వరంగల్ లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ విశేషాలు , కేసీఆర్ స్పీచ్ గురించి చెప్పుకునే ముందు,
2023 తెలంగాణా ఎన్నికల్లో, కేసీఆర్ ఓటమి చెందిన తరువాత, 10 ఏళ్లుగా తనను, తమ పార్టీ ని గెలిపించి, అధికారం లో ఉంచిన ప్రజలకు కనీసం మీడియా ముందు వచ్చి కృతజ్ఞతలు చెప్పలేదు, ఆఖరికి , ఓడిన సీఎం లు గవర్నర్ ను స్వయంగా కలిసి , రాజీనామా పత్రం సంప్రదాయాన్ని పాటించకుండా , రాజీనామా పత్రాన్ని, సెక్రటరీ కి ఇచ్చి, గవర్నర్ కు అందజేయమని, ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు.
అసెంబ్లీ లో ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేసినతరువాత, ఇంతవరకు అసెంబ్లీ ముఖం చూడలేదు, తోటి బీఆర్ఎస్ శాసనసభ్యులు తనను బీఆర్ఎస్ శాసనసభా అధ్యక్షుడిగా ఎన్నుకున్నా , ప్రతిపక్ష నాయకుడిగా నియమితుడైనా , రేవంత్ ముఖం చూసే ధైర్యం లేకో, దమ్ము లేకో, తెలియదు కానీ, అసెంబ్లీ కి , ఓడినప్పటినుండి రావడం లేదు.
రేవంత్ ఎన్నో సార్లు విజ్ఞప్తి చేసాడు, కేసీఆర్ శాసనసభకు వచ్చి, తమ ప్రభుత్వానికి సలహాలు కూడా ఇవ్వొచ్చని., కానీ కేసీఆర్ , ఆ మాటలు పట్టించుకోలేదు అసెంబ్లీ కి రాలేదు.
2001 లో బీఆర్ఎస్ పార్టీ పెట్టి, ఎన్నో ఎత్తుపల్లాలు చూసి, అప్పటి వుమ్మడి ఆంధ్ర ప్రదేశ్ పాలకులు పై, తన పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు, 2014 నుండి 2023 దాక దాదాపు 10 ఏళ్ళు తెలంగాణ సీఎం గా వున్న కాలంలో కూడా, ,ప్రాసలతో కూడిన తిట్లతో ,కొన్ని సార్లు మితిమీరిన తిట్ల పురాణంతో టీడీపీ,కాంగ్రెస్, బీజేపీ లపై విరుచుకుపడ్డారు.
మరి ఒక్కసారి ఓటమి చూడగానే , ఆ సామర్ధ్యం, ఏమయిపోయిందో తెలియదు, ఆ ధైర్యం ఏమయిపోయిందో తెలియదు, రాజకీయాల్లో ఆక్టివ్ గా లేకుండా, ఎక్కువ మాట్లాడకుండా ఫామ్ హౌస్ కే పరిమతమయిపోయారు.
అయితే, ఈరోజు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో, బీఆర్ఎస్ రజతోత్సవ సభ లో , కాంగ్రెస్ పై , బీజేపీ పై విరుచుకుపడి, పాత కేసీఆర్ ను చూపిస్తారని ఎదురుచూసినవారికి నిరాశే మిగిల్చారు.
దాదాపు ఏడాది తర్వాత కేసీఆర్ ప్రసంగం అనేసరికి తెలంగాణ వ్యాప్తంగా ఓ ఉత్కంఠ నెలకొంది. అందరూ కేసీఆర్ ప్రసంగం గురించే ఎదురుచూసారు అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ నిర్వహిస్తున్న పెద్ద సభ కావడం , అది కూడా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ కావడంతో ఆయన ఏం మాట్లాడుతారోననే ఉత్కంఠ నెలకొంది. అయన పంచ్ డైలాగ్స్ కోసం బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు , కాని, వారి అంచనాలన్నీ తలకిందులు అయ్యాయి. కేసీఆర్ స్పీచ్ లో అయన మార్క్ డైలాగులు, పంచ్ లు ఎక్కడా కనపడలేదు …
ఎప్పటిలాగే రైతుల సమస్య, 24గంటల కరెంట్ ఇవ్వడం లేదని విమర్శలతోపాటు, దేవుళ్ల మీద ప్రమాణాలు చేసి, ప్రజలను మోసం చేస్తున్నారనే , పాత డైలాగ్ లే రిపీట్ చెయ్యడంతో పాటు, . ఎపుడు చెప్పినట్టే, వుమ్మడి ఆంధ్ర పాలకులు, తెలంగాణ పట్ల ఎలా పక్ష పాత వైఖరి, నిర్లక్ష్యం ప్రదర్శించారు, అలాగే ఎప్పటిలాగే తమ పార్టీ పాతికేళ్ల తమ పార్టీ ప్రస్థానం గురించి ఎప్పుడూ చెప్పే విషయాలనే ఏకరువు పెట్టారు తప్పితే అందులోనూ కొత్తదనం కనిపించలేదు.
కేసీఆర్ స్పీచ్ లో అక్కడక్కడ పంచ్ లైన్స్ , నాలుగైదు మార్క్ డైలాగ్ లు మినహా మిగతా స్పీచ్ మామూలుగానే సాగిపోయినట్లుగా అనిపించింది. ఇదే భావన సభకు హాజరైన వారిలోనూ కనిపించడం, విశేషం.
ఇక నుంచి ఫామ్ హౌజ్ ను వీడి, ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నానని చెప్పారు, ఈ ముక్క చెప్పడానికే అంత పెద్ద సభ పెట్టినట్టుంది తప్ప, కేసీఆర్ ప్రసంగంలో కొత్తదనం ఎక్కడా కనిపించలేదు. . ఆయన ప్రసంగంలో, మునుపటి చమక్కులు, వాగ్ధాటి కనిపించకపోవడంతో కొంతమందిలో నిరాశతో పాటు విసుగు కూడా కనిపించింది
ఒక్క ఓటమి, ఎలాంటి కెసిఆర్ ను , ఎలా మార్చింది, ఎలా క్రిందకు దించిందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది కదా.