కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత, అసభ్యంగా సోషల్ మీడియా పోస్టులు పెట్టేవారిపై ఉక్కు పాదం మోపుతున్నారు. వైసీపీ పాలనలో టీడీపీ నాయకుల పై, వారి కుటంబాల పై అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు కొంత మంది వైసీపీ సోషల్ మీడియా వారు. బోరుగడ్డ అనిల్ , ఎంత అసభ్యంగా రెచ్చిపోయాడో అందరికీ తెలుసు. ముందుగా అతన్ని అరెస్ట్ చేసి జైలు కు పంపించారు. అతని మీద పెట్టిన వరుస కేసులతో, ఇంకో సంవత్సరం అయినా బయటకు రాడు. అలాగే వర్రా రవీందర్ రెడ్డి, ఇతను జగన్ సొంత చెల్లెలు అయిన షర్మిల, మరో చెల్లెలు సునీత పై, పవన్ కళ్యాణ్ సతీమణి పై ఎంత అసభ్యమైన పోస్టులు పెట్టేవాడో అందరికీ తెలుసు. ఇప్పుడు అతన్ని కూడా జైలు కు పంపారు.
దీనితో చాలా మంది వైసీపీ సోషల్ మీడియా అభిమానులు సైలెంట్ అయిపోయినా, మరి కొంతమంది మాత్రం పాత వాసన పోగొట్టుకోవటం లేదు. కూటమి ప్రభుత్వం అసత్య పోస్టులు, అసభ్య పోస్టులు పెడుతున్న ఇలాంటివారిని వెతికి మరీ జైలు కు పంపుతున్నారు. దీనితో, వైసీపీ నాయకులకు, ఫ్రీడమ్ అఫ్ స్పీచ్, ప్రజాస్వామ్యం గుర్తు వచ్చాయి.
ఈ అరెస్టులు అక్రమం అని ఏడ్చే వీరు, ఈ అరెస్టులు ఆపాలని, విజయబాబు అనే జర్నలిస్ట్ టర్న్‌డ్ పొలిటీషియన్‌తో హైకోర్టులో ఓ పిటిషన్ వేయించారు. ఆ పిటిషన్ సారాంశం ఏమిటంటే.. సోషల్ మీడియా లో ఎలాంటి పోస్టులు పెట్టినా భావ ప్రకటన స్వేచ్చగానే చూడాలని కేసులు పెట్టకూడదని ఆయన వాదన.
హై కోర్ట్ ఏమని తీర్పు ఇచ్చింది ?
హైకోర్టు, వ్యక్తిగతంగా అసభ్యంగా పోస్టులు పెట్టేవారిపై కేసులు పెడితే తప్పేమిటని ప్రశ్నించింది. గతంలో న్యాయమూర్తులపైనా తప్పుడు పోస్టులు పెట్టారని గుర్తు చేసింది. అన్ని కేసుల ను ఒకే గాటన కట్టకుండా, కేసుల వారీగా ఏమైనా అభ్యంతరాలు ఉంటే కోర్టుకు రావాలని చెప్పింది.
దీంతో వైసీపీ సోషల్ మీడియాకు కొత్త కష్టం వచ్చి పడింది.తమపై పెడుతున్న కేసుల విషయంలో హైకర్టుకు వెళ్లి మరీ వైసీపీ సర్టిఫికెట్ తెచ్చినట్లుగా అయింది. అసలు ఈ పరిస్థితి రావడానికి కూడా వైసీపీనే కారణం. అధికారంలో ఉన్నప్పుడు కన్నూమిన్నూ కానరాకుండా పెట్టిన పోస్టుల వల్ల .. అదీ కూడా న్యాయమూర్తులపై కూడా పెట్టిన పోస్టుల వల్లే ఈ సమస్య వచ్చింది. ఓ మాఫియా మాదిరి సోషల్ మీడియా సైన్యాన్ని నడుపుతున్న వైసీపీని ఇప్పుడు పోలీసుల కేసులు చుట్టుముడుతున్నాయి.
గతంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే పోలీసులు అరెస్టు చేసేవారు. బూతులన్నీ వైసీపీ నేతల నుంచే వచ్చేవి. వాటికి తప్పనిసరిగా కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితిని ఇతరులకు కల్పించారు. ఇప్పుడు అధికారం పోగానే నిండా మునిగిపోతున్నారు.