1st June 2025
2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చాక, రేషన్ షాపులు ఎత్తేసి, కొన్ని వేల వెహికల్స్ కొనుగోలు చేసి, ప్రజలకు డోర్ టు డోర్ , రేషన్ సరుకుల పంపిణీ చేస్తాము అని చెప్పారు, కానీ ఆచరణలో ఆ పథకం ఫెయిల్ అయింది. ఆ బండ్లు ఇంటివద్దకు ఏమి వచ్చేవి కావు, వీధిలో ఒక చివర ఆ బండి ని నిలబెడితే, ఆ వీధిలో ఉన్నవారందరూ, ఆ బండి దగ్గరకు వెళ్లి, క్యూ లో నిలబడి తెచ్చుకునేవారు. ఆ బండి వీధిలోకి వచ్చినపుడు, పనులన్నీ మానుకుని ,రేషన్ సరుకుల కోసం క్యూ లో నిలబడాల్సి వచ్చేది. అదే రేషన్ షాప్ అయితే, ప్రజలు తమకు వీలైన, అనుకూలమైన సమయంలో సరుకులు తెచుకునేవారు. అంతే కాదు, రేషన్ సరుకుల గురించి, అలా క్యూ లో ,వీధిలో నిలబడడం కొంతమందికి నచ్చేది కాదు, నామోషీ గా భావించేవారు. ఈ బండ్ల ద్వారా చాలా రేషన్ బియ్యం పక్క దారి పట్టిందనే ఆరోపణలు కూడా వున్నాయి.
ఆచరణలో ఈ పథకం అంత విజయవంతం కాకపోయినా, పేదలకు ఇంటివద్దే రేషన్ డెలివరీ చేస్తున్నామని , జగన్ గొప్పగా చెప్పుకునేవాడు.
అయితే, ఈ పథకంలో లోపాలు గమనించే , ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ పథకాన్ని రద్దు చేసింది, ఇదివరకు లాగానే, ప్రజలు రేషన్ దుకాణానికి వెళ్లి సరుకులు తెచ్చుకునే విధానం మళ్ళీ పునరుద్ధరించింది. కానీ, దివ్యాంగులకు, వృద్దులకు మాత్రం ఇంటివద్దకు రేషన్ డెలివరీ చేయలని నిర్ణయించింది.
ప్రభుత్వం చెబుతున్నదాని ప్రకారం , ఇప్పుడు 29,796 రేషన్ దుకాణాల్లో రేషన్ దుకాణాల్లో సరకులు పంపిణీ చేస్తున్నారు., పిఠాపురంలో పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ పంపిణీని ప్రారంభించారు. పెనకొండలో మంత్రి సవిత ప్రారంభించారు. వృద్ధులు, దివ్యాంగుల ఇంటి వద్దకే వెళ్లి ఆమె సరకులు అందజేశారు. కర్నూలులో మంత్రి టీజీ భరత్, పార్వతీపురం జిల్లా సాలూరులో మంత్రి సంధ్యారాణి రేషన్ పంపిణీని ప్రారంభించారు.
ప్రతీ నెలా దాదాపు 16 లక్షల మంది దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకి ఇంటికే రేషన్ సరుకులు అందించే ఏర్పాటు చేశారు.
ప్రభుత్వం చెపుతున్నాడని ప్రకారం, ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు తెరిచి ఉంటాయి. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చౌక ధరల దుకాణాలలో సరుకులు అందిస్తామని సివిల్ సప్లై అధికారులు తెలిపారు. ప్రతీ నెలా దాదాపు 16 లక్షల మంది దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకి ఇంటికే రేషన్ సరుకులు అందించే ఏర్పాటు చేశారు.
కూటమి ప్రభుత్వం , ఈ ఇంటివద్దకు రేషన్ సరుకుల పంపిణీని రద్దు చేయడంతో, షరా మామూలుగానే, వైసీపీ వాళ్ళు , అసలు రేషన్ పథకమే ఎత్తేస్తారా అని విమర్శలు మొదలు పెట్టారు.
జగన్ అయితే, ట్విట్టర్ లో, తమ ప్రభుత్వం వున్నపుడు, రేషన్ ను డోర్ డెలివరీ చేశామని, టీడీపీ వచ్చాక దాన్ని రద్దు చేయడం సరైన పద్ధతి కాదు, ఇంటివద్దకే రేషన్ పద్ధతిని ఆపడం వలన 9,260రేషన్ వాహనాలపై ఆధారపడ్డ వారు ఉపాధి కోల్పోయారని విమర్శిస్తున్నాడు.
అసలు వైసీపీ ఇలా రాద్ధాంతం చెయ్యడానికి కారణమేంటి? వైసీపీ అధికారంలో వున్నపుడు, ఇంటింటికీ డోర్ డెలివరీ ద్వారా, వాహనదారులతో కలిసి బియ్యం స్కాం చేశారని.. పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. రేషన్ కార్డులున్నవారికి ఎంతోకొంత ఇచ్చేసి.. వారికి పంపిణీ చేసినట్లుగా నమోదు చేసుకునేవారు. మిగతా బియ్యాన్ని, స్మగ్లింగ్ చేసేవారు. ఇప్పుడు అలాంటివి కుదరవనే, ఈ రాద్దాంతం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి
ఇప్పుడు కూటమి ప్రభుత్వం పునరుద్ధరించిన, రేషన్ దుకాణాల వద్దే సరుకుల పంపిణీ పథకం , ఎంతమేరకు విజయవంతం అవుతుందో చూడాలి, విజయవంతం అయితే, అప్పుడైనా ఈ వైసీపీ నాయకుల నోళ్లు మూతపడతాయో లేదో వేచి చూడాలి