3 వేల కోట్లు పెరిగిన మద్యం ఆదాయం – ఈ డబ్బంతా గతంలో ఎక్కడికెళ్లింది ?

ఆంధ్ర ప్రదేశ్ లో లిక్కర్ మీద ఆదాయం 3,000 కోట్లు పెరిగిందట – గతం లో ఇంత ఆదాయం ఎందుకు లేదు?

ఏపీలో మద్యం మీద ఆదాయం పెరిగింది అని లెక్కలు బయటకు వచ్చాయి. . గత వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే 3,000 కోట్లకు పైగా పెరిగినట్లుగా లెక్కలు చూపిస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక , మద్యం పాలసీ మార్చారు, దాని ఫలితమే ఈ పెరిగిన ఆదాయమా?  గతం తో పోలిస్తే, రేట్లు బాగా తగ్గించారు, క్వార్టర్ మద్యం గతం కన్నా తగ్గించి, రూ.99కే ఇస్తున్నా ఈ మద్యం పాలసీలో ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం పెరగడం, పెద్ద విశేషం.

వైసీపీ అధికారం లో వున్న 5 ఏళ్ళు, మద్యం దుకాణాల్లో ఎక్కడ UPI  , డిజిటల్ పేమెంట్స్ లేవు, కేవలం కాష్ మాత్రమే తీసుకునే వారు.
వైసీపీ ప్రభుత్వం లో పెద్ద ఎత్తున మద్యం స్కాం జరిగింది అనడానికి, ఈ ఒక్క కారణం చాలు, మద్యం స్కాం విచారణకు పునాది ఈ ఒక్క కారణమే అని  అని టీడీపీ నాయకులు చెబుతున్నారు.

మద్య నిషేధం హామీ ఇచ్చాము కాబట్టే, ముట్టుకుంటే షాక్ కొట్టినట్టు రేట్లు పెంచామని వైసీపీ ప్రభుత్వం చెపుతుండేది., కానీ ఆదాయం చూస్తే మాత్రం తక్కువ ఉండేది. అప్పుడు రేట్లు బాగా పెంచారని తెలిసినా, అలవాటున్నవారు , ఎక్కడ తగ్గకుండా కొని తాగేవారు. అయినా అప్పుడు ఎందుకు తక్కువ ఆదాయం వచ్చేదో అర్ధం కాదు.

మద్యం స్కాం పూర్తి వివరాలు, ప్రభుత్వం బయటపెట్టిన తరువాతే, ఈ తక్కువ ఆదాయానికి కారణం తెలిసేటట్టుగా వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *