మిస్ వరల్డ్ పోటీలనుండి అనూహ్యంగా వైదొలగిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ, తనను ఓ వేశ్యలా ట్రీట్ చేశారని విమర్శలు చేసిన మాగీ

25th May 2025

 

మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ప్రతిపక్ష BRSనుండి ఈ పోటీలు తెలంగాణ లో కొన్ని కోట్లు పెట్టి నిర్వచించడం పై విమర్శలు వస్తున్నప్పటికే , కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా తగ్గలేదు.

మిస్ వరల్డ్ పోటీల నుంచి బ్రిటన్‌కు చెందిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ అనూహ్యంగా తప్పుకుంది . మొదట తాను వ్యక్తిగత కారణాలతో వైదొలగుతున్నానని చెప్పిన మాగీ.. ఆ తరువాత మాత్రం సంచలన ఆరోపణలు చేశారు. ఈ పోటీల్లో మమ్మల్ని కేవలం ప్రదర్శన ఇచ్చే కోతుల్లా చూస్తున్నారు, . అంతే కాకుండా ఓ వేశ్యలా ట్రీట్ చేసారు , ఈ తీరు నన్ను మానసికంగా గాయపరిచింది. ఇవీ ఆమె చేసిన ఆరోపణలు

దీని వెనుక నేపధ్యం గురించి చెప్పే ముందు…….

ఈ మిస్ వరల్డ్ పోటీ లో, 109మంది పాల్గొంటున్నారు, వివిధ దేశాలనుండి వచ్చారు.

ఈ అందాల పోటీల గ్రాండ్ ఫైనల్ , హైదరాబాద్ హైటెక్స్ లో మే 31 న జరగబోతోంది.

ఈ పోటీలు మొదలయినప్పుడే, పహాల్గమ్ ఉగ్రదాడి జరగడం, కొద్ది రోజులు, దేశం లో ఆగ్రవేశాలు వ్యక్తం కావడం, ఆ తరువాత, భారత
ప్రభుత్వం, పాకిస్తాన్ లో నిర్వహిస్తున్న ఉగ్రవాదుల స్థావరాల పై , క్షిపణి దాడులు చేసి, 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టడం జరిగింది, మొత్తానికి , ఈ ఎపిసోడ్ జరుగుతున్నఅన్ని రోజులు, దేశ, రాష్ట్ర ప్రజల దృష్టి, ఎమోషన్స్, అన్ని వీటి చుట్టూనే తిరగడంతో, ఈ అందాల పోటీలను అంతగా పట్టించుకోలేదు. ఒక్కసారి భారత సైన్యం దాడి పూర్తి అవ్వడం, రోజులు గడవడం, ప్రజల ఎమోషన్ తగ్గిన తరువాత మాత్రమే, తెలంగాణ ప్రజల ద్రుష్టి ఈ అందాల పోటీలపై మళ్లింది .

ఇక అప్పటినుండి, ప్రపంచ నలుమూలలనుండి వచ్చింది ఈ కంటెస్టెంట్లను , తెలంగాణ లోని చార్మినార్, వరంగల్ లోనే కోటప్ప కొండ వంటి చారిత్రాత్మక స్థలాలు కు తీసుకెళ్లి, వాళ్ళతో అక్కడ షో లు నిర్వహిచారు ఈ ఈవెంట్ నిర్వాహకులు , వీటితో, తెలంగాణా టూరిజానికి మంచి పబ్లిసిటీ వస్తుందని ,ప్రభుత్వం భావించింది.

ఈ కంటెస్టెంట్లు, AIG హాస్పిటల్ కు వెళ్లి అక్కడ పేషంట్లు గా వున్న చిన్న పిల్లలను పరామర్శించారు, వారితో కబుర్లాడి, వారిని ఉత్సాహపరిచారు.

గచ్చిబౌలి స్టేడియం కు తీసుకెళ్లి, వారితో అక్కడ ఆటలాడించి సందడి చేయించారు.

ప్రసిద్ధి చెందిన రామోజీ ఫిలిం సిటీ కు కూడా, వీరిని తీసుకెళ్లారు.

ఇలా రోజుకో, ప్రదేశానికి వారిని తిప్పడంతో, అందాల పోటీలు , ఇన్ని రోజులు, ఇలా కూడా నిర్వహిస్తారా అని సందేహాలు వ్యక్తం అయ్యాయి, సామాన్య జనంలో.

వరంగల్ రామప్ప దేవాలయానికి తీసుకెళ్లినప్పుడు, ఈ కంటెస్టెంటుల చేత చీరలు ధరింపజేశారు, అంతవరకు బాగానే వుంది కానీ, వారందరినీ కూర్చోబెట్టి, ఈవెంట్ నిర్వాహకులు, తెలంగాణ సంప్రదాయం అని చెప్పి, కొంత మంది మహిళలతో వీళ్ళ కాళ్ళు కడిగించారు. తెలంగాణ మహిళల ఆత్మ గౌరవాన్ని , ఇలా కాళ్ళు కడిగించడం ద్వారా దెబ్బ తీస్తారా అని విమర్శలు కూడా ఎదురయ్యాయి.

మొత్తానికి, ఈ విమర్శలు, అనుమానాలు , మధ్య ఈ ఈవెంట్ కొనసాగుతూ ఉండగా, హఠాత్తుగా చిన్న కుదుపు.

హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల నుంచి బ్రిటన్‌కు చెందిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ అనూహ్యంగా వైదొలగింది.

మే 7 న హైదరాబాద్ వచ్చిన ఈ మిల్లా మాగీ, మే 16 న తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళిపోయింది

అయితే, ఇక్కడనుండి , వెళ్ళేటపుడు వ్యక్తిగత కారణాలతో వైదొలగుతున్నానని చెప్పిన మాగీ, ఇంగ్లాడ్ వెళ్ళాక మాత్రం అక్కడ
సన్ టాబ్లాయిడ్ పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో , హైదరాబాద్ లో జరుగుతున్న ఈ ప్రపంచ అందాల పోటీల నిర్వహణ పై,
సంచలన ఆరోపణలు చేసింది.

ఆ ఆరోపణలు ఆమె మాటల్లో చూస్తే,

” ప్రొద్దున లేవగానే మేకప్ వేసుకోవాలి, 24 గంటలు ఆ మేకప్ తోనే ఉండాలి.

డిన్నర్ పార్టీ లు నిర్వహించేవారు. ప్రతి టేబుల్ లో , ఇద్దరు కాంటెస్టులతో పాటు, స్పాన్సరర్లు అని చెప్పి, ఆరుగురు మధ్య వయస్కులైన మగవారిని కూర్చోబెట్టేవారు. ఈ కంటెస్టెంట్లు వారిని , తమ కబుర్లు, తో ఎంటర్టైన్ చెయ్యమనేవారు.

నా  అభిరుచికి తగ్గ విషయాలు చెబితే, అక్కడ కూర్చున్న , ఏ స్పాన్సరర్ ఇంట్రెస్ట్ చూపలేదు. నాకు ఇక్కడ , CPR, Frist Aid గురించి, స్కూల్ పిల్లల్లో అవగహన కలిగించే కార్యక్రమాలు చేస్తూ వుంటాను,ఆ విషయాలు చెబితే, వారు ఆసక్తి చూపించకుండా ,ఇబ్బందిగా చూసేవారు. వారికి ఎంతసేపు చిల్లర కబుర్లు కావాలి

బ్యూటీ విత్ పర్పజ్ అని, ఈ పోటీ కి వెళ్ళాను, కానీ, నన్ను ఓ ఆటబొమ్మలా చూసారు.

ఈ పోటీల్లో మమ్మల్ని కేవలం ప్రదర్శన ఇచ్చే కోతుల్లా చూస్తున్నారు, . అంతే కాకుండా ఓ వేశ్యలా ట్రీట్ చేసారు , ఈ తీరు నన్ను మానసికంగా గాయపరిచింది.

ఇవీ ఆమె చెప్పిన విషయాలు.

ఇది కాకుండా, ఆమె పర్సనల్ గా ఒక వీడియో చేసింది, అందులో ఆమె మాట్లాడుతూ,

“హైదరాబాద్ లో మమ్మల్ని, బస్సులో, రకరకాల ప్రదేశాలకు తీసుకెళ్లినప్పుడు, రోడ్ ప్రక్కన, పేదరికం లో మగ్గుతున్న వారిని చూసేవారం.

వారిని, బస్సు దిగి, పలకరిద్దాము అంటే, నిర్వాహకులు అందుకు వొప్పుకునేవారు కాదు.

ఒక పక్క, రోజూ, మేము బాగా డబ్బు వున్న వారితో పార్టీ లలో మునిగితేలుతూ ఉండటం , మరో పక్క, ఇలాంటి పేదవారిని చూడటం , మనసు ఆగేది కాదు, అది సబబు కాదు అనిపించేది.

ఇవన్నీ చూసి, ఇక భరించలేక, ఆ పోటీ నుండి వైదొలగి బయటకు వచ్చేసాను”, ఇదీ ఆమె చెప్పిన మాటలు.

అయితే, అందాల పోటీలు కేవలం అందాల ప్రదర్శన కొరకు మాత్రమే , అంతే కానీ, ఈ పోటీల ద్వారాసమాజం లో ఎలా మార్పు తెద్దామనుకుందో అర్ధం కాదు , రెండిటికి పొంతనే లేదు.

అందాల పోటీల పాల్గొనేవాళ్ళు, ఈ పోటీలలో, రక రకాల ప్రశ్నలు జవాబులు ఇస్తూ, సమాజాన్ని కూడా ఉద్ధరిస్తాము
అని కబుర్లు చెబుతూ వుంటారు. అందాల పోటీ లో గెలిచిన వాళ్ళు, ఆ తరువాత ఈ ఊసే ఎత్తరు, వారి గ్లామర్ ,సినీ ప్రొఫెషన్ లో
మునిగిపోతారు , ఇది ఎన్నో ఏళ్ళనుండి రుజువయిన సత్యం .

అందుచేత, పోటీ నుండి వైదొలగిన ఈ మాగి, దానికి చెప్పిన కారణాలు లాజిక్ కు అందటం లేదు.

అయితే, చేసిన ఆరోపణలు, ఈ పోటీ ఇమేజ్ ను దెబ్బ తీసేవిధంగా ఉండటంతో, ఈ పోటీ నిర్వాహకులు స్పందించారు.

మాగీ చేసిన ఆరోపణల్లో నిజం లేదని, ఆమె తల్లి దండ్రులు అనారోగ్యం పాలవడంతో, వారిని చూసుకోవాలని, అందుకే వెళ్ళిపోతున్నాని చెప్పిందని అలాగే ఇక్కడ హైదరాబాద్ లో వున్నపుడు, ఈ పోటీ లో రోజూ జరిగే వివిధ కార్యక్రమాలను, తాను ఎంజాయ్ చేస్తున్నాని మాగీ చెప్పిన వీడియో లు కూడా బయటపెట్టారు.

104 ఏళ్ళ అందాల పోటీ ల చరిత్రలో, ఒక పార్టిసిపంట్ ,  మధ్య లో, ఇలా హఠాత్తుగా, వైదొలగడం ఇదే మొదటి సారి.
మాగీ ఆరోపణలతో, ఈ పోటీలతో, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని భావించిన, తెలంగాణ ప్రభుత్వం, షాక్ తింది,
ఈ ఆరోపణలపై విచారణకు తక్షణం ఆదేశించింది.

ఈ విచారణ అనంతరం, మాగీ చేసిన ఆరోపణలు ఎంతవరకు నిజమో మనకు తెలిసే అవకాశం వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *