27 ఏళ్ల తరువాత, ఢిల్లీ అధికార పీఠాన్ని దక్కించుకున్న బిజేపి

27 ఏళ్ల తరువాత, ఢిల్లీ అధికార పీఠాన్ని బిజేపి దక్కించుకొన్నది, అది కూడా ఘన విజయంతో.

70 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో, 48  స్థానాలు బిజేపి సాధించగా, ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలు గెలుచుకొంది . కాంగ్రెస్ ఒక్క స్థానం లో కూడా గెలవకుండా, సోది లో కూడా కనిపించకుండా పోయింది. కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేసి వుంటే, విజయం సాధించకపోయినా, ఘోర పరాజయం మాత్రం తప్పేది, ప్రత్యేకంగా, కేజ్రీ వాల్, సిసోడియా ఓడి వుండేవారు కాదు అని విశ్లేషకుల అంచనా .

2020 ఎన్నికల్లో 62 స్థానాలు సాధించిన ఆప్ తాజా ఎన్నికల్లో 23 స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో కేవలం 8 సీట్లు మాత్రమే సాధించిన బీజేపీ తాజా ఎన్నికల్లో 48  స్థానాలకు ఎగబాకింది.

ఈ ఎన్నికల్లో , ఆప్ అధినేత, కేజ్రీవాల్, డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా పరాజయం పొందారు. కేజ్రీవాల్ 4,089 ఓట్ల తేడాతో పరాజయం పొందారు. ప్రస్తుత సిఎం అతిషీ మాత్రం , ఆఖరి రౌండ్ లో వచ్చిన ఆధిక్యంతో, 3521 వోట్లతో గెలుపొందారు. ఇదే ఆప్ కు లభించిన స్వల్ప వూరట.

సుదీర్ఘ కాలం, ఢిల్లీ మద్యం స్కామ్ కేసు లో జైల్లో వుండి, బెయిల్ పై బయటకు వచ్చిన, గత రెండు సార్లు ఢిల్లీ సిఎం గా పని చేసిన, అరవింద్ కేజ్రీవాల్ , ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి, తాను ఏ తప్పు చేయలేదని, తనకు ప్రజాబలం వుందని, ఈ ఎన్నికల్లో నిరూపించుకుని, అప్పుడు మాత్రమే సిఎం అవ్వాలని తలచారు, అందుకే జైల్ నుండి బయటకు వచ్చిన తరువాత, ఆయన సిఎం పదవిలో కొనసాగకుండా, మరో ఆప్ ఎమ్మెల్యే అతిషీ సిఎం గా నియమించారు. కాని ఈ ఎన్నికల్లో ఘొర పరాజయంతో, ఆయన ఆశలు అడిఆశలు అయ్యాయి.

ఆప్ పరాజయనికి కారణాలు:

మద్యం కేసులో కేజ్రివాల్, అతడి పార్టీ నేతలు ఇరుక్కోవడం,
యమునా నదిని క్లీన్ చేసే విషయంలో మాట నిలబెట్టుకోలేకపోవడం
పార్టీలోని కీలక నేతల మధ్య సమన్వయం లేకపోవడం, పార్టీలో లుకలుకలు
సీఎం కేజ్రివాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ కావడం, అవినీతి మచ్చ పడటం
జల్ బోర్డు పై అవినీతి మరకలు, శీష్ మహల్ పేలస్, ఢిల్లీ కాలుష్యం,
10 ఏళ్లుగా అధికారం లో వుండే, ప్రభుత్వం పై సహజ సిద్దంగా వుండే వ్యతిరేకత.
బీజేపీ ‘వికసిత్ ఢిల్లీ సంకల్ప్ పత్ర’ మేనిఫెస్టో మంత్రం ఢిల్లీ ఓటర్లపై పనిచేసింది.

 

తమ పార్టీ పరాజయంపై కేజ్రీవాల్ స్పందించారు.

‘ ప్రజల ఆదేశాన్ని మేము శిరసావహిస్తాం. పూర్తి వినయంతో అంగీకరిస్తున్నాం. ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీకి నా అభినందనలు. వారిని ఎన్నుకున్న ప్రజలకు అన్ని హామీలు నెరవేరుస్తారని ఆశిస్తున్నాను. గత 10 సంవత్సరాల్లో ఢిల్లీ ప్రజల కోసం ఎన్నో చేశాం. ఆరోగ్యం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎంతో కృషి చేశాం. ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాం. ఈ తీర్పును గౌరవంగా భావిస్తాం. ఇక ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్రను పోషిస్తాం. అలాగే ప్రజల మధ్యే ఉంటూ వారికి సేవ చేస్తూ వారి వెన్నంటే ఉంటాం. అలాగే ఎన్నికల్లో పోరాడిన ప్రతి ఒక్క ఆప్ పార్టీ నేతకు, కార్యకర్తకు కూడా నా ధన్యవాదాలు’. అని తెలిపారు.

సిఎం రేసులో వుండేది ఎవరు ?

ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించి , ‘జెయింట్ కిల్లర్’గా నిలిచిన లోక్‌సభ మాజీ సభ్యుడు., బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ (Parvesh Verma) బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో మొదటి స్థానంలో నిలిచారు. పర్వేష్ వర్మ అరవింద్ కేజ్రీవాల్‌ను 4,089 ఓట్ల తేడాతో  ఓడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *