ఎవరీ తంగెళ్ల శ్రీనివాస్ ఉదయ్….?

 

 

పిఠాపురం నుండి తాను పోటీ చేస్తానని పవన్ ప్రకటించిన తరువాత, జనసేన లో చేరడానికి, 20 మార్చి న పిఠాపురం నుండి వివిధ పార్టీ నాయకులు వచ్చిన వచ్చిన సందర్భంగా , వారితో జరిగిన సమావేశం లో పవన్ ప్రసంగిస్తూ తన కోసం పిఠాపురం నియోజకవర్గాన్ని త్యాగం చేసిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు కాకినాడ ఎంపీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.. పొత్తులో భాగంగా కాకినాడ ఎంపీ సీటు జనసేనకు ఇదివరకే ఖాయం అయింది. . బీజేపీ పెద్దలు పార్లమెంట్ కు పోటీ చేయాలని అడిగినా తాను అసెంబ్లీకే పోటీ చేస్తానని పవన్ చెప్పారు.

దీనితో ఒక్కసారిగా ఎవరీ ఉదయ్ అనే చర్చ ప్రారంభమయింది.

 

ఉదయ్ ప్రస్థానం

తూర్పు గోదావరి జిల్లా కడియం వాస్తవ్యులైన ఉదయ్ 2006లో హైదరాబాద్‌లోని TRR ఇంజినీరింగ్ కాలేజీ నుండి ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేసిన తరువాత, వివిధ సాఫ్ట్‌వేర్ కంపెనీలలో పనిచేశాడు,దుబాయ్ లో వుద్యోగం చేస్తుండగా, స్వంతంగా బిజినెస్ చేసే ఉద్ద్యేశ్యంతో, 29 సంవత్సరాల వయస్సులో ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి, ఇండియా కు తిరిగి వచ్చేసాడు. అతని తల్లిదండ్రులు అతను రిస్క్ చేస్తున్నాడని, కెరీర్ లో తప్పు చేస్తున్నాడని భావించినా , ఆయుర్వేద వైద్యురాలు అయిన ఆయన భార్య బకుల్ తంగెళ్ల  ప్రోత్సాహంతో టీ టైం ఔట్లెట్ బిజినెస్ ప్రారంభించాడు.

2016లో ఆంధ్ర ప్రదేశ్‌లో రాజమండ్రిలో 150 చదరపు అడుగుల స్థలంలో రూ. 5 లక్షలతో తన మొదటి టీ టైం అవుట్‌లెట్‌ను ప్రారంభించాడు. అక్కడ బిజినెస్ బాగా నడిచిన తరువాత, 6 సంవత్సరాల తరువాత, తన టీ టైం అవుట్ లెట్ బిజినెస్ ను, ఫ్రాంచైజ్ మోడల్ ద్వారా తన టీ చైన్ బిజినెస్ ను, 100 అవుట్‌లెట్‌ లకు విస్తరించాడు, విస్తరించిన మొదటి సంవత్సరంలోనే 2 కోట్ల టర్నోవర్ సాధించాడు. ఇప్పుడు ఇండియా అంతటా, 3,000 టీ టైం అవుట్ లెట్లు వున్నాయి. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉదయ్ యొక్క ఆఫీస్ 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. .

టీ టైమ్ అవుట్‌లెట్‌లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మణిపూర్, కర్ణాటక, రాజస్థాన్, మణిపూర్, పుదుచ్చేరి, తమిళనాడు, ఢిల్లీ, హర్యానా మరియు ఒడిశాలో విస్తరించి ఉన్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 280 టీ టైమ్ ఔట్‌లెట్లు ఉన్నాయి. ప్రస్తుతం అతని టీ టైం అవుట్ లెట్ బిజినెస్ 300 కోట్ల టర్నోవర్ కు చేరుకుందని చెబుతున్నారు. తన టీ చైన్ బిజినెస్ ద్వారా దాదాపు 20,000 మందికి ఉపాథి అవకాశాలు కల్పించాడు ఉదయ్.

ఒక సంవత్సరం క్రితం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ లో జాయిన్ అయ్యారు. అప్పటినుండి పార్టీ కార్యకలాపాల్లో చురుగా పాల్గొంటున్నారు. పవన్ వారాహి యాత్ర వాహనం ఉదయే సమకూర్చాడని వార్తలు వచ్చాయి. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జి గా ఉదయ్ ను పవన్ నియమించారు. అయితే ఇప్పుడు పవన్ పిఠాపురం నుండి పోటీ చేయడానికి నిశ్చయించుకున్న నేపథ్యంలో, ఉదయ్ ను కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పవన్ ప్రకటించారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *