తెలుగువాడైన లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ను, రెండు తెలుగు రాష్ట్రాలు ఆయన బ్రతికుండగా సరి అయిన రీతిలో గౌరవించలేదు. తెలుగువాడైనా, తమిళనాడు ప్రజలు, ప్రభుత్వం ఆయన్ని , తమ రాష్ట్రం వాడనే భావించారు, అందుకే అయన బ్రతికుండగా, పద్మభూషణ్ బిరుదుకు కు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఎస్పీ బాలు కు , పద్మభూషణ్ బిరుదు తమిళనాడు కోటా లోనే వచ్చింది.
అయన కరోనాతో బాధపడుతూ, చెన్నై ఆసుపత్రిలో చికిత్స తీసుకుని, మరణించినపుడు, తమిళనాడు ప్రభుత్వమే, ఆసుపత్రిలో వున్న అన్ని రోజుల చికిత్స ఖర్చు భరించింది.
ఇప్పుడు, అయన మరణించిన 4 ఏళ్ళ తరువాత, ఎస్పీబీ నాల్గవ వర్ధంతి సందర్భంగా మరలా తమిళనాడు ప్రభుత్వం మరో రీతిన ఆయన్ని గౌరవించింది.
బాలసుబ్రహ్మణ్యం నివసించిన, చెన్నైలోని నుంగంబాక్కంలోని కామ్‌దార్ నగర్ మెయిన్ రోడ్‌ను అధికారికంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రోడ్‌గా మార్చారు.
తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, రోడ్ కొత్త టైటిల్ బోర్డును ఆవిష్కరించారు
ఈ కార్యక్రమంలో హిందూమత మరియు ఛారిటబుల్ ఎండోమెంట్స్ మంత్రి పీకే శేఖర్ బాబు, చెన్నై కార్పొరేషన్ అధికారులు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు, ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ పాల్గొన్నారు.
తమిళనాడు సీఎం ఒక ప్రకటనలో, “ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు మరియు అభిమానులు ఆయన నివాసం ఉన్న రోడ్డుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రోడ్డుగా పేరు మార్చాలని కోరారు, కాబట్టి అభ్యర్థనను అంగీకరించాము , దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మారక చిహ్నాన్ని కూడా ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులు మరియు అభిమానులు కోరితే, అది కూడా పరిశీలిస్తాము” అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ సంగతి ఏమిటి ?
నెల్లూరులో ఎస్పీబీ జన్మించారు, అక్కడే చదువుకున్నారు కాబట్టి, నెల్లూరులో కూడా ఒక రోడ్ కు ఎస్పీబీ పేరు మన ఆంద్రప్రప్రదేశ్ ప్రభుత్వం పెడితే బాగుంటుంది. ఎస్పీబీ కుమారుడు, చరణ్ , ఆంధ్ర ప్రదేశ్ సీఎం ను కలిసి విజ్ఞప్తి చేస్తే, తప్పక ఫలితం ఉండచ్చు, ఎస్పీబీ కాంస్యవిగ్రహం కూడా, నెల్లూరు లో ఒక చోట ప్రతిష్ఠిస్తే, ఇప్పుడైనా, మన తెలుగువాడైన ఎస్పీబీ కి , మన తెలుగువాళ్లు సరి అయిన నివాళి, గౌరవం ఇచ్చినట్టు అవుతుంది.
Absolutely correct, ippatikaina mana prabhutvam alochinchu tondaraga spandiste baaguntundi.