తెలుగు వెబ్ న్యూస్
Telugu Web News

ఇండియా టుడే మూడ్ అఫ్ ది నేషన్, చంద్రబాబు కు బెస్ట్ సీఎం గా 4 వ రాంక్.

0

ఇండియా టుడే ప్రతి ఆరు నెలలకు ఓ సారి ప్రకటించే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో చంద్రబాబు నాలుగో ప్లేస్ లో ఉన్నారు.గత ఏడాది ఆగస్టులో ఆయన ఐదో స్థానంలో ఉన్నారు. ఈ ఆరు నెలల్లో తన స్థానాన్ని మెరుగుపర్చుకున్నారు. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా రాష్ట్రాన్ని గాడిన పెట్టడంతో పాటు పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్లు, ఉచిత సిలిండర్ వంటి పథకాలు అమలు చేయడం చంద్రబాబు మైలేజీని పెంచింది.

బెస్ట్ సీఎంల జాబితాలో యోగి ఆదిత్యానాథ్ మొదటి స్థానంలో ఉన్నారు. కుంభమేళా నిర్వహణ, ఏర్పాట్ల విషయంలో ఆయన ప్రజాదరణ చూరగొన్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్ తర్వాత మూడో స్థానంలో ున్నారు. ఇటీవల సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఫడ్నవీస్ ఐదో స్థానంలో నిలిచారు.

Leave A Reply

Your email address will not be published.