చంద్రబాబు కేబినెట్ లో కొంతమంది మంత్రులకు ఉద్వాసన తప్పదా?

New ministers in Chandrababu Cabinet?

ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మార్పులు – TDP లో భారీ మార్పులు, సీనియర్లకు అవకాశం…?

ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఈ మధ్య ఒక పెద్ద చర్చ నడుస్తోంది , ఈ ఆగస్టులోనే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం భారీగా క్యాబినెట్ మార్పులు చేయబోతోంది అనే వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.  ఈ చర్చ  ప్రకారం కనీసం ఎనిమిది మంది ప్రస్తుత మంత్రులు పదవులు కోల్పోయే అవకాశం ఉంది. మరోవైపు, అనుభవజ్ఞులైన సీనియర్ నేతలకు మళ్లీ అవకాశం ఇవ్వాలనే సంకేతాలు పార్టీ అంతర్గతంగా బలంగా వినిపిస్తున్నాయి. ఈ వ్యూహం వెనుక ఏముంది? కొత్తగా ఎవరికి అవకాశం లభించబోతోంది? పూర్తి విశ్లేషణ ఇది.

సీనియర్లకు తిరిగి స్థానం  – TDP లో మారుతున్న సమీకరణాలు

చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనుభవజ్ఞులైన నేతలనే మంత్రివర్గంలోకి తీసుకునే పద్ధతిని అనుసరించారు. కానీ 2024లో యువతకు అవకాశం ఇవ్వాలని భావించి,  17 మంది ఫస్ట్‌టైమ్ ఎమ్మెల్యేలను,  మంత్రులు గా తీసుకున్నారు. వీరిలో చాలామంది శాఖలపై సరైన పట్టు సాధించలేకపోవడంతో పాలనలో లోపాలు కనిపించాయి.

కొంతమంది మంత్రులు , సబ్జెక్ట్‌పై కమాండ్ లేకపోవడం, సెక్రటరీల సలహాలు పట్టించుకోకపోవడం, స్వంత పిఏలపై అధిక ఆధారపడటం వలన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ,   ఆలస్యం అవుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో రాష్ట్ర అభివృద్ధి వేగం తగ్గుతుందని భావించిన చంద్రబాబు,  సీనియర్ నేతలకు తిరిగి కీలక స్థానాలు ఇవ్వడం ద్వారా సమీకరణాలు మార్చాలని నిర్ణయించారని** పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 స్పీకర్, డిప్యూటీ స్పీకర్,  మార్పులు ఖాయం ?

క్యాబినెట్ ప్రక్షాళనతో పాటు అసెంబ్లీ  స్పీకర్, డిప్యూటీ స్పీకర్ స్థానాల్లో  కూడా మార్పులు జరగబోతున్నట్టు చర్చ జరుగుతోంది, ఇందులో భాగంగా  ప్రస్తుత స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ ఇద్దరినీ మంత్రివర్గంలోకి తీసుకుని, స్పీకర్ స్థానాన్ని , ఉత్తరాంధ్రకు చెందిన జనసేన పార్టీ బీసీ నేతకు ఇవ్వాలని కూటమి పెద్దలు చర్చిస్తున్నారని సమాచారం.

ఈ వ్యూహం ద్వారా , జనసేనకు మరిన్ని కీలక పదవులు ఇచ్చి కూటమిని బలోపేతం చేయడం,  ఉత్తరాంధ్ర ప్రాంతంలో, కూటమి  పార్టీ బలాన్ని పెంచడం లక్ష్యంగా ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.

ఎనిమిది మంది మంత్రులు అవుట్ – ఏ జిల్లాల నుంచి?

తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, శ్రీకాకుళం, నెల్లూరు, గోదావరి, కడప, కృష్ణా జిల్లాలకు చెందిన కనీసం ఎనిమిది మంది మంత్రులు ఈసారి  క్యాబినెట్ నుంచి తప్పించబడే అవకాశం ఉంది, అనే వార్త వినబడుతోంది. 

 

దీనికి   కారణాలు ఏమై ఉండచ్చు ?

* ప్రజల్లో అసంతృప్తి పెరగడం

* శాఖల పనితీరు సరిగా లేకపోవడం

* రాజకీయ వ్యూహపరమైన అవసరాలు

చంద్రబాబు నాయుడు గతంలో కూడా , సాహసోపేత నిర్ణయాలు, తీసుకున్న చరిత్ర వుంది . ఈసారి కూడా ఆయన , పార్టీ కంటే రాష్ట్రం, వ్యక్తిగత సంబంధాల కంటే పరిపాలనలో సమర్థత,  అనే సూత్రాలను అనుసరించి, మంత్రులను మార్చే అవకాశముంది.

 కొత్తగా ఎవరికి అవకాశం లభించే ఛాన్స్ వుంది ? 

క్యాబినెట్ నుంచి ఎనిమిది మందిని తప్పిస్తే, కొత్తగా అనుభవజ్ఞులు, సీనియర్లకు అవకాశం ఇస్తే, 

వీరికి అవకాశం దక్కవచ్చని భావిస్తున్నారు. 

