17th FEB 2025.
వైసీపీ అధికారం లో వున్న 5 ఏళ్ళు, ఆంధ్ర ప్రదేశ్ లో యూనివర్సిటీలు బ్రష్టుపట్టి పోయాయని టీడీపీ వాళ్ళు ఆరోపిస్తూ వుంటారు. ప్రతిభ, సీనియారిటీ తో సంభందం లేకుండా, చాలా యూనివర్సిటీలలో ఒకే సామాజికవర్గానికి చెందిన వైస్ ఛాన్సెలర్స్ తో నింపేశారు.
అత్యంత కీలకమైన హెల్త్ యూనివర్శిటీ వీసీ .. జగన్ మోహన్ రెడ్డి భజనలో మునిగిపోయేవారు. నాగార్జున యూనివర్శిటీ వీసీ ఏకంగా వైఎస్ విగ్రహాన్ని పెట్టించి భజనలు చేసేవారు. వీరే అతి అనుకుంటే.. ఇతర యూనివర్సిటీల వైఎస్ చాన్సలర్ల అతిని ఎవరూ భరించలేకపోయేవారు.
విశాఖపట్నం లో వున్న, ఆంధ్ర యూనివర్సిటీ దానికి తార్కాణం, వైసీపీ అధికారం లోకి వచ్చాక నియమించిన వైస్ ఛాన్సలర్ ప్రసాదరెడ్డి , ఆంధ్రా యూనివర్సిటీ ని, పూర్తి వైసీపీ రాజకీయ వేదికగా మార్చేశారు. విద్యార్థులతో సర్వేలు చేయించేవారు. జగన్ ఫ్లెక్సీలు పెట్టించడం, జీవీఎంసీ ఎన్నికలు కూడా ఈయన ఆర్గనైజ్ చేశారనే ఆరోపణలు వున్నాయి.
ఐదేళ్ల కాలంలో విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది. అందుకే టీడీపీ అధికారం లోకి రాగానే, ఈ వీసీలంతా రాజీనామాలు చేశారు(వీరిని భయపెట్టి రాజీనామా చేయించారు అన్నది వైసీపీ ఆరోపణ ).
ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం యూనివర్శిటీలను మెరుగుపరచడానికి దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రముఖ అకడమిక్ దిగ్గజాలను వెదికి పట్టుకుంది.
విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో వారిని ఆయా యూనివర్సిటీ ల వైస్ ఛాన్సెలర్స్ గా నియమించింది. దీనికి క్రెడిట్ లోకేష్ కు చెందుతుంది .
కొత్తగా వీసీ ల గా నియమితమైన వారి వివరాలు చూస్తే,
ఆంధ్ర యూనివర్సటీ – ప్రొఫెసర్ జీ. పీ. రాజశేఖర్ ( ఐఐటీ , ఖరగపూర్ లో మేథమేటిక్స్ ప్రొఫెసర్ )
కాకినాడ JNTU – – ప్రొఫెసర్ సీసర్కు ప్రసాద్ (వరంగల్ NIT లో ప్రొఫెసర్ )
యోగివేమన యూనివర్సిటీ – ప్రణీతి ప్రకాష్ బాబు (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో సీనియర్ ప్రొఫెసర్ )
విక్రమ సింహపురి యూనివర్సిటీ – అల్లం శ్రీనివాసరావు, (ఢిల్లీ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ )
రాయలసీమ యూనివర్సిటీ – V .వెంకట బసవారావు (ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ )
కృష్ణ యూనివర్సిటీ – కూన రాంజీ (ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్)
ఆదికవి నన్నయ యూనివర్సిటీ – ప్రసన్న శ్రీ ((ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్))
JNTU అనంతపురం , పద్మావతి మహిళా యూనివర్సిటీ – వీటికి ఇప్పటికే , ఇన్ ఛార్జ్ వీసీ లుగా వున్నవారిని , పూర్తి స్థాయి వీసీ లు గా నియమించారు )