• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

తెలుగు వెబ్ న్యూస్

Telugu Web News

  • వార్తలు
  • రాజకీయాలు
  • బ్లాగ్
  • విశ్లేషణ
  • మీడియా వాచ్
  • సినిమాలు
  • వీడియోలు
  • హోమ్

ఓబుళాపురం గనులు అడ్డగోలుగా దోచుకున్న కేసు లో గాలి జనార్ధన్ రెడ్డి కి, ఏడేళ్ల జైలు శిక్ష .

6th May 2025

ఒకప్పుడు డొక్కు స్కూటర్ మీద తిరిగి, తరువాత హెలి కాఫ్టర్లు వాడిన, ఇంట్లో బంగారు వుయ్యాలలు, బంగారు కమోడ్ లు వాడిన , బళ్లారి మైనింగ్ కింగ్, రాజశేఖర్ రెడ్డి నా తండ్రి అని చెప్పుకునే గాలి జనార్దన్ రెడ్డి కి నాంపల్లి సీబీఐ కోర్టు , ఓబుళాపురం మైనింగ్‌ కేసులో, ఈ రోజు ఇచ్చిన తీర్పు లో, 7 ఏళ్ళ జైలు శిక్ష విధించింది

దాదాపు 15ఏళ్ల తర్వాత ఈ కేసులో తుది తీర్పు ఇస్తూ, మొత్తం ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న గాలి జనార్దన్‌ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, మెఫజ్‌ అలీఖాన్‌, అప్పటి గనుల శాఖ డైరెక్టర్‌ వీడీ రాజగోపాల్‌ను దోషులుగా నిర్ధారిస్తూ, వారికి శిక్షలు ఖరారు చేసింది. ఈ కేసులో అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి ని , అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందంను , సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

ఈ తీర్పు వచ్చిన తరువాత గాలిని , ఒకప్పుడు అతను బెయిల్ మీదుండగా వున్న చంచల్ గూడా జైలు కే పోలీస్ లు ఈరోజు తరలించారు, 2 ఏళ్ళ పైన జైలు శిక్ష పడింది కాబట్టి, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం తన ఎమ్మెల్యే పదవి కోల్పోతాడు.

ఈ కేసు వివరాలు చూస్తే

అనంతపురం ,బళ్లారి సరిహద్దు లో వున్న రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ తవ్వకాలకు సంభందించి న కేసు ఇది.
వైస్సార్ 2004 – 2009 మధ్య సీఎం గా వున్నపుడు, గాలి కి చెందిన ఓఎంసీ కి నిబంధనలకు విరుద్ధంగా , మైనింగ్ తవ్వకాలు, లీజ్ కు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి .

ఈ సమయంలో ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో, నిభందనలు విరుద్ధంగా చేస్తున్న అక్రమ మైనింగ్ కార్యకలాపాల మీద, సుప్రీమ్ కోర్ట్ ఏర్పాటు చేసిన కమిటీ విచారించింది. అవి నిజమే అని నిర్ధారణ అయిన తరువాత సుప్రీమ్ కోర్ట్ లో కేసు నమోదు అయింది.

వైస్సార్ 2009 లో చనిపోయాక, రోశయ్య సీఎం అయ్యాక, అక్రమ మైనింగ్ కార్యకలాపాల మీద విచారించమని సిబిఐ ని కోరాడు.

2009 నుండి 2011 దాక సిబిఐ దీనిపై విచారణ జరిపి, అన్ని ఆధారాలతో ఈ కేసు లో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.

రాష్ట్ర ఖజానాకు, 884 కొట్ల నష్టం జరిగింది అని సిబిఐ తన ఛార్జ్ షీట్ లో పేర్కొంది.

2011 లో సిబిఐ, గాలి ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసింది. ఆ సమయం లో గాలి ఇంటి వైభోగాన్ని చూసి సిబిఐ అధికారులే నివ్వెరపోయారని వార్తలు వచ్చాయి. బంగారు పూత తో కూడిన కమోడ్ లు, బంగారు వుయ్యాలలు దర్శనమిచ్చాయి. ఒకప్పుడు ఒక డొక్కు స్కూటర్ తో తిరిగిన గాలి జనార్దన్ రెడ్డి, ఈ గనుల అక్రమ సంపాదన ద్వారా ఎంత సంపాదించాడో ప్రజలకు అర్ధం అయింది.

2011 లో సిబిఐ అరెస్ట్ చేసాక, 4 ఏళ్లపాటు, చంచల్ గూడా జైలు లో, ఈ గాలి వున్నాడు.

మధ్య లో ఈయన బెయిల్ గురించి, ఒక జడ్జీ కి 10 కోట్లు లంచం ఇస్తే, అప్పుడు సిబిఐ విచారణ అధికారిగా వున్న
జె.డి. లక్ష్మీనారాయణ , ఈ భాగోతాన్ని రెడ్ హాండెడ్ గా పట్టుకున్నాడు, ఆ జడ్జీని సుప్రీమ్ కోర్ట్ సస్పెండ్ కూడా చేసింది.

ఎట్టకేలకు 4 ఏళ్ళ తరువాత అంటే , 2015 , జనవరి లో గాలి కి బెయిల్ వచ్చింది.

2011 లో కేసు నమోదు అయితే, 2025 లో ఇన్నాళ్లకు , ఈ కేసు లో నాంపల్లి సిబిఐ కోర్ట్ తీర్పు చెప్పింది.
మొత్తం 8మంది , సిబిఐ నిందితులుగా పేర్కొంటే, అందులో ఒకరైన లింగా రెడ్డి చనిపోయారు.

A2 అయిన గాలి జనార్దన్ రెడ్డి కి 8 ఏళ్ళు జైలు శిక్ష పడింది. అయితే ఇంతకు ముందే 4 ఏళ్ళు శిక్ష అనుభవించాడు కాబట్టి, ఇప్పుడు 3 ఏళ్ళు జైలు శిక్ష అనుభవిస్తే సరిపోతుంది.

తీర్పు సమయంలో మీరు చెప్పదలుచుకున్నది ఏమైనా ఉందా అని జడ్జీ ,గాలిని అడిగినపుడు, నేను ప్రజాసేవలో వున్నాను,
నా సంపాదనతో 50,000 సామూహిక వివాహాలు చేశాను, నా మీద దయతలిచి శిక్ష వేయద్దు అని చెప్పగా,దానికి జడ్జీ , ” మాములుగా అయితే, మీ మీద యావజ్జీవ కారాగార శిక్ష వెయ్యాలి ” అని జవాబు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.

అయితే, గాలి అడ్వకేట్ లు మాత్రం , ఈ తీర్పు పై, హై కోర్ట్ లో అప్పీల్ చేస్తామని చెబుతున్నారు. కానీ, గాలి జైలు లో వుండే , హై కోర్ట్ కు అప్పీల్ కు వెళ్లాల్సి వుంది.

ఈ కేసు లో ఒక నిందితుగా వున్న అప్పటి గనుల శాఖ డైరెక్టర్ గా వున్న, రాజగోపాల్ కి, ప్రభుత్వ అధికారి కాబట్టి,
11 ఏళ్ళ శిక్ష పడింది.

మిగిలిన నిందితులలో, అప్పుడు, వైస్సార్ హయం లో , గనుల శాఖ మంత్రి గా వున్న సబితా ఇంద్రారెడ్డి ని, కోర్ట్ నిర్దోషిగా
పేర్కొంది, మరొక నిందితురాలు ఐఏఎస్ శ్రీలక్ష్మి ని, ఇదివరకే ,హై కోర్ట్ , ఈ కేసు లో ప్రమేయం లేదని, నిర్దోషిగా పేర్కొంది.

కానీ, ఈ ఐఏఎస్ శ్రీలక్ష్మి ని ని నిర్దోషిగా హై కోర్ట్ విడుదల చేసిన తీర్పు పై, సిబిఐ, సుప్రీమ్ కోర్ట్ కు వెళ్ళింది.
సుప్రీమ్ కోర్ట్ ఈ అంశంలో ఏ తీర్పు చెబుతుందో వేచి చూడాలి.

జగన్, గాలి జనార్దన్ రెడ్డి ల మీద ఒకే సమయం లో అంటే 2011 లో కేసు లో నమోదు అయితే, 14 ఏళ్ళ తరువాత గాలి నిందితుడని తేలి , ఇప్పుడు 2025 లో శిక్ష పడితే, జగన్ కేసు లు మాత్రం ఇంకా అసలు విచారణే మొదలు కాకుండా, ఎందుకు నత్త నడక నడుస్తున్నాయో అర్ధం కాదు.

Reader Interactions

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Primary Sidebar

ADVERTISEMENT

ADVERTISEMENT

Recent Posts

  • లోకేష్ రెడ్ బుక్ కు నా ఇంటి కుక్క కూడా భయపడదు, అని పదే, పదే ,అంటున్న అంబటి రాంబాబు , ఇప్పుడు జైలు కు వెళ్తున్నాడు.
  • జగన్ సీఎంగా వున్నపుడు , తన పై బాస్ కే మెమో పంపిన ప్రవీణ్ ప్రకాష్ , హఠాత్తుగా ఎందుకు ఏబివి కి , జాస్తి కిషోర్ కు క్షమాపణలు చెప్పాడు ?
  • తిరుమలలో , కల్తీ నెయ్యి స్కాం జరగలేదు….ఎందుకంటే అది అసలు నెయ్యే కాదు….విస్తుపోయే వాస్తవాలు
  • లిక్కర్ స్కాం లో ప్రస్తుతం జైల్లో వున్న, నోట్ల కట్ల సెల్ఫీ వీడియో తో దొరికిపోయిన వెంకటేష్ నాయుడు ది, వైసీపీ పార్టీ కాదా ?
  • జర్నలిస్ట్ పత్రి వాసుదేవన్ ను, తమ ఛానల్ నుండి తొలగించిన 99టీవీ…….
  • సీఎం రమేష్ జోలికెళ్లి, కేటీఆర్ ఇరుక్కున్నాడా ?
  • చంద్రబాబు కేబినెట్ లో కొంతమంది మంత్రులకు ఉద్వాసన తప్పదా?
  • ఏపీ లో ఆ 11 స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయా ?

Top News

  • ambati rambabu arrested
    లోకేష్ రెడ్ బుక్ కు నా ఇంటి కుక్క కూడా భయపడదు, అని పదే, పదే ,అంటున్న అంబటి రాంబాబు , ఇప్పుడు జైలు కు వెళ్తున్నాడు.
  • praveen prakash apologize to abv and jasthi kishore
    జగన్ సీఎంగా వున్నపుడు , తన పై బాస్ కే మెమో పంపిన ప్రవీణ్ ప్రకాష్ , హఠాత్తుగా ఎందుకు ఏబివి కి , జాస్తి కిషోర్ కు క్షమాపణలు చెప్పాడు ?
  • Tirumala adulterated ghee scam
    తిరుమలలో , కల్తీ నెయ్యి స్కాం జరగలేదు….ఎందుకంటే అది అసలు నెయ్యే కాదు….విస్తుపోయే వాస్తవాలు
  • ap liquor scam accused venkatesh naidu
    లిక్కర్ స్కాం లో ప్రస్తుతం జైల్లో వున్న, నోట్ల కట్ల సెల్ఫీ వీడియో తో దొరికిపోయిన వెంకటేష్ నాయుడు ది, వైసీపీ పార్టీ కాదా ?
  • patri vasudevan terminated from 99tv
    జర్నలిస్ట్ పత్రి వాసుదేవన్ ను, తమ ఛానల్ నుండి తొలగించిన 99టీవీ…….

Archives

Copyright © 2026 · News Pro on Genesis Framework · WordPress · Log in