తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. తాజా ఉదంతం కాంగ్రెస్ నుండి బహిష్కరించబడిన , ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఆఫీస్ పై కవిత కు చెందిన జాగృతి సంస్థకు చెందిన కార్యకర్తలు గా అనుమానిస్తున్న కొందరు దాడి చేసారు. అక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేసారు. ఈ మధ్యే బ్రష్ కార్యకర్తలు, మహా న్యూస్ కార్యాలయం పై దాడి చేసి, అక్కడ కూడా ఫర్నిచర్ ధ్వంసం చేసారు, జై తెలంగాణ అంటూ నినాదాలు చేసారు, ఆ కేసు ఏమైందో తెలియదు. ఈరోజు మల్లన్న ఆఫీస్ పై దాడి ని మీడియా పై దాడి గా చూడాలా ?
అసలు ఏం జరిగింది ?
తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఆఫీస్ లో ఉన్నారన్న సమాచారం తెలుసుకున్న కవిత అనుచరులు దాదాపు 50 మంది ఆ ఆఫీస్ కు చేరుకొని దాడికి పాల్పడ్డారు. ఫర్నిచర్ ధ్వంసం చేసారు. ఈ దాడిలో మల్లన్న తప్పించుకోగలిగినా, మల్లన్న గన్‌మెన్‌పై కవిత అనుచరులు పిడిగుద్దులు కురిపించారు. దెబ్బలకు తాళలేక లోపలికి వెళ్లిన గన్‌మెన్ ఐదు రౌండ్ల గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరికి బుల్లెట్ గాయాలు అయినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఈ లోగా పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చేలోపు, జై తెలంగాణ అని నినాదాలు చేస్తూ ( ఈ దాడికి తెలంగాణ కు సంభందం ఏమిటో తెలియదు ), అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు , ఈ దాడి సంఘటన మొత్తం సీసీ టీవీ లో రికార్డు అవడంతో, ఈ దాడికి పాల్పడిన నిందితులను గుర్తిచే అవకాశం వుంది.
దాడికి దారి తీసిన నేపధ్యం ఏమిటి ?
చింతపండు నవీన్, ఈ పేరంటే , ఎవరూ గుర్తుపట్టరు కానీ తీన్మార్ మల్లన్న అంటే వెంటనే గుర్తుపడతారు, వి ఛానల్ లో వచ్చిన తీన్మార్ మల్లన్న ప్రోగ్రాం తో గుర్తింపు పొంది , ఆ తరువాత అదే పేరుతో, టివీ ఛానల్ లో కొంత కాలం పని చేసి, ఆ తరువాత సొంతంగా క్ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని సోషల్ మీడియా లో చాలా పాప్యులర్ అయ్యారు.