట్టారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *