4th April 2025
తల్లి మీద కేసు వేసిన వాడుగా మేనల్లుడి, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా , చరిత్రలో జగన్ మిగిలిపోతాడని, షర్మిల సంచలన వ్యాఖ్యలు.
వైస్సార్ ఫామిలీ లో ఆస్తులగురించి, ఇంటర్నల్ గా ఎప్పటినుండో, కోల్డ్ వార్ జరుగుతోంది. తనకు, తన పిల్లలకు ఆస్తులు పంచకుండా, తన అన్నయ్య జగన్ అన్యాయం చేసారని ఎప్పటినుండో చెప్బుతున్నారు.
షర్మిల వాదన ప్రకారం, షర్మిల, విజయమ్మకు, గిఫ్ట్ డీడ్ గా, షేర్ లు బదలాయిస్తూ , జగన్ ఎప్పుడో MOU చేసారు, , దాని ప్రకారం తమకు ఆస్తులు రావాలి, కానీ ఇప్పుడు , ” తాను సంతకం పెట్టాను కానీ ఇంకా పత్రాలు తన దగ్గరే ఉన్నాయని..తాను గిఫ్ట్ డీడ్ ఇవ్వలేదని, జగన్ వాదిస్తున్నారు. గిఫ్ట్ ఇవ్వకపోయినా ఇచ్చినట్లుగా తన తల్లి, చెల్లి షేర్లు బదిలీ చేసుకున్నారని, తనకు తల్లి, చెల్లిపై ప్రేమాభిమానాలు పోయాయి కాబట్టి , ఇప్పుడు వారిపేరిట వున్న ఆ షేర్లు రద్దు చెయ్యాలని, ” అని జగన్, NCLT (నేషనల్ కంపెనీ అఫ్ లా ట్రిబ్యునల్ ), జగన్ పిటిషన్ వేశారని, ఆస్తులు ఇస్తాడా లేదా అన్నది తాను పట్టించుకోనని.. కానీ తల్లి మీద కేసు వేసిన వాడుగా మేనల్లుడి, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ మిగిలిపోతాడని తేల్చారు
షర్మిల పదే పదే చెప్పేది, మేనల్లుడు, మేనకోడలి ఆస్తులు, వారి మావయ్య, జగన్ కాజేస్తున్నారని , అయితే జగన్ అన్ని ఆస్తులు సంపాదించింది, వైస్సార్ సీఎం వున్న, ఆ 5 ఏళ్లలోనే, క్విడ్ ప్రో కో ద్వారా సంపాదించుకున్నవే, అసలు ఆ ఆస్తులే అక్రమంగా సంపాదించినవని, ఆ అస్తుల్లోనే చెల్లికి కూడా వాటా వస్తుందని వైఎస్ బతికున్నప్పుడు హామీ ఇచ్చారని.., ఇప్పుడు మాత్రం ప్లేట్ తిప్పి.. , ఏదో తన కష్టార్జితాన్ని పంచుతున్నట్టుగా తెగ బాధపడిపోతూ, తన కోసం..తన పార్టీ కోసం పని చేసిన చెల్లిని , ఇప్పుడు మోసం చేస్తున్నాడని, ప్రత్యర్థి పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు.