తెలుగు వెబ్ న్యూస్
  • వార్తలు
  • రాజకీయాలు
  • బ్లాగ్
  • విశ్లేషణ
  • మీడియా వాచ్
  • సినిమాలు
  • వీడియోలు
  • హోమ్
No Result
View All Result
తెలుగు వెబ్ న్యూస్
No Result
View All Result
Home Blog

చంద్రబాబు కే నా, నాకూ జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించండి , హై కోర్ట్ లో పిటిషన్ వేసిన జగన్

by dasaradh2009@gmail.com
May 12, 2025
0
provide z plus security to me

జగన్ ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. కానీ, ఒక ఎమ్మల్యే ప్లస్ మాజీ సీఎం కాబట్టి, ఎంత భద్రత ఇవ్వాలో అంతే ఇస్తున్నారు. ప్రస్తుతం జగన్ కు 56 మందితో కూడిన జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నారు .

కానీ జగన్ కు అది చాలదట, తనకు కూడా చంద్రబాబు లాగ special protection కావాలని, కోర్ట్ లో పిటిషన్ వేసాడు.

తనకు జడ్ ప్లస్ భద్రత ఇవ్వాలంటూ జగన్ మే 8 న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందనీ, అందుకే సీఎంగా గతంలో తనకు ఏ విధంగా జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉండేదో.. అలాగే ఇప్పుడు కూడా దానిని కల్పించాలనీ, అలా జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ జగన్ ఆ పిటిషన్ లో కోరారు.

కోర్టు ఆ పిటిషన్ పై త్వరగా నిర్ణయం వెలువరిస్తుందని జగన్ ఆశిస్తే, కోర్టు మాత్రం పిటిషన్ విచారణను వేసవి సెలవుల తరువాతకు వాయిదా వేసింది. దీంతో జగన్ కు హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లైంది.

అసలు జగన్ కు ఎందుకు చంద్రబాబు కు వుండే special protection ఆయనకు కావాలని అడుగుతున్నాడో అర్ధం కాదు. గతం లో అయన మీద ఏమైనా దాడులు ఏమైనా జరిగాయా ?

చంద్రబాబు కు ఎందుకు NSG ప్రొటెక్షన్ ఇచ్చారు అంటే

వుమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు సీఎం గా వున్నపుడు, నక్సల్స్ ను బాగా అణచివేశారు, దానికి ప్రతీకారంగా, చంద్రబాబు కారు ను, తిరుపతి దగ్గర మందుపాతర పెట్టి, నక్సల్స్ పేల్చేశారు. అదృష్టవసాత్తు చంద్రబాబు బ్రతికి బయట పడ్డారు. ఎప్పటికైనా చంద్రబాబు కు నక్సల్స్ నుండి ముప్పు వుంది కాబట్టి, అప్పటినుండి, కేంద్ర ప్రభుత్వం ఆయనకు, సీఎం పదవి వున్నా లేకున్నా , NSG (నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ ), సెక్యూరిటీ ఇస్తోంది.

జగన్, 2019 లో సీఎం అయ్యాకా, తనకు కూడా NSG లాంటి ప్రొటెక్షన్ లాంటిది కావాలని అనుకున్నాడు, NSG అంటే కేంద్రం ఒప్పుకోదు కదా, అందుకనే, ప్రత్యేకంగా ,శాసనసభలో బిల్లు పెట్టించుకుని ,SSG (special security group) అనే ప్రొటెక్షన్ పెట్టించుకున్నాడు, దాని ప్రకారం 900 మంది పైన పైన పోలీస్ లు ఆయనకు సెక్యూరిటీ కల్పిస్తారు.

కానీ, ఇప్పుడు జగన్, కేవలం ఒక ఎమ్మెల్యే, మాజీ సీఎం మాత్రమే, ఇప్పుడు కూడా, ఒక సీఎం కు వుండే ప్రొటెక్షన్ కావాలంటే ఎలాగ ? డిప్యూటీ సీఎం పవన్ కే వై క్యాటగిరీ సెక్యూరిటీ కల్పిస్తున్నారు. కానీ జగన్ కు మాత్రం అంతకన్నా ఎక్కువ సెక్యూరిటీ కావాలట.

సెక్యూరిటీ రివ్యూ కమిటీ ప్రకారం ఆయనకు జడ్ క్యాటగిరీ భద్రత ఇప్పుడు కల్పిస్తున్నారు. మాజీ సీఎంలకు కేటాయించని భధ్రతను కేటాయిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి మాజీ సీఎం. ఆయనకు ఉండే భద్రతతో పోలిస్తే జగన్ రెడ్డి భద్రత చాలా రెట్లు ఎక్కువ. అయినా ఆయన సంతృప్తి చెండడం లేదు.

చంద్రబాబు కంటే, ఎప్పటికైనా నక్సల్స్ నుండి ముప్పు వుంది కాబట్టి, NSG ప్రొటెక్షన్ ఇస్తున్నారు. మరి జగన్ కు ఎవరినుండైనా ముప్పు ఉందా ? గతం లో ఎవరినుండైనా అయన మీద దాడి జరిగిందా ? ఒక కోడి కత్తి దాడి, విజయవాడ లో గులకరాయి దాడి చూపిస్తే, సరిపోతుందా

కోడి కత్తి కేసు లో, నీ మీద దాడి జరిగింది కదా, నీ మీద దాడి చేసిన నిందితున్ని గుర్తు పట్టి అని కోర్ట్ ఎన్నిసార్లు పిలిచినా ,కోర్ట్ కు వెళ్లకుండా తప్పించుకున్నాడు జగన్. కోర్ట్ కు వెళ్తే గుట్టు బయటబడుతుందనే వెళ్ళటం లేదా ?

గతం లో జగన్ సీఎం గా వున్నపుడు, ఎక్కడ పర్యటనలకు వెళ్లినా, అక్కడ చెట్లు కొట్టేసేవారు, షాపులు మూయించేసేవారు, బారి కేడ్లు కట్టేవారు, ఇప్పుడు అధికారం పోయినా, అలాంటి సెక్యూరిటీ కావాలంటే ఎలా ?

చంద్రబాబుతో సమానంగా సెక్యూరిటీ కోసం జగన్ రెడ్డి చేయని పోరాటం లేదు. తనపై తాను దాడులు చేయించుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు. తాను బయటకు వస్తే కుప్పలు కుప్పలుగా జనం మీద పడిపోతున్నారని సీన్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు వాటిని చూపించుకుని తనకు సెక్యూరిటీ తక్కువ అయిందని కోర్టులో పిటిషన్ వేసుకున్నారు. జగన్ చేసే, ఈ విన్యాసాలు చూసి జనాలు బిత్తరపోతున్నారు.

 

Previous Post

టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ….సరి అయిన నిర్ణయం సరి అయిన సమయంలో .

Next Post

రోహిత్ బాటలో విరాట్ కోహ్లీ….టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ.

Related Posts

ap liquor scam accused venkatesh naidu

లిక్కర్ స్కాం లో ప్రస్తుతం జైల్లో వున్న, నోట్ల కట్ల సెల్ఫీ వీడియో తో దొరికిపోయిన వెంకటేష్ నాయుడు ది, వైసీపీ పార్టీ కాదా ?

Are by-elections going to be held soon for those 11 seats in AP?

ఏపీ లో ఆ 11 స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయా ?

Next Post
Kohli announced retirement for test cricket

రోహిత్ బాటలో విరాట్ కోహ్లీ....టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

No Result
View All Result

Recent Posts

  • లోకేష్ రెడ్ బుక్ కు నా ఇంటి కుక్క కూడా భయపడదు, అని పదే, పదే ,అంటున్న అంబటి రాంబాబు , ఇప్పుడు జైలు కు వెళ్తున్నాడు.
  • జగన్ సీఎంగా వున్నపుడు , తన పై బాస్ కే మెమో పంపిన ప్రవీణ్ ప్రకాష్ , హఠాత్తుగా ఎందుకు ఏబివి కి , జాస్తి కిషోర్ కు క్షమాపణలు చెప్పాడు ?
  • తిరుమలలో , కల్తీ నెయ్యి స్కాం జరగలేదు….ఎందుకంటే అది అసలు నెయ్యే కాదు….విస్తుపోయే వాస్తవాలు
  • లిక్కర్ స్కాం లో ప్రస్తుతం జైల్లో వున్న, నోట్ల కట్ల సెల్ఫీ వీడియో తో దొరికిపోయిన వెంకటేష్ నాయుడు ది, వైసీపీ పార్టీ కాదా ?
  • జర్నలిస్ట్ పత్రి వాసుదేవన్ ను, తమ ఛానల్ నుండి తొలగించిన 99టీవీ…….

Archives

తెలుగు వెబ్ న్యూస్

Copyright © 2017 JNews.

Navigate Site

  • Privacy
  • About Us
  • Policy
  • Terms and conditions
  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us
  • Site Map

Follow Us

No Result
View All Result
  • వార్తలు
  • రాజకీయాలు
  • బ్లాగ్
  • విశ్లేషణ
  • మీడియా వాచ్
  • సినిమాలు
  • వీడియోలు
  • హోమ్

Copyright © 2017 JNews.