1st May 2025
హీరో శ్రీవిష్ణు క్షమాపణ చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు…
ఏ కారణంగా అంటే,
సింగిల్ అనే సినిమా ట్రెయిలర్ రిలీజ్ అయ్యింది … గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ లో ఈ సినిమా వస్తోంది, అంటే అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.
ఈ ట్రెయిలర్‌లో రెండు డైలాగ్స్ నెటిజన్స్ ద్రుష్టి ఆకర్షించాయి. కొద్దిగా కాంట్రవర్సీ కు కూడా దారితీసేటట్టు వుంది.
శ్రీవిష్ణు పరుగుపెడుతూ, ” శివయ్యా ” అని అనడం, …అలాగే మంచు కురిసిపోతోందని అని మరో డైలాగ్… ఈ రెండూ మంచు ఫ్యామిలీని కించపరుస్తున్నట్టుగా ఉన్నాయని , కామెంట్స్ చేస్తున్నారు, ట్రోలర్స్ అయితే, ఎంజాయ్ చేస్తున్నారు.
మంచు విష్ణు కన్నప్ప సినిమా ట్రైలర్ లో, ఓచోట విష్ణు శివయ్యా అని పిలుస్తుంటాడు దేవుడిని… ఆ డైలాగు లో, భక్తి కనబడటం లేదు, అనే విమర్శలు వచ్చాయి, కామెడీ గా ఉందని కూడా ట్రోల్ల్స్ వచ్చాయి.
అలాగే ప్రస్తుతం మంచు కుటుంబం లో మోహన్‌బాబు, విష్ణు , మనోజ్, మధ్య జరిగిన వివాదాలు, గొడవలతో, రచ్చకెక్కారు, మీడియా కు కూడా ఎక్కారు. అందుకే మంచు కురిసిపోవడం అనే డైలాగ్ మంచు ఫ్యామిలీని ఉద్దేశించి చేసినదనే , భావన వస్తోంది. దానికి తోడు ఈ సినిమా కు అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ కావడం, మెగా ఫ్యామిలీకి, మంచు ఫ్యామిలీకి అస్సలు పొసగదు , ఈ కారణాల నేపధ్యం లోనే ఈ డైలుగులు పెట్టారనే వార్తలు వస్తున్నాయి .
అయితే ఇదే ట్రైలర్ లో, బాలయ్యను అనుకరించడం ఉంది… మరో చోట ఇళయరాజా రాయల్టీ వివాదాన్ని, కూడా హాస్యంగా చూపిస్తూ, ‘మనసు అర్ధం చేసుకోడానికి ఇది మామూలు ప్రేమ కాదు ’ అనే డైలాగూ పెట్టినట్టుగా వుంది.
ఇవన్నీ కలిపి చూస్తే, ప్రస్తతం సోషల్ మీడియా లో ట్రేండింగ్ లో వున్నటాపిక్ లను ఆధారం తీసుకుని, కొన్ని హాస్య సన్నివేశాలు అల్లుకున్నట్టున్నారు. అలా చూస్తే సరదాగా వుంది తప్ప , ఎవరినో టార్గెట్ చేస్తున్నట్టుగానో, కించపరుస్తున్నట్టుగానో ఏమీ అనిపించలేదు…
‘శివయ్యా’, ‘మంచు కురిసిపోవడం’ , ఈ డైలాగులతో విష్ణు బాగా ఫీల్ అయ్యాడని , ఛాంబర్‌లో ఫిర్యాదు చేయాలని యోచిస్తున్నట్టు ఒక టాక్ నడుస్తోంది.
మాములుగా వివాదాలకు దూరంగా వుండే శ్రీవిష్ణు, కాంట్రవర్సీకి దారి తీసే ఇలాటి డైలాగులు తన సినిమాలో పెట్టుకొన్నాడో అర్ధం కాదు. .ఒకవేళ విష్ణు ఈ వివాదం పై, చర్యలు తీసుకోడానికి, ముందుకు వెళితే మాత్రం , ఈ సినిమా , ‘సింగిల్ ‘ కు , ఉచిత పబ్లిసిటీ మాత్రం దొరుకుతుంది.
అయితే, శ్రీవిష్ణు ఒక వీడియో రిలీజ్ చేస్తూ, ఈ డైలాగులతో, విష్ణు హార్ట్ అయ్యాడని తెలుస్తోంది, కించపరచాలనే ఉద్దేశ్యం లేదు, కేవలం హాస్యం గురించి మాత్రమే మాత్రమే ఈ డైలాగులు పెట్టాము, ఇప్పుడు ఆ డైలాగులు తీసేశామని చెప్పాడు.
దీనితో ఈ వివాదానికి ఇక ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.