Skip to content

తెలుగు వెబ్ న్యూస్

Telugu Web News

  • వార్తలు
  • రాజకీయాలు
  • బ్లాగ్
  • విశ్లేషణ
  • మీడియా వాచ్
  • సినిమాలు
  • వీడియోలు
  • హోమ్
  • Home
  • Blog
  • వైభవ్ సూర్యవంశీ……..మరో సచిన్ లా ఎదుగుతాడా లేక మరో పృథ్వి షా లా పతనమవుతాడా ?
Vaibhav Suryavanshi........Will he rise like another Sachin or fall like another Prithvi Shaw?
  • Blog
  • IPL

వైభవ్ సూర్యవంశీ……..మరో సచిన్ లా ఎదుగుతాడా లేక మరో పృథ్వి షా లా పతనమవుతాడా ?

dasaradh2009@gmail.comApril 20, 2025April 21, 202501 mins

20th April 2024

 

సచిన్ తో ఎందుకు పోల్చవలిసివచ్చింది అంటే,

సచిన్ 1989 లో 16 ఏళ్లకే, ఇంటర్నేషనల్ క్రికెట్ లో అరంగేట్రం చేసి, ఇంతింతై వటుడింతై , భారత్ క్రికెట్ లో ఒక లెజెండ్ గా ఎదిగి, “క్రికెట్ మా మతం , సచిన్ మా దేవుడు “, అని పిలిపించుకున్న , భారత రత్న వంటి అత్యున్నత పురస్కారం పొందాడు, ఇప్పటికీ క్రికెట్ లో ఒక ఆరాధ్య దైవం గా కొలవబడుతున్నాడు.

8 వ తరగతి చదువుతున్న , పధ్నాలుగు ఏళ్ల వయసుకే ఐపీల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున నిన్న రంగ ప్రవేశం చేసి, మొదటి బాల్ కే సిక్సర్ కొట్టి, 20 బంతుల్లో 34 పరుగులు చేసిన , ఈ వైభవ్ సూర్యవంశీ…..పేరు, ఇప్పుడు  మార్మోగిపోతోంది.

రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి, అండర్ 14 టీమ్ మ్యాచుల్లో చూపించిన ప్రతిభ ఆధారంగా , సూర్యవంశీ ని , ఐపీల్ మ్యాచ్ లకు, తీసుకున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అంత చిన్న పిల్లవాడ్ని ఎలా తీసుకున్నారు, ఇంత పెద్ద ఐపీల్ మ్యాచ్ లో ఎలా ఆడిస్తారని అనుకున్నారు కానీ, మొదటి మ్యాచ్ లోనే , వేల మంది మధ్య..ఏ మాత్రం బెరుకు లేకుండా బ్యాటింగ్. చేశాడు. తొలి బంతినే సిక్సర్ గా మలిచాడు.

అవుట్ అయినపుడు, భోరుమని ఏడ్చిన సూర్యవంశీ లో పసితనం చూసారు. ఆ కన్నీళ్లు ఆ పిల్లాడిలో , ఆట పట్ల మరింత కసిని పెంచుతాయని..క్రికెట్ ను సీరియస్ గా తీసుకుని, మరింత కసితో, కృషి చేసి, ఎదుగుతాడని, క్రీడా విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా వైభవ్ ఆట చూడటానికే నిద్ర లేచానని , అతని ఆట అద్భుతమని ప్రశసించారు. భారత్ క్రికెట్ దిగ్గజాలు చాలా మంది, వైభవ్ ను ప్రశంసిస్తున్నారు.

మొత్తంగా ఇప్పుడు సోషల్ మీడియాలో క్రికెటర్ వైభవ్ ఒక ట్రెండ్ సెట్టర్ గా మారాడు.

అయితే, గతం లోకి వెళితే, ఒక వినోద్ కాంబ్లీ, ఒక పృథ్వి షా ను చూసుకుంటే, వారి క్రికెట్ కెరీర్ ప్రారంభంలో క్రమశిక్షణ తో వుంటూ,
బాగా రాణించారు. కొంత పేరు వచ్చేసరికి, గతి తప్పి, క్రమశిక్షణ తప్పి, చెడు సావాసాలు, అలవాట్లతో, తమ కెరీర్ మధ్యలోనే అర్ధాంతరంగా ముగించారు.

బాగా చిన్న వయసులోనే కెరీర్ ప్రారంభించి , మంచి ప్రతిభ చూపిస్తూ, మరో క్రికెట్ స్టార్ పుట్టాడని, అందరిచేత ప్రశంసలు పొందుతున్న ఈ వైభవ్ సూర్యవంశీ…..కాంబ్లీ, పృద్వి షా లా కాకుండా, క్రమశిక్షణ తప్పకుండా, ఫిట్ నెస్ కాపాడుకుంటూ, విజయం ,వచ్చిన పేరు తలకెక్కించుకోకుండా, మంచి కృషి చేసి, భవిష్యత్తు స్టార్ క్రికెటర్ గా ఎదగాలని ఆశిద్దాం.

Post navigation

Previous: 3 వేల కోట్లు పెరిగిన మద్యం ఆదాయం – ఈ డబ్బంతా గతంలో ఎక్కడికెళ్లింది ?
Next: 75 వసంతాలు పూర్తి చేసుకున్న విజనరీ లీడర్ చంద్రబాబు పుట్టిన రోజు నేడు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Related News

ap liquor scam accused venkatesh naidu

లిక్కర్ స్కాం లో ప్రస్తుతం జైల్లో వున్న, నోట్ల కట్ల సెల్ఫీ వీడియో తో దొరికిపోయిన వెంకటేష్ నాయుడు ది, వైసీపీ పార్టీ కాదా ?

dasaradh2009@gmail.comAugust 11, 2025August 11, 20250
Are by-elections going to be held soon for those 11 seats in AP?

ఏపీ లో ఆ 11 స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయా ?

dasaradh2009@gmail.comJuly 24, 20250
RSS wants another Prime Minister to replace Modi

మోడీ స్థానంలో ఇంకొకరు ప్రధాన మంత్రి కావాలి అని ఆరెస్సెస్‌ ఎందుకనుకుంటోంది?

dasaradh2009@gmail.comJuly 18, 2025August 5, 20250
Death sentence to Kerala nurse nimisha priya

కేరళ నర్స్ నిమిష ప్రియకు యెమెన్ లో 16 లోగా మరణ శిక్ష ఆగుతుందా ?

dasaradh2009@gmail.comJuly 11, 2025July 11, 20250

Search

Recent Posts

  • లిక్కర్ స్కాం లో ప్రస్తుతం జైల్లో వున్న, నోట్ల కట్ల సెల్ఫీ వీడియో తో దొరికిపోయిన వెంకటేష్ నాయుడు ది, వైసీపీ పార్టీ కాదా ?
  • జర్నలిస్ట్ పత్రి వాసుదేవన్ ను, తమ ఛానల్ నుండి తొలగించిన 99టీవీ…….
  • సీఎం రమేష్ జోలికెళ్లి, కేటీఆర్ ఇరుక్కున్నాడా ?
  • చంద్రబాబు కేబినెట్ లో కొంతమంది మంత్రులకు ఉద్వాసన తప్పదా?
  • ఏపీ లో ఆ 11 స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయా ?
  • లిక్కర్ స్కాం లో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ, మిధున్ రెడ్డి పాత్రను, సిట్ ఎలా నిర్ధారించింది ?
  • మోడీ స్థానంలో ఇంకొకరు ప్రధాన మంత్రి కావాలి అని ఆరెస్సెస్‌ ఎందుకనుకుంటోంది?
  • లోకేష్ తో కేటీఆర్ అర్థరాత్రి డిన్నర్ భేటీ……నిజమా ? అబద్ధం అయితే కేటీఆర్ ఎందుకు ఖండించలేదు

Archives

  • Privacy
  • About Us
  • Policy
  • Terms and conditions
  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us
  • Site Map
News Event - Modern WordPress Theme. Developed by. Blaze Themes.