18 వ లోక్ సభ ఎన్నికలు… ఈ వివరాలు మీకు తెలుసా ?

 

18 వ లోక్ సభ ఎన్నికలు… ఈ వివరాలు మీకు తెలుసా ?

ఎన్నికలు జరిగేవి : 543 లోక్ సభ స్థానాలు,

4 రాష్ట్రాల (ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఓడిశా ) అసెంబ్లీ ఎన్నికలు

13 రాష్ట్రాల్లో, 26 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు,7 దశల్లో ఎన్నికలు,

జూన్ 4 న ఫలితాలు.

మొత్తం ఓటర్లు : 96.88 కోట్లు,

పురుషులు : 49.7 కోట్లు,

మహిళలు: 47.1 కోట్లు

18-19 మధ్య వయసు వున్న ఓటర్లు: 1.8 కోట్లు

20-29 ఏళ్ళ మధ్య ఓటర్లు: 19.74 కోట్లు,

85 ఏళ్ళు దాటిన ఓటర్లు : 82 లక్షలు

మొత్తం ఈవీఎంలు : 55 లక్షలు

పోలింగ్ కేంద్రాలు: 10.5 లక్షలు,

పోలింగ్ అధికారులు, భద్రతా సిబ్బంది : 1.5 కోట్ల మంది

పోలింగ్ వాహనాలు : 4 లక్షలు

 

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ మరియు లోక్ సభ ఎన్నికల విశేషాలు

రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,09,37,352

పురుషులు       2,00,84,276 మంది

మహిళలు        2,08,49,730 మంది

ట్రాన్స్‌జెండర్లు 3,346

ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు  7,763 మంది,

సర్వీసు ఓటర్లు  67,393 మంది

మొత్తం పోలింగ్‌ స్టేషన్లు  46,165

కేవలం మహిళా సిబ్బంది మాత్రమే ఉండేలా పోలింగ్‌ స్టేషన్లు 179

ఎంత మంది ఓటర్లకు ఓ పోలింగ్‌ స్టేషన్‌ 887

ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది  3,82,218

బందోబస్తు లో పాల్గొనే పోలీసులు  2,18,515

85 ఏళ్లు నిండిన ఓటర్లకు ఇంటి నుంచే ఓటు వేసేలా ఏర్పాట్లు చేశారు. నోటిఫికేషన్‌ వచ్చాక ఫామ్‌-12 ద్వారా రిటర్నింగ్‌ అధికారికి దరఖాస్తు చేసుకోవచ్చు. దాన్ని పోస్టల్‌ బ్యాలెట్‌గా గుర్తిస్తారు. 10 రోజుల ముందే ఓటు వేసేలా చర్యలు తీసుకుంటారు.

ఆన్‌లైన్‌లో నామినేషన్‌: పోటీ చేసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నామినేషన్‌ వేసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే దీన్ని ప్రింట్‌ తీసి వ్యక్తిగతంగా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఇవ్వాలి. అభ్యర్థులు ఇచ్చే ఎన్నికల అఫిడవిట్‌లో ఎలాంటి ఖాళీ లేకుండా భర్తీ చేయాలి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *