ఛాంపియన్ ట్రోఫీ లో, ఇండియా ,బంగ్లాదేశ్ మ్యాచ్ లో, ఇండియా ఘన విజయం సాధించింది.
గాయం తరువాత పునరాగమనం చేసిన, మహమ్మద్ షమీ 5 వికెట్లు పడగొట్టి ఫామ్ లోకి వచ్చాడు, రోహిత్ శర్మ మంచి స్ట్రైక్ రేట్ తో 44 పరుగులు చేసాడు, కె యల్ రాహుల్ రాణించాడు, స్పిన్నర్ అక్సర్ పటేల్ రాణించాడు. కెరీర్ లోనే సూపర్ ఫామ్ లో వున్న వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అద్భుతంగా ఆడి సెంచరీ సాధించాడు.
అయితే , కేఎల్ రాహుల్ చేసిన పనితో హార్దిక్ చిక్కుల్లో పడ్డాడు. అతడ్ని చూసి నేర్చుకోమంటూ హార్దిక్ కు కౌంటర్లు ఇస్తున్నారు నెటిజన్స్ .
ఈ మ్యాచ్‌లో గిల్ (101 నాటౌట్) సెంచరీతో నాటౌట్ గా నిలిచాడు. అయితే గిల్ సెంచరీ చేయగలడా అని తలచారు, ఎందుకంటే ఒక దశలో , గెలుపుకి కి కావలిసినవి తక్కువ పరుగులే, సెంచరీ దగ్గర లో వున్న , గిల్ కి అది పూర్తి చెయ్యగలడం సాధ్యం అవుతుందా అని అనికున్నారు.
కానీ అవతలి ఎండ్ లో వున్న కేఎల్ రాహుల్ (41 నాటౌట్), త్యాగం చేసి, గిల్ సెంచరీ కోసం నెమ్మదిగా ఆడాడు, స్ట్రైకింగ్ ఎక్కువ , గిల్ కే ఇచ్చాడు, దానివల్ల గిల్, వన్డే ల్లో, తన 8 వ సెంచరీ పూర్తిచేయగలిగాడు . ఈ విషయం లో రాహుల్ ని అభిమానులందరూ, అభినందిస్తున్నారు.
అయితే ఇదే సమయం లో హార్దిక్ ను గుర్తు చేస్తుకుంటున్నారు, హార్దిక్ అవతలి ఎండ్ లో వుండి ఉంటే, సిక్సర్లు, ఫోర్లతో మ్యాచ్ త్వరగా ముగించేసేవాడు , మైల్ స్టోన్ కు దగ్గరలో వున్న, సహచర ఆటగాడు, అవతలి బ్యాటర్ గురించి పట్టించుకోడు, తన స్వార్ధం తను చూసుకుంటాడు, అని అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.
దీనికి ఉదాహరణ ఏమి చూపిస్తున్నారంటే,
వెస్టిండీస్‌తో 2023లో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్ గెలిచింది.
ఆ సిరీస్‌లోని మ్యాచ్‌లో తిలక్ వర్మ (49 నాటౌట్) హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉండగా, భారత్ చాలా సులభంగా విజయం సాధించే స్థితిలో ఉండగా, ఇంకా రెండు ఓవర్లు మిగిలి ఉన్నా తిలక్‌కు స్ట్రైక్ ఇవ్వకుండా పాండ్యా సిక్స్ కొట్టడంతో అంతా షాక్ అయ్యారు.
ఒక జూనియర్ ఆటగాడికి అర్ధ సెంచరీ చేసే అవకాశం ఇవ్వలేదని, అప్పుడు హార్దిక్ ను నెటిజన్స్ దుయ్యబట్టారు.
ఈ బంగ్లాదేశ్ మ్యాచ్‌లో రాహుల్ ప్లేస్‌లో హార్దిక్ ఉండి ఉంటే గిల్ ను సెంచరీ సెంచరీ చేయనిచ్చేవాడు కాదని, కామెంట్స్ చేస్తున్నారు. హార్దిక్ అవతలి బ్యాటర్ గురించి పట్టించుకోడని దుయ్యబడుతున్నారు.