వుమ్మడి నెల్లూరు జిల్లా: కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి,  వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి , చంద్రమోహన్ రెడ్డి ముగ్గురిలో ఒకరు

వుమ్మడి  చిత్తూరు జిల్లా: థామస్  మురళీ మోహన్ లేదా అమర్నాథ్ రెడ్డి

వుమ్మడి కడప జిల్లా: బీటెక్ రవి (ప్రస్తుత ఎంఎల్సీ)  లేదా  రెడ్డప్పగారి మాధవి రెడ్డి

వుమ్మడి కర్నూలు జిల్లా:  కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి

వుమ్మడి అనంతపురం జిల్లా: పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు లేదా బండారు శ్రావణి

గుంటూరు జిల్లా: ఇక్కడినుండి కూడా కొంతమందిని తీసుకునే అవకాశం వుంది. 

వీరిలో చాలామంది గతంలో మంత్రి పదవులు నిర్వహించిన అనుభవజ్ఞులే కావడం గమనార్హం. వీరిలో, గత అనుభవం + గత పనితీరు, వీటి ప్రాతిపదిక పైనే , నియమించే అవకాశం వుంది. 

 కూటమి సమీకరణాలు – జనసేన, బీజేపీ పాత్ర

ఈసారి క్యాబినెట్ మార్పులు కేవలం తెలుగుదేశం పార్టీ కే పరిమితం  కాకుండా, జనసేన మరియు బీజేపీ భాగస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, జరుగుతాయి.  పవన్ అభీష్టం మీదటే ,  చంద్రబాబు ఎప్పుడో, టీడీపీ ఎమ్మెల్యేల కోటా లో  ,   జనసేన నేత, పవన్ కళ్యాణ్ సోదరుడైన నాగబాబును  ఎమ్మెల్సీ చేసిన సంగతి తెలిసిందే, అయితే మంత్రి పదవి నాగబాబు కు చంద్రబాబు ఎప్పుడో ఆఫర్ చేసినా,  నాగబాబు కు మంత్రి పదవి ఇవ్వాలా వద్దా , అనే  అంశం తానే పెండింగ్ లో ఉంచినట్టు, ఇటీవలే, పవన్, హరి హర వీర మల్లు, సినిమా ప్రమోషన్స్  సందర్భంగా , ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు. 

జనసేనకు కూడా  కీలకమైన  డిప్యూటీ స్పీకర్ పదవితో పాటు మరిన్ని మంత్రిత్వ పదవులు పొందే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది, దీనికి కారణం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చంద్రబాబే సీఎం అభ్యర్థిగా , చంద్రబాబే వుండాలని, పవన్ కోరుకోవడం, అసెంబ్లీ లో ఈ విషయం ప్రకటించడం. 

అలాగే  బీజేపీ లో, కొన్ని శాఖల్లో సమన్వయం చేసి, కొత్త నేతలకు పదవులు ఇచ్చే అవకాశం వుంది. 

ఈ మార్పులు కూటమి ఐక్యత ను మరింత బలోపేతం చేస్తుందని,   , 2029 వరకు స్థిరమైన , సమర్ధవంతమైన  పాలనకు దోహదం చేస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

2029  ఎన్నికలే లక్ష్యం 

ఈ క్యాబినెట్ మార్పుల వెనుక ప్రధాన ఉద్దేశం , 2029 ఎన్నికలకు బలమైన టీమ్  తయారు చేయడం. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గం ఆ లక్ష్యానికి తగినంత ఫలితాలు ఇవ్వలేకపోతుందని పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు.

కాబట్టి:

* వేగంగా పనిచేసే నేతలు

* ప్రజలతో నేరుగా కలిసే నేతలు

* సృజనాత్మకంగా ఆలోచించే  విజనరీ సీనియర్లు

ఇలాంటి నాయకులను ముందుకు తీసుకురావడం ద్వారా , పార్టీ  పాటు రాష్ట్ర అభివృద్ధి వేగవంతం చేయడం,ప్రతిపక్ష  పార్టీ  విమర్శలకు బలమైన సమాధానం ఇవ్వడమే లక్ష్యంగా కనిపిస్తోంది. 

రాజకీయ విశ్లేషకుల మాటల్లో,  “ఈ నిర్ణయం , సమర్ధవంతంగా  పని చేసేవారికే పదవులు, పెద్ద పీఠ ,  ఫలితాల ఆధారంగా మాత్రమే పదవులు కొనసాగుతాయి”*, అనే    రాజకీయ సందేశం  టీడీపీ శ్రేణుల్లోకి  వెళ్ళడానికే “, అని భావిస్తున్నారు. 

ఆగస్టులో జరగబోయే ఈ క్యాబినెట్ మార్పులు ఆంధ్రప్రదేశ్ రాజకీయ దిశను మార్చేంతటి ప్రభావం చూపకపోవచ్చు, కానీ . సీనియర్లకు తిరిగి అవకాశం, స్పీకర్ పదవిలో మార్పులు, జనసేనకు మరిన్ని కీలక పదవులు – ఇవన్నీ కూటమి భవిష్యత్తును బలపరిచే వ్యూహం గా భావించవచ్చు. 

ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది – చంద్రబాబు నాయుడు తీసుకోబోతున్న ఈ నిర్ణయం 2029 ఎన్నికలకు, టీడీపీ మరియు కూటమి   పార్టీ లను  సిద్ధం చేసే పెద్ద అడుగుగా నిలవబోతోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts