2014 లో నగరి నియోజకవర్గంలో, రోజా, టీడీపీ అభ్యర్థి సీనియర్ నాయకుడు అయిముద్దు కృష్ణమ నాయుడి పై, 800 ఓట్లతో మాత్రమే గెలుపొందారు. ఆ తరువాత ఆయన మరణించారు. అప్పటినుండి అయన పెద్ద కొడుకు గాలి భానుప్రకాష్ కు, చిన్న కొడుకు జగదీశ్ కు సరిపడటం లేదు . తండ్రి చనిపోయాక ఎవరి దారి వారిదయింది. 2019 లో టీడీపీ టికెట్ సాధించడానికి, ముద్దు కృష్ణమ వారసులుగా, పెద్ద కొడుకు గాలి భాను ప్రకాష్, చిన్న కొడుకు, గాలి జగదీశ్ పోటీ పడ్డారు. తల్లి కూడా, జగదీశ్ వైపే మొగ్గినా, చంద్రబాబు మాత్రం పెద్ద కొడుకు భాను ప్రకాష్ కే టికెట్ ఇచ్చారు. దానికి కూడా ఒక కారణం వుంది. జగదీష్ మామ కర్ణాటకకు చెందిన ఓ రాజకీయ నేత. ఆయన గతంలో చేసిన పనుల వల్ల చంద్రబాబు ఆయనను దూరం పెట్టారు . 2019 లో టీడీపీ అధికారం కోల్పోయింది, భానుప్రకాష్ కూడా ఓడిపోయారు,2014 లో 800 ఓట్లతో గెలిచినా రోజా, 2019 లో కూడా కేవలం 2000 ఓట్లతో గెలిచిందంటే, ఆమె ఆ 5 ఏళ్ళు నియోజకవర్గానికి ఏమి చేయనట్టే, పట్టు సాధించినట్టే, కానీ, వైసీపీ హవా లో ఆమె గట్టెక్కింది. రెండవసారి గెలిచినా రోజా, మంత్రి కూడా అయింది.