
14th July 2025
ప్రస్తుతం కేంద్రం లో, సంకీర్ణ బీజేపీ ప్రభుత్వం టీడీపీ మద్దత్తు పై మనుగడ సాగిస్తున్నపటికీ , ఇంతవరకు రెండు కేంద్ర మంత్రి పదవులు మినహా , ఎటువంటి పదవులు టీడీపీ పొందలేదు, సంవత్సరం తరువాత, ఆ లోటు తీరేలా, టీడీపీ కి ఒక పదవి దక్కింది, అది కూడా మాములు పదవి కాదు, ఏకంగా గవర్నర్ పదవి. టీడీపీ లో అత్యంత సీనియర్ నాయకుడు, పార్టీ కి అత్యంత విధేయుడైన పూసపాటి అశోక్ గజపతి రాజు ను, గోవా రాష్ట్ర గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు ఇచ్చారు.
అయితే ఇదే రోజు, మరో రెండు రాష్ట్రాలకి కూడా కొత్త గవర్నర్లు నియమించారు. హర్యానాకి ప్రొఫెసర్ అశీం కుమార్ ఘోష్ అలాగే లద్దాక్ కి లెఫ్టినెంట్ గవర్నర్ గా కవీందర్ గుప్తాని నియమించారు.
2014 లో టీడీపీ ,బీజేపీ కలిసి పోటీ చేసి, అటు కేంద్రం లో ,ఇటు రాష్ట్రంలో NDA కూటమిగా వున్నా, అపుడు టీడీపీ గవర్నర్ పదవి ఆశించినా దక్కలేదు. తెలంగాణ టీడీపీ లో సీనియర్ నాయకుడైన మోత్కుపల్లి నరసింహులు కూడా టీడీపీ కోటా లో గవర్నర్ పదవి ఆశించారు, రాకపోవడంతో, అలిగి పార్టీ ని వీడి వెళ్లిపోయారు, 2019 ఎన్నికల ముందు చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు గుప్పించి, చంద్రబాబు పతనం చూడటమే నా లక్ష్యం అని మీడియా ముందు, బాబు ను తిట్టిపోశారు. (అదే నరసింహులు, 2023 లో జగన్ చంద్రబాబు ను జైల్లో పెట్టినపుడు, రాజమండ్రి వచ్చి మరీ, చంద్రబాబు కు, టీడీపీ కి సంఘీభావం పలకడం విశేషం ). అపుడు అసలు టీడీపీ తమకు గవర్నర్ పదవి అడగలేదా లేక, అడిగినా, కేంద్ర లో బీజేపీ ప్రభుత్వం టీడీపీ మద్దత్తు పై ఆధారపడి లేదు కాబట్టి, వారు టీడీపీ విజ్ఞప్తిని ని పట్టించుకోలేదా అన్నది తెలియదు.
అప్పటినుండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా కాలంగా ఒక గవర్నర్ పదవి వస్తుంది తమకి అని చెప్పి ఆశించారు. కొంత ఆలస్యం అయింది. ఎట్టకేలకు ఇచ్చారు ఆ ఇవ్వడం కూడా పూర్తి అర్హత గలిగినటువంటి వ్యక్త్తి అయిన , పూసపాటి అశోక్ గజపతి రాజు గారికి ఇచ్చారు. ఆయన చాలా కాలం పాటు రాజకీయాల్లో ఉన్నాడు.
అశోక్ గజపతి రాజు రాజకీయ ప్రస్థానం:
అశోక్ గజపతిరాజు తొలిసారిగా, 1978 లో, జనతా పార్టీ నుండి పోటీ చేసి , ఎమ్మెల్యే గా గెలిచి, శాసనసభ లో అడుగుపెట్టారు, ఆ తరువాత ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ స్థాపించిన తరువాత, ఆయన పిలుపు మేరకు, 1983 లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983, 1985, 1989, 1994, 1999, 2009 లో టీడీపీ నుండి పోటీ చేసి, ఎమ్మెల్యే గా గెలిచారు, ఎన్టీఆర్ సీఎం గా వున్నపుడు, ఆయన మంత్రివర్గంలో ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా, చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఆర్థిక, శాసనసభ వ్యవహారాలు, రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసారు.
అశోక్ గజపతిరాజు సతీమణి సునీలా గజపతిరాజు విజయనగరం మున్సిపల్ ఛైర్మన్‌గా పని చేసారు, 2019 ఎన్నికల్లో, ఆయన విజయనగరం ఎంపీ గా పోటీ చేసి, పరాజయం పాలయ్యారు.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయిన తరువాత, 2014 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో, అశోక్ గజపతిరాజు విజయనగరం నుండి టీడీపీ ఎంపీ గా పోటీ చేసి గెలుపొందారు, అప్పుడు, టీడీపీ కూడా , NDA లో భాగస్వామి అవడం వల్ల , టీడీపీ కి 2 మంత్రి పదవులు దక్కితే, ఒక మంత్రి పదవి, తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో, ఇసుమంతైనా అవినీతి మచ్చ లేని, నిరాడంబరుడైన అశోక్ గజపతి రాజు కు వచ్చేలా చూసారు, మరో మంత్రి పదవి అప్పడు, సుజనా చౌదరికి వచ్చేలా చూసారు చంద్రబాబు. అశోక్ గజపతి రాజుకు, అప్పుడు పౌరవిమానయాన శాఖ శాఖ దక్కింది.
2018 లో వచ్చిన విభేదాల వల్ల , టీపీడీ ,అండ నుండి బయటకు వచ్చేసింది, అప్పుడు కూడా చంద్రబాబు చెప్పగానే, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసారు. టీడీపీ అధికారంలో వున్నా, లేకున్నా, అయన ఎప్పుడూ , పార్టీ ని వీడలేదు. అందుకే చంద్రబాబు కు అయన అంటే అంత నమ్మక, గౌరవం, ఆ గౌరవానికి తగ్గట్టే, ఎప్పుడూ అశోక్ గజపతి రాజుకు, టీడీపీ పార్టీ లో అత్యున్నత పదవి అయిన , టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ పదవి ఇచ్చేవారు, చంద్రబాబు .
2014 నుండి 2018 వరకు పౌరవిమానయాన శాఖ మంత్రిగా పనిచేసినపుడు, ఆయన కృషి ఫలితంగా, విశాఖపట్నం దగ్గరలోని, భోగాపురానికి అంతర్జాతీయ విమానాశ్రయం మంజూరు అయింది.
అశోక్ గజపతి రాజు నిరాడంబరత్వం
ఒక రాష్ట్రానికి మంత్రిగా అయితేనే, వెంటనే, పెద్ద కాన్వాయ్ తో రావడం, మంది మార్బలం, తో తమ హోదా ప్రదర్శిస్తూ వుంటారు, చాలా మంది రాజకీయనాయకులు, కానీ అశోక్ గారు అందుకు పూర్తిగా విభిన్నం. రాజ వంశానికి చెందిన వ్యక్తికి తోడు, కేంద్ర మంత్రి హోదా వున్నా కూడా, ఎక్కడా తన హోదా ప్రదర్శించకుండా, సామాన్య జనంతో కలిసిపోయి, ఎన్నో సార్లు ప్రశంసలు పొందారు.
అయన సింప్లిసిటీ కి కొన్ని ఉదాహరణలు చూద్దాము, కేంద్ర విమానయాన శాఖా మంత్రిగా వున్నపుడు, ఆయన విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో, ఆయన విప్ లాంజ్ లో కూర్చునే హోదా, అవకాశం వున్నా, సామాన్య ప్రయాణీకులకు కేటాయించిన నార్మల్ లాంజ్ లోనే కూర్చునేవారు.
అశోక్ గజపతి రాజు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా వున్నపుడు, విజయవాడ నుండి ట్రైన్ లో వెళ్లాల్సి వచ్చింది, అయన రైల్వే స్టేషన్ లో ఒకటో నెంబర్ ప్లాట్ ఫార్మ్ దగ్గరలో వున్న , వెయిటింగ్ రూమ్ లో కూర్చుని ట్రైన్ గురించి ఎదురు చూస్తూ ఉండగా, స్టేషన్ మాస్టర్ ఆయన దగ్గరకు వచ్చి, ” సార్, ట్రైన్ 6 వ నంబర్ ప్లాట్ ఫార్మ్ పైకి రావాలి, కానీ నేను ట్రైన్ ఒకటో నెంబర్ ప్లాట్ ఫార్మ్ కి మారుస్తాను, మీరు , 6 వ నంబర్ ప్లాట్ ఫార్మ్ కు వెళ్ళక్కరలెద్దు “, అని చెప్పగానే, అశోక్ గజపతి రాజు గారు, ఆగ్రహంతో, ” నాగురించి, ట్రైన్ ప్లాట్ ఫార్మ్ ఎలా మారుస్తారు, అంటే ఇప్పటికే , 6 వ నంబర్ ప్లేట్ ఫార్మ్ పై వున్న వందల మంది ప్రయాణీకులు,పిల్లా ,జల్లాతో , లగేజీ తో, ఉరుక్కుంటూ, ఒకటో నెంబర్ ప్లాట్ ఫార్మ్ పైకి రావాలా? వాళ్లకెంత కష్టం,అసౌకర్యం , పర్వాలేదు, నేను 6 వ నెంబర్ ప్లాట్ ఫార్మ్ కి వెళ్ళగలను, వెళతాను, అని చెప్పారు. ఆయన స్థానంలో లో వేరే మంత్రి వుండి వుంటే , స్టేషన్ మాస్టర్ చెప్పినదానికి ఆనందంగా వొప్పుకునేవారు. కానీ, అశోక్ గారు అలా చెయ్యలేదు, అదీ అశోక్ గారి గొప్పతనం, అయన నిరాడంబరత్వానికి ఉదాహరణ.
వైసీపీ ప్రభుత్వ్వం లో , అశోక్ గజపతి రాజు కు వేధింపులు
అలాంటి అశోక్ గజపతి రాజును, వైసీపీ , 2019 లో అధికారంలోకి వచ్చాక, జగన్ సీఎం అయ్యాక, ఆయన్ని ఎన్నో ఇబ్బందులు పెట్టింది, వైసీపీ ప్రభుత్వం వున్నపుడు వున్నపుడు . ఆయన్ని , ‘వెధవ “, అని పబ్లిక్ గా అప్పటి, వైసీపీ ,దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి తిట్టాడు. రామతీర్ధం ఆలయ ధర్మకర్త పదవినుండి ఆయన్ని తొలగించింది, సింహాచలం దేవస్థానానికి ఎన్నో వందల ఎకరాలు దానం చేసిన పూసపాటి వంశానికి చెందిన అశోక గజపతి రాజును, మాన్సాస్ ట్రస్ట్ నుండి తొలగించి, ఎక్కడో వున్న ఆయన అన్న కూతురు సంచయిత ను తీసుకొచ్చి , ఆ ట్రస్ట్ కు అధ్యక్షురాలిగా నియమించారు. అశోక్ గజపతి రాజు కోర్ట్ ల్లో పోరాడి, తిరిగి, ఆ ట్రస్ట్ కు అధ్యక్షుడిగా నియమితులైనా, ఆయన ఆఫీస్ కు వెళ్ళినపుడు, అక్కడ వున్న అధికారులందరూ ఆయనకి సహకరించకుండా ఉండేటట్లు చేసింది.
విధి ఎంతో విచిత్రమైనది. 5 ఏళ్ళు తిరిగేసరికి, వైసీపీ ఘోరంగా ఓడిపోయింది, 11 సీట్లతో పాతాళానికి పడిపోయిన జగన్, ప్రతిపక్ష నాయకుడుగా కూడా కాకుండా పోయాడు, కేవలం ఒక ఎమ్మెల్యే గా మాత్రమే జగన్ మిగిలితే, 40 ఏళ్లుగా రాజకీయాల్లో వున్నా, ఒక్క అవినీతి మచ్చ కూడా లేకుండా, గౌరవ మన్ననలు పొందిన, ఏ అశోక్ గజపతి రాజునయితే, అవమానించారో , కేసు లు పెట్టి వేధించారో , ఆ అశోక్ గజపతి రాజు, ఇప్పుడు, ఉన్నత స్థానానికి ఎగబాకారు , గోవా గవర్నర్ గా నియమితులయ్యారు, ఇప్పుడు జగన్ పొరబాటున అశోక్ గజపతి రాజును కలవాలన్నా , ముందస్తు అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే. అందుకే చెరపకురా చెడేవు అన్నారు, ఆ సామెత జగన్ కు 100 శాతం వర్తిస్తుంది.
గోవా గవర్నర్ గా , సమర్ధవంతంగా ,అశోక్ గజపతి రాజు తన బాధ్యతలు నిర్వహిస్తారని ఆశిద్దాం .