ఢిల్లీ సీఎం గా ఎవరు వుండబోతున్నారో అన్న సస్పెన్స్, బుధవారం సాయంత్రం వీడింది.
రేఖా గుప్తా…. రేపు ఢిల్లీ ముఖ్యంత్రిగా ప్రమాణస్వీకారం…. నేపధ్యం ఏమిటి ?
ఢిల్లీ సీఎం పోస్టుకు పోటీ పడిన ప్రముఖుల్లో, పర్వేశ్ వర్మ (సాహిబ్ సింగ్ వర్మ కొడుకు) పేరు వినిపించింది. అయితే, ఇప్పుడు ఢిల్లీ సీఎం గా
మొదటి సారి ఎమ్మెల్యే గా గెలిచిన రేఖా గుప్తా, 20 న ప్రమాణస్వీకారం చేస్తున్నారు , 27 సంవత్సరాల తర్వాత దేశ రాజధానిలో అధికారంలోకి
వచ్చిన బీజేపీ పార్టీ హై కమాండ్ ఆవిడ పేరు ఖరారు చేసింది , పర్వేశ్ వర్మ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయబోతున్నాడు…
2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో, రేఖ గుప్తా షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుండి 68,200 ఓట్లతో గెలిచారు.
ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే, రేఖా గుప్తా నేపధ్యం గురించి అందరు నెట్ లో వెతుకులాట మొదలు పెట్టారు.
ఆమె ప్రస్తుత వయసు 50 ఏళ్ళు
ఎటువంటి రాజకీయ నేపధ్యం లేని, రేఖా గుప్తా, హర్యానాలోని జింద్ జిల్లా, నందిగఢ్ గ్రామం లో జన్మించారు … తండ్రి పేరు, జైై భగవాన్, ఈయన SBI జనరల్ మేనేజర్ గా పని చేసారు, … ఉద్యోగ రీత్యా అయన ఢిల్లీ కి బదిలీ అయినపుడు, ఆవిడ కుటుంబం ఢిల్లీ కి బదిలీ అయ్యింది.
రేఖా గుప్తా భర్త మనీష్ గుప్తా… ఢిల్లీలోనే స్పేర్ పార్ట్స్ వ్యాపారం చేస్తున్నారు … రాజకీయాల్లో ఆమె నిలబడటానికి ఆయన బలమైన మద్దత్తు ఇచ్చారు.
ఆవిడ కుమార్తె హర్షిత తండ్రి కి వ్యాపారం లో చేదోడు గా వుంటున్నారు.
మున్సిపల్ కౌన్సిలర్ నుండి……….ఢిల్లీ ముఖ్యమంత్రి వరకు, ఆమె పొలిటికల్ కెరీర్ చూస్తే………………
1992లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని దౌలత్ రామ్ కళాశాలలో లా కోర్స్ చేసారు, అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ )తో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. 1996-97లో, ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్ యూనియన్(డియుఎస్‌యు) జనరల్ సెక్రెటరీగా, అధ్యక్షురాలిగా కూడా చేసారు.
1995 లో ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్ యూనియన్ జనరల్ సెక్రెటరీగా, వున్నప్పటి ఫోటో
2007లో ఉత్తర పితంపుర నుండి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు.
ఆమె 2012లో తిరిగి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు , తరువాత దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (SDMC) మేయర్‌గా పనిచేశారు,
తరువాత ఢిల్లీ బీజేపీ విభాగం ప్రధాన కార్యదర్శి గా, మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలు గా పని చేసారు. ఒకసారి, ఢిల్లీ మేయర్ అభ్యర్థిగానూ
పోటీ చేసారు.
ఢిల్లీ మహిళా ముఖ్యమంత్రులలో ఆమె నాలుగవ వారు.
ఇంతకుముందు , మహిళా ముఖ్యమంత్రులు షీలా దీక్షిత్ (కాంగ్రెస్ ), సుష్మాస్వరాజ్(బీజేపీ ), అతిషి(ఆప్ )
మొదటి సారి గా మాత్రమే ఎమ్మెల్యే గా గెలిచి, సీఎం అయిన అతి తక్కువ మందిలో రేఖా గుప్తా నిలుస్తారు.