Pavan kalyan slams mamatha

పవన్ కళ్యాణ్ vs మమత బెనర్జీ

 

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళాకు సతీసమేతంగా హాజరైన ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మమతా బెనర్జీ కి కౌంటర్ ఇచ్చారు,
ఈ విషయం నేషనల్ మీడియా నే హై లైట్ చేసింది.

మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ లో మాట్లాడుతూ కుంభమేళా గురించి ఏమన్నారు ?

కుంభమేళా నిర్వహణ లో, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం విఫలం అయింది, అది “మృత్యు కుంభ్” గా మారింది. ఇదీ మమత అన్నది.

అసలు మమత ఏ సంఘటనలను ఉటంకిస్తూ , ఈ వ్యాఖ్యలు చేసారు ?

కుంభమేళా లో జరిగిన తొక్కిసలాటలో, కొంత మంది చనిపోవడం, అలాగే న్యూ ఢిల్లీ నుండి ప్రయాగ్‌రాజ్‌ వెళ్ళడానికి , ఢిల్లీ
స్టేషన్ లో వేచి చూస్తూ, ఒకేసారి ప్రయోగ రాజ్ వెళ్లే ట్రైన్ ఎక్కే ప్రయత్నం లో తొక్కిసలాట దుర్ఘటనలో కొంత మంది ప్రయాణీకులు
చనిపోవడం, ఈ సంఘటనలను దృష్టిలో పెట్టుకుని, ఈ వ్యాఖ్యలు చేసారు (ఈ ఢిల్లీ స్టేషన్ లో వున్న జనరల్ కంపార్ట్మెంట్ల కన్నా, 15 నిమిషాల్లో నాలుగింతలు
జనరల్ టికెట్ లు అమ్మారని, అదే తొక్కిసలాటకు కారణమని ఆరోపణలు వచ్చాయి).

మమత వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి.

దీనికి కౌంటర్ గా పవన్ కళ్యాణ్ ఏమన్నారు ?

ఇది మన రాజకీయ నాయకుల సమస్య. వారు హిందూ మతాన్ని విమర్శించినంత సులభంగా ఇతర మతాలను విమర్శించరు,విమర్శించలేరు , మిగతా మతాల కన్నా, సనాతన ధర్మం మరియు హిందూ మతంపై వ్యాఖ్యలు చేయడం చాలా సులభం అని భావిస్తారు. . అలాంటి నాయకులతో, ఇలాంటి వ్యాఖ్యలు, కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీస్తాయని వారు గ్రహించరు. కుంభమేళా సమయంలో కొన్ని దురదృష్ట సంఘటనలు జరిగితే, దానిని నిర్వహణ వైఫల్యంగా పరిగణించలేము,
కోట్లాది మంది భక్తులు హాజరయ్యే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఏ ప్రభుత్వానికైనా పెద్ద సవాలు. దురదృష్టకర సంఘటనలు జరగాలని ఎవరూ కోరుకోరు. నాకు తెలిసినంతవరకు, యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం కుంభమేళాను అద్భుతంగా నిర్వహిస్తోంది. కొన్ని సంఘటనలు దురదృష్టకరం, కానీ ఎవ్వరైనా, అలాంటి వ్యాఖ్యలు చేయడం సమర్థనీయం కాదు.”

కుంభమేళాలో జరిగిన సంఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్, “. లక్షలాది మంది భక్తులు హాజరయ్యే కార్యక్రమాన్ని నిర్వహించడం ఏ ప్రభుత్వానికి కూడా ఒక పెద్ద సవాలు. దురదృష్టకర సంఘటనలు జరగాలని ఎవరూ కోరుకోరు. నాకు తెలిసినంతవరకు, యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం కుంభమేళాను అద్భుతంగా నిర్వహిస్తోంది. కొన్ని సంఘటనలు దురదృష్టకరం, కానీ అలాంటి వ్యాఖ్యలు చేయడం సమర్థనీయం కాదు, అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలి,
నా అభిప్రాయం ప్రకారం, అలాంటి వ్యాఖ్యలు తగనివి”

మమత కు ఇచ్చిన ఈ కౌంటర్ తో , దేశస్థాయిలో సనాతన వాదుల్లో, హిందూ మతస్థుల్లో, బీజేపీ లో, జాతీయంగా , పవన్ కళ్యాణ్ ఇమేజ్ మరింత పెరిగింది
అని భావిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *