బ‌లూచిస్థాన్, పాకిస్తాన్ నుండి విడిపోయి, స్వ‌తంత్ర దేశంగా అవతరించిందా ?

15th May 2025

బ‌లూచిస్థాన్ స్వ‌తంత్ర దేశంగా ప్ర‌క‌టించుకుంది.క్వెట్టాలో కొత్త పార్ల‌మెంటు ఫోటోలు, జాతీయ చిహ్నం, జాతీయ గీతాన్ని సోష‌ల్ మీడియాలో పంచుకుంది. మిగతా దేశాలు త‌మ దేశంలో రాయబారకార్యాలయాలు ఏర్పాటు చేసుకోవాల‌ని కోరింది. బ‌లూచిస్థాన్ లిబ‌రేష‌న్ ఆర్మీ స‌హా ప‌లు సంస్థ‌లు కొన్ని దశాబ్దాలుగా,
పాకిస్తాన్ నుండి, స్వతంత్రం కోసం.. పోరాడుతున్నాయి.

బ‌లూచిస్తాన్ లిబ‌రేష‌న్ ఆర్మీకి సంబంధించిన కొంద‌రు వేర్పాటు వాదులు ఆఫ్గ‌నిస్తాన్ వెళ్లి అక్క‌డ సైనిక శిక్షణ తీసుకుని , పాకిస్థాన్ తో పోరాడారు. బలూచిస్థాన్ , స్వతంత్ర దేశం అయిందంటే, పాకిస్తాన్ సగం పని అయిపోయినట్టే.

బ‌లూచిస్థాన్ ది 75 ఏళ్ల స్వ‌తంత్ర పోరాటం. 1948లో పాకిస్తాన్ ప్రభుత్వం , బలవంతాన, సైనిక చర్య ద్వారా బ‌లూచిస్థాన్ ని కలిపేసుకుంది . పాకిస్థాన్ దేశంలో, 44 శాతం బ‌లూచిస్తాన్ దే. పాకిస్తాన్ జ‌నాభాలో, బ‌లూచిస్థాన్ జనాభా వంతు 7 నుంచి 8 శాతం ఉంటుంది. అసలెందుకు పాకిస్తాన్ బ‌లూచిస్తాన్ ను వదులుకోవడం లేదు అని పరిశీలిస్తే,

మొద‌టిది నైస‌ర్గికంగా పాక్ మ‌రింత బ‌ల‌హీన‌ప‌డుతుంది. మొత్తం పాకిస్థాన్ లోనే 44 శాతం వేరు ప‌డడం అంటే దాదాపు స‌గానికి స‌గం దాని నైస‌ర్గిక ముఖ‌చిత్రమే మారిపోతుంది. దీనికి తోడు సింధ్, గిల్గిట్ బ‌ల్టిస్థాన్ సైతం.. వేరు ప‌డే అవ‌కాశాలున్నాయి. దీంతో ఇది మ‌రో దెబ్బ‌గా క‌నిపిస్తోంది.

చైనా గత కొన్ని సంవత్సరాలనుండి పాకిస్తాన్ కు ఎంతో సహాయం చేస్తున్నది అంటే అది బ‌లూచిస్థాన్ని చూసే. ఇక్కడ, చైనా హైబ్రిడ్ రోడ్లు వేసింది, , ట్రాకులు నిర్మించింది. .. ఈ నిర్మించిన వాటిని బలూచిస్తాన్ వాళ్ళు ధ్వంసం చేస్తుండంతో కొత్తగా ఎయిర్ పోర్టు నిర్మించింది. ఎంతో శ్రమ పడి గ్వ‌ద‌ర్ పోర్టు నిర్మించిన చైనా శ్రమ మొత్తం వృధా అవుతుంది.

చైనాకు కావ‌ల్సింది బ‌లూచిస్థాన్ ప్రాంతం లో వున్న ఎక్కువగా వున్న ఖనిజాలు, మినరల్స్ . ఒకవేళ బ‌లూచిస్థాన్ విడిపోతే, ఇక చైనా పాకిస్తాన్ ను పట్టించుకోదు, బ‌లూచిస్థాన్ ను మాత్రమే సపోర్ట్ చేస్తుంది.

పాకిస్తాన్ వాళ్ళు, బలూచిస్తాన్ యువకులను కిడ్నాప్ చేసి త‌మ సైన్యంలో కలుపుకోవడం లాంటి ఎన్నో అరాచకాలు చేసేవారు. ఆ అరాచకాలు భరించలేకే , అక్కడ ప్రజలు పాకిస్తాన్ మీద తిరుగుబాటు చేస్తున్నారు. దానికి ఉదాహరణే మొన్న ఒక రైలును హైజాక్ చేసి నిరసన తెలిపారు. మొన్న భారత్ పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం చేసిన సమయంలోనే , బ‌లూచిస్తాన్ లిబ‌రేష‌న్ ఆర్మీ వాళ్ళు, క్వెట్టా లోని పాకిస్తాన్ ప్ర‌ధాన సైనిక కార్యాల‌యాల‌పై దాడులు చేసి అక్కడ పాకిస్తాన్ సైనికులను తరిమికొట్టారు.

బ‌లూచిస్థాన్ స్వ‌తంత్ర దేశంగా ప్రకటించుకుంది , మరి ఐక్యరాజ్య సమితి , దాని ఒక దేశంగా గుర్తిస్తుందో లేదో , త్వరలో తెలుస్తుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *