దంగ‌ల్ లో నటించిన నటి సుహాని భట్నాగర్… ఆకస్మిక మృతి

Dangal actress Suhani Bhatnagar passes away suddenly

 

 

అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ 2016 లో నిర్మించిన విజయవంతమైన చిత్రం దంగల్ లో నటించిన యువ నటి సుహాని భట్నాగర్ కొద్దిసేప‌టి క్రితం మ‌ర‌ణించింది. కాలికి గాయం అవడంతో, ఆమె ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో కొన్ని రోజుల క్రితం చేరారు. ఆమె వాడిన మందులు సైడ్ ఎఫెక్ట్స్ చూపించడం వల్లే ఆమెకు మరణం సంభవించింది అని వార్తలు వస్తున్నాయి. అయితే వారిని ఆమె కుటుంబ సభ్యులు ధృవీకరించవలసి వుంది.. సుహాని మ‌ర‌ణ‌వార్త విన్న అమీర్‌ఖాన్ దిగ్బ్రాంతికి గుర‌య్యారు. అమె త‌ల్లింద‌డ్రుల‌కు త‌న సానుభూతిని తెలియ‌జేశారు. ఈ మేర‌కు త‌న అమీర్‌ఖాన్‌ ప్రొడ‌క్ష‌న్ హౌజ్ ఎకౌంట్‌లో ఓ పోస్టు పెట్టారు. సుహానీ అంత్య‌క్రియ‌లు ఈ రోజు సాయంత్రం ఫ‌రిదాబాద్‌లోని అజ్రోండా శ్మశానవాటికలో జ‌రగ‌నున్న‌ట్లు ఆమె కుటుంబ స‌భ్యులు తెలిపారు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *