కాంగ్రెస్ నుండి , తమ ఎంపీ శశిథరూర్ ని సాగనంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా ? పొమ్మనలేక పొగబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారా ?

16th May 2025

పెహల్గామ్ టెర్రరిస్టుల దాడి తరువాత, పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ ఉగ్రవాదుల పట్ల మోడీ ప్రభుత్వం తీసుకున్న ప్రతి చర్యను, శశిథరూర్ సమర్ధిస్తున్నాడు, మోడీ ప్రభుత్వం పాకిస్తాన్ పట్ల తీసుకున్న ప్రతీకార చర్యలు, ముఖ్యంగా సింధు నది జలాల ఒప్పందం రద్దు చెయ్యడం ఆపరేషన్ సిందూర్ తో, పాకిస్తాన్ లోని 11 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చెయ్యడం , ఇవి సరి అయిన చర్యే అని, పాకిస్తాన్ ఎప్పుడూ, ఒకవైపు ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ, మరో వైపు ఉగ్రవాదులతో మాకు సంభందం లేదని, బయట ప్రపంచానికి , ఎలా అబద్దాలు చెబుతుందో, వాటిని ,వివరిస్తూ, నేషనల్, ఇంటర్నేషనల్ ఛానల్స్ ఇంటర్వూస్ లో చెప్పాడు, భారత్ వాణి ని, బాణి ని బాగా వినిపిస్తున్నాడు.

లండన్ లో పుట్టి, ముంబై, ఢిల్లీ లో చదువుకుని, అమెరికాలో డాక్టరేట్ చేసి, ౩౦ ఏళ్లపాటు ఐక్యరాజ్యసమితి లో పంచి చేసిన శశిథరూర్ కి దౌత్యవేత్తగా వున్న అనుభవం , ఇంగ్లీష్ బాష పై ఆయనకి వుండే పట్టు, దీనికి దోహదపడ్డాయి.

పెహల్గామ్ సంఘటన తరువాత, మోడీ ప్రభుత్వం భధ్రత వైఫల్యాలను ఎండగడదామని , ప్రభుత్వం విఫలం అయిందని , ఇరుకున పెడదామని చూస్తున్న కాంగ్రెస్ భావాలకు, విధానాలకు, వ్యతిరేకంగా తమ సొంత ఎంపీ శశిథరూర్ వ్యవహరించడం పట్ల , కాంగ్రెస్ గుర్రుగా వుంది.

ఒకపక్క పాకిస్తాన్ పై కాల్పుల విరమణ, ట్రంప్ ఆదేశంతోనే , మోడీ విరమించాడని , ఈ ఆపరేషన్ సిందూర్ పూర్తిగా విజయవంతం చెయ్యటం లో మోడీ విఫలం అయ్యాడని ఒకవైపు కాంగ్రెస్ విమర్శిస్తూ ఉంటే, మరో వైపు , అదే కాంగ్రెస్ పార్టీ నాయకుడైనశశిథరూర్ మోడీ తీసుకున్న సైనిక చర్యలను పూర్తిగా సమర్ధించటం, కాంగ్రెస్ కు , రాహుల్ గాంధీ కి నచ్చటం లేదు. మోడీ వ్యతిరేకులైన జర్నలిస్టుల దగ్గర కూడా , పాకిస్తాన్ పట్ల , మోడీ తీసుకున్న సైనిక చర్య ను పూర్తిగా సమర్ధించటం , కాంగ్రెస్ కు ఇంకా నచ్చటం లేదు.

చాలా కాలం నుండి కాంగ్రెస్ కు శశిథరూర్ కు మధ్య గ్యాప్ వుంది, ముఖ్యంగా, గతం లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పోటీ చేసినప్పటినుండి, ఆ గ్యాప్ ఇంకా పెరిగింది.

శశిథరూర్ 2009 లో కాంగ్రెస్ పార్టీ లో చేరాడు. 4 సార్లు ఎంపీ గా గెలిచినా, శశిథరూర్ ను కాంగ్రెస్ పెద్దగా ఉపయోగించుకోలేదు. శశిథరూర్ ప్రస్తుతం కేరళలో లోని తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ గా వున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకోడానికి శశిథరూర్ ఆసక్తి చూపించినా జాతీయ కాంగ్రెస్ ఆయనను పట్టించుకోలేదు., సన్నీ జోసెఫ్ అనే వ్యక్తిని కేరళ కాంగ్రెస్ రాష్ట్ర ప్రెసిడెంట్ గా నియమించారు. శశిథరూర్ కేరళ సీఎం పదవికి పోటీ పడాలని వున్నా , కాంగ్రెస్ అందుకు ఒప్పుకోవటం లేదు.

శశిథరూర్ కు మోడీ తో బాగానే పొసుగుతుంది, మోడీ కొన్ని విధానాలను గతం లో శశిథరూర్ ప్రశంసించాడు. బీజేపీ కి కూడా శశిథరూర్ పట్ల మంచి అభిప్రాయమే వుంది.

ప్రస్తుతం మోడీ చర్యలను, బీజేపీ ని, సమర్శిస్తున్న శశిథరూర్ , త్వరలో, తన సీఎం కల నెరవేర్చుకోడానికి, బీజేపీ లో చేరినా ఆశ్చర్యపోనక్కరలేద్దు.
రచయితగా, ఉపన్యాసకుడిగా కూడా మంచి పేరు వున్న శశిథరూర్ అంతటి సీనియర్ నాయకుణ్ణి , పోగొట్టుకుంటే మాత్రం అది జాతీయ కాంగ్రెస్ కే తీరని నష్టం. మరి కాంగ్రెస్ పెద్దలు ఈ వాస్తవాన్ని గ్రహిస్తారో లేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *