6th June 2025
టిడిపి-జనసేన-బిజేపి కూటమి, ఆంధ్ర ప్రదేశ్ లో ఏడాది పాలన పూర్తి అయింది. 2019 నుండి 2024 వరకు చూస్తే సంక్షేమం మాత్రమే చేస్తూ, అభివృద్ది పూర్తిగా విస్మరించడం, రాజధాని పేరుతో, అమరావతి ని పాడుబెట్టి, 3 రాజధానుల నాటకాలు అడి 5 ఏళ్లు గడిపేయడం, సామాన్యుల పై , దళితుల పై ఆరాచకాలు పెరిగిపోవడం, ముఖ్యంగా బూతులు తిడుతూ, అసభ్య పదజాలంతో, ప్రతిపక్ష పార్టీ నాయకుల పై, విరుచుకుపడటం, ఇలా ఎన్నో కారణాలతో, ప్రజలు వైసీపీ ని ఛీత్కరించి 11 సీట్లు మాత్రమే ఇచ్చి, గద్దె దించి, వైసీపీ ని ఘోరంగా ఓడించి, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కి పట్టం కట్టి,164 సీట్లు ఇచ్చి ఘన విజయం అందించారు.
మొదటిసారిగా ఎమ్మెల్యే గా గెలిచిన, కూటమి విజయం లో ముఖ్య పాత్ర పోషించిన, పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. 25 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తే, అందులో 21 మంది టీడీపీకి చెందినవారు కాగా ముగ్గురు జనసేన, ఒకరు బీజేపీకి చెందిన వారు.
అభివృద్ధి లో కొన్నేళ్లు వెనక్కి వెళ్లిపోయిన ఆంధ్ర ప్రదేశ్ ను తిరిగి గాడిలో పెడతామని, అభివృద్ధి తో పాటు, ఎన్నిల హామీలో భాగంగా ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తామని, అధికారంలోకి వచ్చిన రోజు, కూటమి ప్రభుత్వం చెప్పింది. ఈ ఏడాదిలో, కూటమి ప్రభుత్వం ప్రజలకు చెప్పినవి చేసిందా? సూపర్ సిక్స్ లో ఎన్ని పథకాలు అమలు చేసారు? అభివృద్ధి విషయంలో ఏమి పురోగతి సాధించారు, అవన్నీ ఇప్పడు చూద్దాం.
1 . అన్న కాంటీన్లు. చంద్రబాబు సీఎం గా టీడీపీ 2014-2019 మధ్య కాలం లో పేదవాడికి 5 రూపాయలకే భోజనం పెట్టే , అన్న కాంటీన్ లు ఏర్పాటు చేసింది,
చుట్టుపక్కల ఊళ్ళనుండి, దగ్గరలో వున్న టౌన్ లకు, సిటీ లకు, కూలి పనుల చేసుకునేందుకు వచ్చే పేదవారు, మధ్యతరగతి వారు, తమ పనులు పూర్తి అయిన తరువాత,
5 రూపాయలకే భోజనం చేసి, తమ కూలి డబ్బు మిగుల్చుకుని, తిరిగి ఊళ్లకు వెళ్ళిపోయేవారు. ఆటో డ్రైవర్లకు, మధ్యతరగతి వారికి కూడా ఇవి ఎంతో ఉపయోగపడ్డాయి.
జగన్ 2019 లో సీఎం అయ్యాక, ఈ అన్న కాంటీన్ లను ఎత్తేసాడు, కనీసం, అన్న పేరు తీసేసి, వైస్సార్ పేరు పెట్టి, రాజన్న కాంటీన్లు అనే పేరుతో నైనా , ఈ కాంటీన్ లను నడపండి అని, టీడీపీ వారు ఎంత అభ్యర్ధించినా వైసీపీ ప్రభుత్వం వినలేదు. ప్రజలలో వైసీపీ పట్ల అసంతృప్తి పెరగడానికి ఇదే మొదటి కారణం అయింది. టీడీపీ వారే అప్పుడు తమ సొంత సొమ్ముతో కొన్ని ప్రాంతాల్లో ఈ అన్న కాంటీన్లు తెరిచారు.
ఇప్పుడు 2024 లో చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చాక, ఈ అన్న కాంటీన్లు మళ్ళీ తెరిచింది, ౨౫౫ కేంద్రాలలో ఈ అన్న కాంటీన్ లు ప్రారంభించారు, మంచి నాణ్యతో తో కూడిన ఆహారం ప్రజలకు అందించడం వల్ల అన్న కాంటీన్ల కు ప్రజలలో మంచి ఆదరణ లభించింది. ఈ ప్రభుత్వానికి ఈ విషయం లో మంచి మార్కులు పడ్డాయి.
2 . పింఛన్ల పెంపు : ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే, అప్పటివరకు వున్న 3,000 పింఛను, ఒకే సారి 4,000 కు పెంచి, అధికారం వచ్చిన మొదటి నెల నుండే కూటమి ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, కళాకారులకు పింఛన్లు ఇవ్వడం మొదలుపెట్టింది. దివ్యాంగులకు 7,000 పింఛను ఇస్తున్నారు. అదే కాక, ఎన్నికల ప్రసంగాల్లో చెప్పినట్టుగా, పెంచిన పింఛను ఏప్రిల్ నుండి జూన్ వరకు ఇవ్వలసిన 3,000 కూడా ఇచ్చారు, అంటే, మొదటి నెలలోనే, పింఛను పాత బకాయీలతో కలిపి 7,000 ఇచ్చారు. అదే వైసీపీ ప్రభుత్వం వున్నపుడు, 2,000 వున్న పింఛను, 3,000, దశలు వారీగా పెంచారు. పింఛన్ల విషయం లో కూడా కూటమి ప్రభుత్వానికి మంచి మార్కులే పడ్డాయి.
వైసీపీ ప్రభుత్వంలో , వాలంటీర్లను నియమించారు, వారు ఒకటో తేదీ ఉదయాన్నే ఫించను లబ్ధిదారుల ఇంటికి తీసుకువెళ్లి పింఛన్లు పంపిణీ చేసేవాళ్లు. వాలంటీర్లు లేకపోతే ఫించను ఇంటిదగ్గరకే వెళ్లి , అవ్వా, తాతలకు ఫించను ఇవ్వలేమని, వలంటీర్ల ద్వారా ఆ ఘనత సాధించినది మా ప్రభుత్వమే అనేవారు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే కూటమి అధికారంలోకి రాగానే వలంటీర్ల వ్యవస్థను తిరిగి పునరుద్ధరించలేదు . దీంతో ఫించన్లు ఇంటికి వస్తాయా రావా అనే అనుమానాలకు తావివ్వకుండా సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకుని కూటమి ప్రభుత్వం ఒకటో తేదీనే పింఛన్ల పంపిణీ కొనసాగిస్తోంది, చాలా నియోజకవర్గాల్లో, సీఎం తో సహా ,మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ ఫించను పంపిణీ , మొదటి రోజు కార్యక్రమం లో పాల్గొంటున్నారు.
3. ఉచిత ఇసుక విధానం: వైసీపీ హయాంలో ఉచిత ఇసుక విధానం ఎత్తేసారు, మొత్తం రాష్ట్రం లో వున్న ఇసుక రీచ్ లన్ని ఒకే సంస్థకు ఇచ్చెయ్యడంతో, ఇసుక మీద ప్రభుత్వానికి కంట్రోల్ లేకపోవడంతో, లారీ ఇసుక ధర విపరీతంగా పెరిగిపోయింది. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఇసుక నిబంధనలు విమర్శలపాలయ్యాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక, ఉచిత ఇసుక విధానం మళ్ళా తీసుకువచ్చింది. స్థానిక సంస్థల ద్వారా ఉచిత ఇసుక పంపిణీ ప్రారంభించింది. ఎవరికైనా సొంత వాహనం ఉంటే, చాలు, వారు , ఇసుక తవ్వుకోవచ్చని, సొంత వాహనం లేనివారు, కేవలం ట్రాన్స్ పోర్ట్ కు మాత్రం డబ్బు చెల్లించి ఇసుక తీసుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది. పూర్తి గా, సక్రమంగా ఈ ఉచిత ఇసుక విధానం అమలు కాకున్నా, వైసీపీ హయాం తో పోలిస్తే మాత్రం, ఇసుక ధరలు బాగానే తగ్గినట్టే. ఇసుక ధరలు తగ్గడంతో, భవన నిర్మాణ పనులు పుంజుకోవడంతో, భవన నిర్మాణ కార్మికులకు పనులు బాగానే దొరుకుతున్నాయి.
4. వైసీపీ హాయంలో ఒక్క టీచర్ పోస్ట్ నియామకం కూడా జరగలేదు, దానితో యువత వైసీపీ ఆగ్రహం పెంచుకున్నారు, అది గమనించే, చంద్రబాబు ఎన్నికల ప్రచార సమయంలో యువత కు ఎక్కువ హామీ ఇచ్చినది అధికారంలోకి రాగానే, మెగా డీఎస్సీ నిర్వహిస్తామని. వారికి హామీ ఇచ్చినట్టుగానే, సచివాలయం లో బాధ్యతలు తీసుకోగానే, సీఎం చంద్రబాబు, మొదటి సంతకం, , మెగా డీఎస్సీ పైనే పెట్టారు. అయినా, జాప్యం జరిగి, మెగా డీఎస్సీ నిర్వహించడానికి దాదాపు 12 నెలలు పట్టింది.ఈ జాప్యానికి కారణం, ఎస్సీ వర్గీకరణ అంశం అని చెప్పుకొచ్చారు. ఈ జూన్ 6 నుంచి 16,347 పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
5. రోడ్ల మరమ్మతులు: వైసీపీ హయాంలో , రోడ్లను పట్టించుకున్న పాపం లేదు, ముఖ్యంగా ఆటో డ్రైవర్లు, , ఈ విషయం లో వైసీపీ ప్రభుత్వాన్ని తిట్టుకునేవారు, వాహన మిత్ర పథకం లో తమ కు కొంత డబ్బు వస్తున్నా, అంతకు మించి , గుంతల రోడ్ల ప్రయాణాలతో , ఆటో లు దెబ్బ తిని రాబడి లో ఎక్కువభాగం , ఆటో రిపేర్లు , స్పేర్ పార్ట్స్ కే, పోతోందని వాపోయేవారు. అందుకే ఎన్నికల సమయం లో హామీ ఇచ్చినట్టుగానే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, రూ.3,800 కోట్ల నిధులతో రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మరమ్మతులు , రోడ్లు గుంతలు పూడ్చే పనులు ప్రారంభం అయ్యాయి, చాల చోట్ల పనులు పూర్తి అయ్యాయి. ఇంకా గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అదనంగా ₹6,000 కోట్ల విలువైన పనులు జరుగు గుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
5. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు: వివాదాస్పదంగా నిలిచిన, వైసీపీ హయాంలోని ఈ భూముల చట్టాన్ని పూర్తిగా రద్దు చేశారు.
ఇక కూటమి , అమలులో అసాధ్యమైన సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి అధికారం లోకి వచ్చిందని, వచ్చి ఏడాదైనా, వాటిని అమలు చెయ్యకుండా, ప్రజలను వంచించిందని , విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ నాయకులు. మరి నిజంగా వారిమాటల్లో సత్యం ఉందా?
సూపర్ సిక్స్ హామీలు, ఒక్కొక్కటి ఇప్పుడు చూద్దాం.
1. దీపం పథకం క్రింద సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు : కూటమి అధికారంలోకి వచ్చాక, మొదట ప్రారంభించిన సూపర్ సిక్స్ పథకం ఇదే. అయితే, ఈ ఏడాదిలో త్రీ సిలిండర్లు ఇవ్వాల్సి ఉండగా, ఒకటి మాత్రమే ఇచ్చారు.
”తల్లికి వందనం” పథకం ద్వారా ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు రూ.15,000 ఇస్తామని హామీ ఇచ్చారు.
గత ఏడాది ఈ పథకం అమలు చేయలేదు.
అయితే ఈ ఏడాది నుంచి ఇస్తామని 2025–26 బడ్జెట్‌లో ప్రతిపాదించిన ప్రభుత్వం… జూన్ 12 నుంచి దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
అయితే రూ.15వేలు బదులు రూ.13వేలు అందిస్తామని, మిగిలిన రూ.2వేలను విద్యావ్యవస్థ అభివృద్ధి నిధి కింద తీసుకుంటామని చెబుతోంది.