కింగ్ కోహ్లీ, క్రితం సంవత్సరమే అంతర్జాతీయ T20 లకు రిటైర్మెంట్ ప్రకటించాడు, కొద్ది రోజుల క్రితమే టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు,
కేవలం వన్డే లకు మాత్రమే ఇక కోహ్లీ ఆడతాడు, కోహ్లీ జట్టు సభ్యుడిగా ఉండగా, భారత జట్టు, 2011 క్రికెట్ వరల్డ్ కప్ గెలిచింది, 2024, T20 వరల్డ్ కప్ గెలిచింది, కొద్ది నెలలక్రిందటే భారతజట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది.
అయితే, 18 ఏళ్లుగా ఒకే ఫాంఛైజీ అయిన ఆర్సీబీ కి ప్రాతినిధ్యం వహిస్తూ, రికార్డు సృష్టించి, రిటైర్ అయ్యేలోగా తన స్వప్నం సాకారమవుతుందా అని కోహ్లీ ఎదురుచూస్తున్న వేళ , కోహ్లీ ఎదురుచూపులు ఎట్టకేలకు ఫలించి , ఆర్సీబీ ఈ 18th సీజన్ ఐపీల్ కప్పు గెలుచుకుంది. కోహ్లీ కోసమే ఆర్సీబీ , ఐపీల్ గెలవాలని చూస్తున్న, భారత్ లోని, కోహ్లీ అభిమానుల ఆశలు కూడా ఎట్టకేలకు నెరవేరాయి
2008 లో ఐపీల్ మొదలయ్యాక, మూడు సార్లు ఫైనల్ దాకా వెళ్లిన ఆర్సీబీ , మూడు సార్లూ, ఫైనల్ లో ఓడిపోయింది. 4 వ సారి, ఫైనల్ కు వెళ్లిన ఈ సారి మాత్రం ఐపీల్ కప్ ను ఆర్సీబీ సాధించింది.
ఆహ్మదాబాద్ లో, నరేంద్ర మోడీ మైదానంలో, నిన్న అంటే , జూన్ 3న జరిగిన ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ పై ఆరు పరుగుల తేడాతో ఆర్సీబీ గెలిచింది . టాస్ ఓడిపోయిన ఆర్సీబీ, ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. 191 పరుగుల టార్గెట్ తో, బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ , 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు మాత్రమే చేసింది.
ఆర్సీబీ అనగానే మళ్ళా కోహ్లీ గురించే చెప్పుకోవాలి. ఈ 18 వ సీజన్ ఆర్సీబీ విజయం తరువాత 18 అనే నెంబర్ తో కోహ్లికున్న అనుబంధం చర్చల్లోకి వచ్చింది.
కోహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో మొదటి మేచ్ 2008 , ఆగష్టు 18 న తొలి వన్డే మేచ్ ఆడాడు, అడ్వకేట్ అయిన కోహ్లీ తండ్రి, ప్రేమ్ కోహ్లీ కూడా క్రికెట్ ఆడే రోజుల్లో 18 నెంబర్ కల జెర్సీ నే వేసుకునేవారంట .
దురదృష్టవశాత్తు, కోహ్లీ తండ్రి అదే 18 వ తేదీన 2006 డిసెంబరు లో గుండెపోటుతో మరణించారు. అయన గుర్తుగానే, అండర్ 19 క్రికెట్ ఆడినప్పటినుండీ, 18 నెంబర్ జెర్సీ తో , కోహ్లీ కనిపిస్తున్నాడనే వార్త వుంది.
ఇక కోహ్లీ వన్డే లలో తన అత్యధిక స్కోర్ 183 పరుగులు చేసింది, 18వ తేదీనే. 2012 మార్చి 18న ఢాకాలో పాకిస్థాన్ పై జరిగిన వన్డేలో కోహ్లీ 183 పరుగులు చేశాడు.
తాజాగా తన చిరకాలస్వప్నం అయిన ఐపీల్ ట్రోఫీ ని 18 వ సీజన్ లోనే గెలిచాడు.
మాములుగా ఎప్పుడూ గెలవని జట్లే , ట్రోఫీ గెలిస్తే బాగుండునని, అభిమానులందరూ భావిస్తూ వుంటారు. ఆ జట్టు మీదే సానుభూతి ఉంటుంది, దక్షిణాఫ్రికా , న్యూజిలాండ్ జట్ల లాగ. అందుకే 18 ఏళ్లలో ఒక్కసారి ఐపీల్ గెలవని ఆర్సీబీ గెలవాలని భారత్ లోని అత్యధిక మెజారిటీ క్రికెట్ అభిమానులు కోరుకున్నారు , అది కూడా ఇంకెన్నేళ్ళో ఇంటర్నేషనల్ క్రికెట్ లో వుండని కోహ్లీ గురించే, కోహ్లీ రిటైర్ అయ్యేలోగా, ఆర్సీబీ ఐపీల్ గెలవాలనే. ఎట్టకేలకు కోహ్లీ అభిమానుల కల ఫలించింది. ఫైనల్ కు చేరి ఓడిన పంజాబ్ జట్టు పై సానుభూతి వున్నా, ఎప్పుడూ గెలవని ఆర్సీబీ ఐపీల్ గెలవడంతో, ఆ సానుభూతి ని, ఈ ఆర్సీబీ గెలుపు ఆనందం డామినేట్ చేసింది.