తెలుగు వెబ్ న్యూస్
  • వార్తలు
  • రాజకీయాలు
  • బ్లాగ్
  • విశ్లేషణ
  • మీడియా వాచ్
  • సినిమాలు
  • వీడియోలు
  • హోమ్
No Result
View All Result
తెలుగు వెబ్ న్యూస్
No Result
View All Result
Home News

టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ….సరి అయిన నిర్ణయం సరి అయిన సమయంలో .

by dasaradh2009@gmail.com
June 13, 2025
0
Rohit sharma retirement from cricket

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{"transform":1,"addons":1,"adjust":1},"is_sticker":false,"edited_since_last_sticker_save":true,"containsFTESticker":false}

ఇంగ్లాడ్ పర్యటనకు, ప్రధాన కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ , రోహిత్ శర్మ ను సెలెక్ట్ చేయరని, రోహిత్ ను తప్పుకోమంటున్నారని ,రోహిత్ ను రిటైర్ అవ్వమంటున్నారని, ఇలా గత కొద్ది నెలల నుండి వస్తున్న వార్తలు నిజమో లేదో, తెలియదు, కానీ, రోహిత్ శర్మ అకస్మాత్తుగా టెస్ట్ క్రికెట్ నుండి తాను రిటైర్ అవుతున్నట్టు, ఈరోజు, ఇంస్టాగ్రామ్ లో తెలిపాడు.

ఇప్పటివరకు 67 టెస్టు మ్యాచులు ఆడిన రోహిత్.. 4,301పరుగులు చేశారు. అందులో 12 సెంచరీలు , 18 అర్దసెంచరీలు ఉన్నాయి.

వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్ మెన్ గా రోహిత్ నిలిచాడు

రోహిత్ సారధ్యంలో వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కు చేరాము, 2024 టీ20 ప్రపంచ కప్ భారత్ కు అందించాడు, 2025 ఛాంపియన్ ట్రోఫీ కూడా భారత్ కు అందించి, భారత్ కు లభించిన విజయవంతమైన కెప్టెన్ లలో ఒకడిగా నిలిచాడు.

అయితే టెస్ట్ ఫార్మేట్ లో చూసుకుంటే,

రోహిత్ నాయకత్వం లో, స్వదేశంలో బాంగ్లాదేశ్ తో సిరీస్ ఇండియా గెలిచింది, కానీ, స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో వైట్‌వాష్ అయి, ఘోరమైన ఓటమి చవి చూసింది. విదేశాలలో ఓడిపోయినా , ఎవరూ అంతగా పట్టించుకోపోదురు, కానీ, స్వదేశం లో ఎప్పుడూ ఇంత ఘోరమైన ఓటమి చవిచూడలేదు. అప్పుడే క్రికెట్ ప్రేమికులు, మాజీ క్రికెటర్లు , జట్టును తీవ్రంగా విమర్శించారు. అవమానాలు పాలైన భారత జట్టు, ఆస్ట్రేలియా సిరీస్ లోనయినా రాణించి, ఈ ఓటమిని మరిపిస్తుంది అనుకున్నారు.

రోహిత్ లేకుండా , ఆస్ట్రేలియా లో పెర్త్ లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ ఇండియా గెలవడంతో, ఇండియా మళ్ళీ విజయాల బాట పట్టింది, అని అందరూ సంతోషించారు, కానీ, రోహిత్ కెప్టెన్ గా ఆడిన మిగతా 3 టెస్టులతోపాటు, రోహిత్ తప్పుకున్న, ఆఖరి, సిడ్ని టెస్ట్ లో కూడా ఇండియా ఓడిపోయి, సిరీస్ 1-3 తో ఘోరంగా ఇండియా ఓడిపోయింది.

రోహిత్ ఐదు ఇన్నింగ్స్‌లలో 6.2 సగటుతో కేవలం 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు. పేలవమైన ఫామ్ కారణంగా, 3 టెస్ట్ మాచ్ లలో అస్సలు పరుగులు చేయలేక, విఫలం అయి, తన ఫామ్ పై వస్తున్న విమర్శలకు జడిసి, సిడ్నీలో జరిగిన ఆఖరిది మరియ సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ నుండి వైదొలగాలని నిర్ణయించుకుని, రోహిత్, జస్ప్రీత్ బుమ్రాకు కెప్టెన్సీని అప్పగించాడు.

ఆస్ట్రేలియా టెస్ట్ పర్యటనలో నిరాశపరిచే ప్రదర్శన తర్వాత, అజిత్ అగార్కర్ మరియు టీం ఇండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని BCCI సెలక్షన్ కమిటీ ఆదేశాల మేరకు రోహిత్ శర్మ రంజీ ట్రోఫీలో ఆడటానికి తిరిగి వచ్చాడు, దీనివల్ల రోహిత్ మరలా ఫామ్ లోకి రాయడానికి ప్రయత్నించవచ్చు అని క్రికెట్ వర్గాలు ఆశించాయి.

అయితే, ముంబైలోని శరద్ పవార్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్‌లో జమ్మూ కాశ్మీర్‌తో ముంబై రంజీ మాచ్ లో మొదటి ఇన్నింగ్స్ విఫలమైన రోహిత్ , రెండో ఇన్నింగ్ లో దూకుడుగా ఆడి , 28 పరుగులు చేశాడు, అయితే, టెస్ట్ క్రికెట్ లో ఎక్కువసేపు క్రీజ్ లో వుండి ,బేటింగ్ ఎక్కువ సేపు చేసి, ఫామ్ అందిపుచ్చుకోవాల్సిన రోహిత్, దూకుడుగా ఆడి వికెట్ సమర్పించుకోడం పై, విమర్శలు వచ్చాయి, ఫలితంగా అంతర్జాతీయ ఆటగాళ్లు వున్న ముంబై, అనామక జట్టు అయిన, జమ్ము కాశ్మీర్ జట్టు చేతిలో ఓడిపోయింది .

అయితే, అందరు అంచనాలను తల్ల క్రిందులు చేస్తూ, దుబాయ్ లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ లో, మళ్ళీ తన ఫామ్ ను దొరకబుచ్చుకుని , వ్యక్తిగతంగా రాణించాడు, జట్టును అన్ని లీగ్ మ్యాచెస్ లోను గెలిపించాడు. ట్రోఫీ ఫైనల్ లో కీలకమైన 72 పరుగులు చేసి, ఫైనల్ లో భారత్ ను గెలిపించాడు , భారత జట్టు కు ఛాంపియన్స్ ట్రోఫీ అందించి, తన పై న్యూజిలాండ్ సిరీస్ నుండి అప్పటిదాకా వచ్చిన విమర్శలన్నీ , రూపుమాపి, అభిమానుల దగ్గర ప్రశంసలు అందుకున్నాడు

తరువాత వచ్చిన ఐపీల్ 2025 లో మొదటి కొద్ది మ్యాచెస్ లో తడబడ్డా , తరువాత మ్యాచెస్ లో రాణించి, తన ఫామ్ లో మార్పు లేదని చాటి చెప్పాడు.

కానీ , టెస్ట్ ఫార్మేట్ లో మాత్రం గత 3 ఏళ్ళనుండి రోహిత్ దారుణంగా విఫలం అవుతున్నాడు. అందుకే ఈ జూన్ లో జరిగే ఇంగ్లాండ్ పర్యటనకు రోహిత్ ను అసలు ఆటగాడిగానే సెలెక్ట్ చెయ్యరు, జట్టులోనుండి తనంతట తననే తప్పుకోమని సెలెక్టర్లు సూచిస్తున్నారని వార్తలు వచ్చాయి.

మొత్తానికి ఏమి జరిగిందో తెలియదు, కానీ, రోహిత్ హఠాత్తుగా టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ఇస్తున్నట్టు, వన్ డే ఫార్మేట్ లో మాత్రం కొనసాగుతానని ప్రకటించాడు. ఒకరకంగా అవమానంతో జట్టు నుండి వెళ్లగొట్టబడకుండా, టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించి ,హుందా అయిన పని చేసాడు.

అయితే, వచ్చే సంవత్సరం T20 వరల్డ్ కప్ జరుగుతుంది కాబట్టి, భారత్ వన్ డే మేచ్ లు తక్కువ ఆడుతుంది, T20 మేచ్ లు ఎక్కువ ఆడుతుంది కాబట్టి, రోహిత్ , భవిష్యత్తు లో గ్రౌండ్ లో కనబడే అవకాశాలు చాలా తక్కువ గా కనబడుతున్నాయి.

ఇప్పటికే 38 నిండిన రోహిత్, వచ్చే సంవత్సరానికి అన్ని ఫార్మాట్ లలో రిటైర్ అయ్యే అవకాశం మాత్రం చాలా ఎక్కువ కనిపిస్తోంది, 2028 వన్ డే వరల్డ్ కప్ దాకా కొనసాగే అవకాశాలు , చాలా తక్కువ గా కనిపిస్తున్నాయి.

 

 

Previous Post

“ఆపరేషన్ సింధూర్”………పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్ర క్యాంపులపై భారత్ అర్ధరాత్రి మెరుపు దాడి…….. 9 స్థావరాల ధ్వంసం

Next Post

చంద్రబాబు కే నా, నాకూ జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించండి , హై కోర్ట్ లో పిటిషన్ వేసిన జగన్

Related Posts

ambati rambabu arrested

లోకేష్ రెడ్ బుక్ కు నా ఇంటి కుక్క కూడా భయపడదు, అని పదే, పదే ,అంటున్న అంబటి రాంబాబు , ఇప్పుడు జైలు కు వెళ్తున్నాడు.

praveen prakash apologize to abv and jasthi kishore

జగన్ సీఎంగా వున్నపుడు , తన పై బాస్ కే మెమో పంపిన ప్రవీణ్ ప్రకాష్ , హఠాత్తుగా ఎందుకు ఏబివి కి , జాస్తి కిషోర్ కు క్షమాపణలు చెప్పాడు ?

Next Post
provide z plus security to me

చంద్రబాబు కే నా, నాకూ జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించండి , హై కోర్ట్ లో పిటిషన్ వేసిన జగన్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

No Result
View All Result

Recent Posts

  • లోకేష్ రెడ్ బుక్ కు నా ఇంటి కుక్క కూడా భయపడదు, అని పదే, పదే ,అంటున్న అంబటి రాంబాబు , ఇప్పుడు జైలు కు వెళ్తున్నాడు.
  • జగన్ సీఎంగా వున్నపుడు , తన పై బాస్ కే మెమో పంపిన ప్రవీణ్ ప్రకాష్ , హఠాత్తుగా ఎందుకు ఏబివి కి , జాస్తి కిషోర్ కు క్షమాపణలు చెప్పాడు ?
  • తిరుమలలో , కల్తీ నెయ్యి స్కాం జరగలేదు….ఎందుకంటే అది అసలు నెయ్యే కాదు….విస్తుపోయే వాస్తవాలు
  • లిక్కర్ స్కాం లో ప్రస్తుతం జైల్లో వున్న, నోట్ల కట్ల సెల్ఫీ వీడియో తో దొరికిపోయిన వెంకటేష్ నాయుడు ది, వైసీపీ పార్టీ కాదా ?
  • జర్నలిస్ట్ పత్రి వాసుదేవన్ ను, తమ ఛానల్ నుండి తొలగించిన 99టీవీ…….

Archives

తెలుగు వెబ్ న్యూస్

Copyright © 2017 JNews.

Navigate Site

  • Privacy
  • About Us
  • Policy
  • Terms and conditions
  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us
  • Site Map

Follow Us

No Result
View All Result
  • వార్తలు
  • రాజకీయాలు
  • బ్లాగ్
  • విశ్లేషణ
  • మీడియా వాచ్
  • సినిమాలు
  • వీడియోలు
  • హోమ్

Copyright © 2017 JNews.