24th Feb 2025
ABN నుండి వెంకట కృష్ణ వెళ్లిపోతున్నారు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొంతమంది సీనియర్ జర్నలిస్టులు ఈ వార్త నిజమే అని చెబుతున్నారు.
ABN వెంకట కృష్ణ తన 7pm డిబేట్ తో ఎంతో పాపులర్ , టీడీపీ అభిమానులు, టీడీపీ కార్యకర్తల్లో ఆయనికి మంచి ఇమేజ్ వుంది.
ఆయన ABN వదిలి వెళ్లిపోవడం బాధాకరం అని సోషల్ మీడియాలో కొంత మంది టీడీపీ అభిమానులు కామెంట్స్ కూడా పెడుతున్నారు.
పర్వతనేని వెంకట కృష్ణ, ETv, 6TV, TV5, ఛానెల్స్ లో పని చేసారు.
TV5 లో పని చేసేటప్పుడు, వైస్సార్ మరణంలో రిలయన్స్ పాత్ర ఉందని, అయన ఒక న్యూస్ ప్రోగ్రాంలో చెప్పినపుడు, రిలయన్స్ బంక్ ల పై వైసీపీ కార్యకర్తలు దాడి చేసినపుడు, ఆ కార్యకర్తలతో పాటు, వెంకట కృష్ణ పై కూడా కేసులు పెట్టారు, ఇప్పటికీ ఆ కేసులు అయన మీదున్నాయని అంటారు.
2019 తరువాత ABN లో చేరే ముందు, ఆంధ్ర ప్రదేశ్ లో స్థాపించిన మొదటి న్యూస్ ఛానల్ AP 24X7 , లో చేసేవారు, అయితే 2019 ఎన్నికల తరువాత, AP 24X7 వదిలేసి , ABN లో జాయిన్ అయ్యారు.
ABN నుండి ఆయనే వెళ్లిపోయారా లేక పంపేస్తున్నారా ? ఇదయితే మాత్రమే ఎవ్వరు చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం ఆయన నోటీసు పీరియడ్ లో వున్నారని అంటున్నారు.
వెంకట కృష్ణ ఏ ఛానల్ లో జాయిన్ అవుతున్నారు ?
కొని సోర్సెస్ ప్రకారం, ఆయన టీడీపీ సంభందించిన ఒక డిజిటల్ ఛానల్ , సీఈఓ గా జాయిన్ అవుతున్నారని, ఆ ఛానెల్ లోనే ఆయన ప్రోగ్రామ్స్, న్యూస్ డిబేట్ వుంటాయని తెలుస్తోంది.