నరేంద్రమోదీ నాయకత్వం లేకుండా బిజేపీ మనుగడ సాగించగలదా అధికారంలో కొనసాగగలదా ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నం అవుతుంది అంటే ఈ మధ్యకాలంలో ఆర్ఎస్ఎస్ కొత్త నాయకత్వం కావాలి బిజెపీకి అనే ధోరణలో మాట్లాడుతుంది. ఈ మధ్యనే ఆర్ఎస్ఎస్ సరస్ సంఘ చాలక్ ఆయనే చీఫ్ ఆర్ఎస్ఎస్ కి మోహన్ భగవత్ గారు ఆయన ఒక ప్రకటన చేశాడు ఏమన్నాడు ఆయన 75 ఏళ్ళ నిండిన నాయకులంతా కూడా రాజకీయ పదవుల నుంచి వైదొలగాలి అన్నాడు. నరేంద్ర మోదీ గారికి 75వ సంవత్సరం వస్తుంది ఇప్పుడు అంటే పరోక్షంగా నరేంద్రమోదీ ప్రభుత్వ నాయకత్వ పదం నుంచి వైదొలగాలి అనేటువంటి మెసేజ్ ని ఆర్ఎస్ఎస్ ఇస్తోంది.
ఆర్ఎస్ఎస్ కానివ్వండి ఆర్ఎస్ఎస్ నాయకులు కానివ్వండి మరి ముఖ్యంగా మరి ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భగవత్ లాంటి వాళ్ళు ముందు వెనక ఆలోచించకుండా ప్రకటనలు చేయరు. వాళ్ళు ఏ ప్రకటన చేసినా దాని వెనక చాలా ఆలోచన ఉంటుంది. కాబట్టి 75 ఏళ్ళు నిండిన వాళ్ళు పదవుల్లో కొనసాగకూడదు అనిఅంటే అర్థం ఏంటి ఎవరిని ఉద్దేశించి అన్నట్టు స్పష్టంగా నరేంద్ర మోదీనే అయితే నరేంద్రమోదీ లేని బిజెపీ ని ఇవాళ ఊహించుకోగలమా చాలా కాలంగా జరుగుతున్న సర్వేల్లో ఏం తేలుతుందంటే బిజెపీ కి ఉన్న మద్దతు కంటే నరేంద్ర మోదీ నాయకత్వానికి ఉన్న మద్దతు ఎక్కువ అని ఆయన
చూసే ఎక్కువ మంది ఓట్లు వేస్తున్నారు అని ప్రతి నలుగురు ఓటర్లో ఒక ఓటరు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని చూసే వేస్తున్నాం మేము బిజెపీకి అని చెప్పారు. దాన్ని బట్టి నరేంద్ర మోదీ అవసరం బిజెపీకి చాలా ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇవాళ ఆర్ఎస్ఎస్ కి వచ్చినటువంటి ప్రధాన సమస్య ఏమిటంటే వ్యక్తి పూజకి వ్యక్తి ఆరాధనకి ప్రాధాన్యం పెరగడం కాంగ్రెస్ పార్టీకి బిజెపీకి తేడా ఏమిటి ప్రాంతీయ పార్టీలకి బిజెపీకి తేడా ఏమిటి అంటే ప్రధానంగా ఏముండేది గతంలో అంటే మిగతా పార్టీలు అన్నిటిలో వ్యక్తి పూజ ఎక్కువ ప్రాంతీయ పార్టీల సంగతి చెప్పనక్కర్లేదు వ్యక్తుల మీదనే ఆధారపడి
నడుస్తాయి అవి కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా వ్యక్తుల పేరు మీద నడిచేవి అంతకుముందు నెహ్రూ గారు తర్వాత ఇందిరా గాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ రాహుల్ గాంధీ వేర్స్ బిజెపీ అలా ఉండేది కాదు కానీ ఇవాళ ఏమైందంటే పరిస్థితి బిజెపి అంటే నరేంద్ర మోదీ మోదీ అంటే బిజెపీ అయితే ఈ విధంగా వ్యక్తి ఆరాధన పెరిగిపోవడం అనేది బిజెపీ లో ఆర్ఎస్ఎస్ కి నచ్చడం అలా ఆర్ఎస్ఎస్ అనేది ఒక భావజాలాన్ని నమ్ముకున్న సంస్థ. ఆ భావజాలాన్ని అమల్లో పెట్టాలి అంటే ఒక రాజకీయ పార్టీ కావాలి కాబట్టి బిజెపీ అనేది ఉన్నది. అయితే ఈ మధ్యకాలంలో బిజెపీ
అనేది ఇండిపెండెంట్ గా ఎదుగుతుంది. చాలా కాలంగా బహుశా ఇప్పటికీ కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది బిజెపీ గెలుపులో వాళ్ళు కింది స్థాయిలో సైలెంట్ గా చాప కింద నీరులా బిజెపీ గెలుపు కోసం పని చేస్తారు దేశంలో అన్ని చోట్లా కూడా ముందు ఆ వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. దానివల్ల బిజెపీ గెలుపు ఉండే కొందికి చాలా సులభం అవుతుంది. అయితే ఇవాళ బిజెపీ యస్ ఏ పార్టీ బాగా బలపడిపోయింది. శాఖోపశాఖలుగా విస్తరించింది దేశవ్యాప్తంగా గతంలో దేశంలో చాలా ప్రాంతాల్లో బిజేపీకి ఉనికే ఉండేది కాదు అక్కడ అంతకుముందు ఆర్ఎస్ఎస్ చేసిన కృషి వల్ల కానివ్వండి
తర్వాత నరేంద్రమోదీ యొక్క పర్సనాలిటీ కల్ట మూలంగా కానివ్వండి బిజెపీకి ఆదరణ పెరిగింది ఇవాళ నిజమైన జాతీయ స్థాయి పార్టీగా బిజెపీ ఉంది. అయితే గతంలో లాగా ఆర్ఎస్ఎస్ మీద ఆధారపడి మాత్రమే ఇవాళ బిజెపీ యస్ ఏ రాజకీయ పార్టీ మనుగడాలో లేదు. ఇండిపెండెంట్ గానే మేము గెలవగలం అనేటువంటి స్థాయికి వచ్చింది. అది కూడా ఆర్ఎస్ఎస్ కి కొంత ఆందోళన కలిగిస్తుంది. ఆర్ఎస్ఎస్ లో ఉండేవాళ్ళు ఎవర కూడా పదవుల కోసం తాపత్రయ పడేవాళ్ళు కాదు అధికారం కోసం అంగలార్చుకునే వాళ్ళు కాదు వాళ్ళకి వాళ్ళ భావజాలం చాలా ముఖ్యం ఆ భావజాలాన్ని దేశవ్యాప్తంగా తీసుకురావడం కోసమే వాళ్ళు
దశాబ్దాలుగా కష్టపడుతున్నారు. బిజెపీ ద్వారా అది సహకారమైంది మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ ద్వారా అది చాలా వరకు సహకారం. అయితే అదే నరేంద్ర మోదీ ఇవాళ వాళ్ళకి ఒక సమస్యగా కనిపిస్తున్నాడు. బిజేపీ కూడా మిగతా పార్టీలాగా వ్యక్తి ఆరాధన కేంద్రంగా తయారవుతుంది. ఆర్ఎస్ఎస్ తో సంబంధం లేకుండానే బిజెపీ మనుగడ సాగించగలదు అనేటువంటి ధోరణి ఇప్పుడున్న బిజెపీ నాయకుల్లో ప్రబలతో ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జేపి నడ్డ ఒక ప్రకటన చేశాడు ఆయన. ఆర్ఎస్ఎస్ మద్దతు తప్పనిసరిగా అవసరమైన నాటి కాలం నుంచి బిజెపీ ఇప్పుడు బాగా ఎదిగింది తన వ్యవహారాల్ని
తానే బాగా చక్కదిద్దుకోగల శక్తి సామర్థ్యాలని సంపూర్ణంగా సంతరించుకున్నది అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో అన్నాడు ఆయన ఇది కూడా ప్రమాద గంటికలను ముగిస్తుంది ఆర్ఎస్ఎస్ కి అంటే ఆర్ఎస్ఎస్ తో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా బిజెపీ ఎదుగుతుంది అన్నమాట బిజెపీ ఇవాళ ఎలా అయిందంటే అధికారం లేకుండా ఉండలేదేమో అనే స్థాయికి వచ్చింది అంతగా బిజేపీ ఇవాళ అధికారానికి అలవాటు పడింది. ఆ నేపథ్యంలో భావజాలం కంటే సిద్ధాంతాల కంటే అధికారాన్ని అంటిపెట్టుకని ఉండటమే ముఖ్యం అనే ధోరణలోకి వెళ్లేటువంటి అవకాశం ఉంది ఆ పార్టీ మిగతా రాజకీయ పార్టీల మాదిరిగానే
మిగతా రాజకీయ పార్టీలు తమ సిద్ధాంతాల ఎప్పటికప్పుడు మార్చుకోవడానికి ఎప్పుడు రెడీగా ఉంటాయి. అధికారం కోసం అధికారాన్ని చేకించుకోవడం కోసం బిజేపీ అట్లా ఉండదు అందుకనే చాలా కాలం పాటు బిజేపీ కానివ్వండి దాని పూర్వ రూపమైనటువంటి జనసంఘ కానివ్వండి పెద్దగా ఓట్లను సాధించుకోలేకపోయింది. అధికారాన్ని ఎక్కడా చేజెక్కించుకోలేకపోయింది చాలా కాలం పాటు దశాబ్దాల పాటు అంతకుముందు వాజ్పేయి నాయకత్వం మూలంగా ఒకసారి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మోదీ నాయకత్వ ఆకర్షణ కారణంగా వరుసగా మూడు సార్లు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కు
ఉన్న భయం ఏంటంటే బిజెపీ కూడా మిగతా పార్టీలాగా మారుతోంది. ఇక్కడ వ్యక్తి పూజకి ప్రాధాన్యం పెరుగుతోంది. నరేంద్ర మోదీ తనంత తానుగా పదం నుంచి వైదోగేటువంటి అవకాశం ఎక్కడా కనిపించడం లేదు. గతంలో మోదీ గారు ఏం చేశడు మార్గదర్శక మండలం పెట్టి ఎల్కే అద్వాని మురళీ మనోహర్ జోషి ఇట్లాంటి సీనియర్ బిజెపీ నాయకుల్ని అందులో పెట్టి వాళ్ళ యొక్క ప్రాధాన్యాన్ని తగ్గించాడు. ఆ మార్గదర్శక మండలం ఏర్పాటు చేసిందే ఇటువంటి సీనియర్ వృద్ధ నాయకుల్ని అందులో పెట్టేసి వాళ్ళని సైడ్ లైన్ చేయడం అదేవిధంగా ఎల్కే అద్వాని గానివ్వండి మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళంతా సైడ్ లైన్
అయిపోయారు నరేంద్రమోదీ గారు ఆ విధంగా మార్గదర్శక మండలంలోకి వెళ్ళేటువంటి ఉద్దేశం లేదు ఆయనకి పదవి నుంచి తప్పుకుంటాను అనేటువంటి సూచనల్ని ఆయన ఎక్కడ ఇవ్వలేదు. దాంతోటి ఆర్ఎస్ఎస్ కి వర్రీ ఎక్కువయింది. ఆ కారణం చేతనే మోహన్ భగవత్ గారు ఈ ప్రకటన చేశాడు 75 సంవత్సరాల ప్రకటన కానీ 75 సంవత్సరాలు నిండిన వాళ్ళు పదవుల్లో ఉండకూడదు అని ఆయన చేసిన ప్రకటనకి బిజేపీ నుంచి ఎటువంటి స్పందన లేదు దాన్ని అవకాశంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా ప్రకటనలు చేశారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తున్నారు కదా 75 ఏళ్ళు మాత్రమే ఉండాలి పదవుల్లో అని మరి ఎప్పుడు
వైదొలుగుతున్నారు నరేంద్ర మోదీ గారు అని చెప్పి వాళ్ళు చాలా ప్రశ్నలు వేశారు కానీ బిజెపీ వైపు నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదు దీనికి సో ఈ పరిణామం ఎటువైపు దారితీస్తుంది అనేది చూడాలి ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఇవాళ బలవంతంగా మోదీ గారిని ఆ పదం నుంచి పక్కకు తప్పించడం సాధ్యమయ్యే పని కాదు