తెలుగు వెబ్ న్యూస్
  • వార్తలు
  • రాజకీయాలు
  • బ్లాగ్
  • విశ్లేషణ
  • మీడియా వాచ్
  • సినిమాలు
  • వీడియోలు
  • హోమ్
No Result
View All Result
తెలుగు వెబ్ న్యూస్
No Result
View All Result
Home amaravathi andhra pradesh capital gazette

అమరావతి ని రాజధానిగా, త్వరగా గెజిట్ జారీ చేయించండి, అమరావతి రైతుల అభ్యర్ధన

by dasaradh2009@gmail.com
April 30, 2025
0
Farmers request CM to issue gazette notification on Amaravati as capital soon

29th April 2025

అమరావతి నిర్మాణ పునః ప్రారంభ పనులు , మే 2 న ప్రధాని మోడీ చేతులమీదుగా ప్రారంభం కాబోతున్నాయి.

ఈ రోజు సీఎం చంద్రబాబు, అమరావతి కి భూములిచ్చిన రైతులతో ఒక సమావేశం ఏర్పాటు చేసారు, మరలా అమరావతి లో, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిమిత్తం మరో 40,000 ఎకరాలు పైన , భూ సమీకరణ లేదా ల్యాండ్ పూలింగ్ విధానంలో, సేకరిస్తారని వార్త వచ్చిన నేపధ్యం లో , రైతులలో ఒక ఆందోళన, అభద్రతాభావం
నెలకొంది అన్న వార్తలు రావడంతో, ఈ అపోహలు పోగొట్టడానికే ఈ సమావేశం ఏర్పాటు చేసారు, ఇది మంచి ప్రయత్నం.

ఈ సమావేశం, లో రైతులు అడిగిన ప్రశ్నలకు, చంద్రబాబు సమాధానం ఇచ్చారు, అన్ని సందేహాలు, నివృత్తి చేసారు.

అయితే, ఈ సమావేశం లో రైతులు సీఎం చంద్రబాబు ను ఒక ముఖ్యమైన అంశంలో లో విజ్ఞప్తి చేసారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని గా అమరావతి ని, పార్లమెంట్ లో చట్టం చేయించి, గెజిట్ జారీ చేయించాలని , సాధ్యమైనంత త్వరలో ఇది పూర్తి చేయాలనీ కోరారు, ఈ విజ్ఞప్తికి, చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు.

ఎందుకు ఈ అంశంలో రైతులు పట్టుబడుతున్నారంటే,

చంద్రబాబు 2014 లో సీఎం అయిన తరువాత, అమరావతి ని రాజధానిగా ప్రటించారు, అసెంబ్లీ లో అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్ కూడా దీనికి ఆమోదం తెలిపారు. దీనితో 33,000 ఎకరాలు భూమి ల్యాండ్ పూలింగ్ విధానంలో, రైతుల వద్దనుండి భూమి సేకరించారు, కొన్ని రోడ్లు, చాలా భవనాలు 30% పూర్తి అయ్యాయి, సచివాలయం, హై కోర్ట్, అసెంబ్లీ భవనాలు కూడా కట్టారు, ఇవి తాత్కాలికం అన్నారు అంటే, ఇవే కట్టడాలు శాశ్వితమైనవి కట్టిన తరువాత, ఈ భవనాలు, వేరే ప్రభుత్వ కార్యాలయాలకు వాడుకొచ్చు అని చెప్పారు. అయితే ఈ లోగా ఎన్నికలు వచ్చాయి.

అయితే, వైసీపీ అధికారం లో కి వస్తే, జగన్ అమరావతి ని రాజధానిగా తీసేస్తాడని టీడీపీ నాయకులు, 2019 ఎన్నికల్లో ప్రచారం చేసారు. దానికి జగన్ , “నేను ఇక్కడ అమరావతి లోనే ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబుకే ఇక్కడ ఇల్లు లేదు, జగన్ అధికారం లోకి వస్తే, రాజధాని మారుస్తాడదనేది అబద్దం , ఈ ఆరోపణలు నమ్మకండి, అని ఎన్నికల ప్రచారం లో చెప్పేవాడు, మిగతా వైసీపీ నాయకులు కూడా ఇదే ఉటకించారు.

రాజధాని ప్రజలు కూడా ఇదే నమ్మారు, అందుకే రాజధాని ప్రాంతమైన, తాడికొండ లో కూడా వైసీపీ నే గెలించింది. 2019 లో, 151 సీట్లతో ఘన విజయం సాధించిన వైసీపీ అధికారం లోకి వచ్చిన తరువాత, జగన్ ప్లేట్ ఫిరాయించాడు , దక్షిణ ఆఫ్రికా మాదిరిగానే, మనకు కూడా 3 రాజధానులు ఉంటే నే అభివృద్ధి సాధ్యమవుతుందని, అసెంబ్లీ లో స్పీచ్ ఇచ్చి, కర్నూల్ ను న్యాయరాజధానిగా, విశాఖపట్నం ను పరిపాలన రాజధానిగా అమరావతి ని కేవలం శాసన రాజధానిగా మాత్రమే ప్రకటించాడు.

దీనికి నిరసనగా భూములిచ్చిన అమరావతి రైతులు, 1400 రోజుల పాటు ఉద్యమం చేసినా, దాన్ని పోలీస్ బలగంతో అణగదొక్కేసాడు, రైతులు మీద లాఠీ ఛార్జ్ తో పాటు, అనేక కేసులు పెట్టాడు.

పోనీ న్యాయరాజధానిగా ప్రకటించిన కర్నూలు అయినా, ఇటు పరిపాలన రాజధానిగా ప్రకటించిన, విశాఖపట్నాల నయినా అభివృద్ధి చేశాడా అంటే ఏమి లేదు. రైతులు కోర్టుల్లో సుదీర్ఘ పోరాటం చెయ్యడం తో , అమరావతిని నాశనం చెయ్యాలన్న జగన్ కల నెరవేరలేదు.

ప్రజలు జగన్ మోసాన్ని గుర్తించి, తగిన బుద్ధి చెప్పడంతో, 2029 ఎన్నికల్లో, రాష్ట్రం లో అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. అమరావతి రాజధానిగా వున్న గుంటూరు తో, పాటు, అటు విజయవాడ జిల్లాల్లోనూ, టీడీపీ క్లీన్ స్వీప్ చేసి, అన్ని స్థానాల్లోనూ టీడీపీ విజయం సాధించింది, అటు న్యాయ రాజధాని కర్నూల్ లో పెట్టి, అభివృద్ధి చేస్తానని చెప్పిన, రాయలసీమ లోను, పరిపాలన రాజధాని గా విశాఖపట్నం ను చేస్తానని చెప్పిన, ఉత్తరాంధ్ర లోను వైసీపీ చిత్తుగా ఓడిపోయింది.

జగన్ ,వైసీపీ , 3 రాజధానులునినాదాన్ని ప్రజలు తిప్పికొట్టారు అని ఈ 2024 ఎన్నికలతో తేటతెల్లమయింది.

2024 లో చంద్రబాబు సీఎం అయ్యాక, మరల రాజధాని అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యాయి, 30 కోట్లు ఖర్చు పెట్టి, అడవిలా మారిన అమరావతిని , శుభ్రం చేసారు. 5 ఏళ్ళ బట్టి, నీళ్లలో నానిన అమరావతి లో భవనాల నాణ్యతను , చెన్నై ఐటీ వారితో పరీక్ష చేయించారు.

మొత్తానికి అరిష్టాలన్నీ దాటి, అమరావతి రైతుల కలగన్న రాజధాని పనులు, ఈ మే 2 నుండి ప్రారంభం కాబోతున్నాయి.

అయితే, అమరావతి రైతులలోనే, కాదు, అందరి మదిని తొలిచే, ఒక భయం, సంశయం, ఒకవేళ ,జగన్ పొరబాటున మరలా 2029 లో సీఎం అయితే, అమరావతి పరిస్థితి ఏమిటి , మళ్ళా రాజధాని మార్చడని,విధ్వంసం చేయడని నమ్మకం ఏమిటి?

ఎందుకంటే ఇంత వైసీపీ ఘోర పరాజయం తరువాత కూడా, ప్రజలు తిరుగులేని తీర్పు ఇచ్చిన తర్వాత కూడా వైసీపీ నాయకులు మారలేదు, మళ్లీ వైసీపీ ఫ్రభుత్వం వస్తే అమరావతిని మార్చేస్తాం, కూల్చేస్తామన్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. ఇది ఏపీ దౌర్భాగ్యమే అనుకోవచ్చు.

అందుకే, అలా జరగకుండా ఉండాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాజధాని గా అమరావతి ని, పార్లమెంట్ లో చట్టం చేయించి, గెజిట్ జారీచేయిస్తే, ఇక శాస్వితంగా , ఆంధ్ర ప్రదేశ్
రాజధానిగా అమరావతి ఉంటుంది, జగన్ కాదు, ఏ సీఎం వచ్చినా ,రాజధానిని మార్చలేరు.

అందుకే అమరావతి రైతులు, చంద్రబాబు ను , ఇంతలా అభ్యర్ధించింది.

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగియడంతో ఇక అడ్డంకులు వుండవు, అలాగే ప్రస్తుతం కేంద్ర బీజేపీ ఫ్రభుత్వం, టీడీపీ మద్దత్తు తో నడుస్తుండంతో , ఈ గెజిట్ చేయించడం లో ఏ ఇబ్బందులు వుండవు కాబట్టి, చంద్రబాబు అంగీకరించారు, అమరాతి గెజిట్ విడుదల చేయించేందుకు , ప్రస్తుత టీడీపీ కూటమి ఫ్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేయబోతోంది.

ఒక రహదారి విస్తరించాలంటే, దానికి కొన్ని ఎకరాల భూమి సేకరించడానికి కూడా , అన్ని రాష్ట్రాల్లోనూ, .ప్రస్తుత రోజుల్లో, ప్రభుత్వాలకు, ఎంత కష్టతరం అవుతుందో … అందరూ చూస్తున్నారు. అలాంటిది కొని వేల ఎకరాలు , రాష్ట్ర రాజధాని కోసం, దాని తో పాటు, తమ భవిష్యత్తు కూడా బాగుంటుందనే ఉద్దేశ్యంతోనే , అమరావతి రైతులు త్యాగం చేసి, ఇచ్చారు.

అమరావతి అభివృద్ధి చెందితేనే, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దానితో పాటు, వారూ అభివృద్ధి చెందుతారు. లేకపోతే లేదు. అందుకే.. రైతుల త్యాగానికి భరోసా ఇవ్వాలంటే పార్లమెంట్ లో చట్టం చేయించి, గెజిట్ ఇప్పించాల్సిందే. వీలైనంత త్వరగా అమరావతిని పూర్తి చేయాల్సి ఉంటుంది

 

 

Previous Post

వరంగల్ లో జరిగిన బీఆర్ఎస్‌ రజతోత్సవ సభ లో , కేసీఆర్ ప్రసంగంలో, కొత్తదనం ఎక్కడా కనిపించలేదు

Next Post

పాకిస్తాన్ మీద అంత ప్రేమ ఉంటే ఆ దేశానికే వెళ్లిపోండి, కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్

Related Posts

ap liquor scam accused venkatesh naidu

లిక్కర్ స్కాం లో ప్రస్తుతం జైల్లో వున్న, నోట్ల కట్ల సెల్ఫీ వీడియో తో దొరికిపోయిన వెంకటేష్ నాయుడు ది, వైసీపీ పార్టీ కాదా ?

Are by-elections going to be held soon for those 11 seats in AP?

ఏపీ లో ఆ 11 స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయా ?

Next Post
If you love Pakistan so much, then go to that country, Pawan Kalyan lashed out at Congress leaders,

పాకిస్తాన్ మీద అంత ప్రేమ ఉంటే ఆ దేశానికే వెళ్లిపోండి, కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

No Result
View All Result

Recent Posts

  • లోకేష్ రెడ్ బుక్ కు నా ఇంటి కుక్క కూడా భయపడదు, అని పదే, పదే ,అంటున్న అంబటి రాంబాబు , ఇప్పుడు జైలు కు వెళ్తున్నాడు.
  • జగన్ సీఎంగా వున్నపుడు , తన పై బాస్ కే మెమో పంపిన ప్రవీణ్ ప్రకాష్ , హఠాత్తుగా ఎందుకు ఏబివి కి , జాస్తి కిషోర్ కు క్షమాపణలు చెప్పాడు ?
  • తిరుమలలో , కల్తీ నెయ్యి స్కాం జరగలేదు….ఎందుకంటే అది అసలు నెయ్యే కాదు….విస్తుపోయే వాస్తవాలు
  • లిక్కర్ స్కాం లో ప్రస్తుతం జైల్లో వున్న, నోట్ల కట్ల సెల్ఫీ వీడియో తో దొరికిపోయిన వెంకటేష్ నాయుడు ది, వైసీపీ పార్టీ కాదా ?
  • జర్నలిస్ట్ పత్రి వాసుదేవన్ ను, తమ ఛానల్ నుండి తొలగించిన 99టీవీ…….

Archives

తెలుగు వెబ్ న్యూస్

Copyright © 2017 JNews.

Navigate Site

  • Privacy
  • About Us
  • Policy
  • Terms and conditions
  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us
  • Site Map

Follow Us

No Result
View All Result
  • వార్తలు
  • రాజకీయాలు
  • బ్లాగ్
  • విశ్లేషణ
  • మీడియా వాచ్
  • సినిమాలు
  • వీడియోలు
  • హోమ్

Copyright © 2017 JNews.