ఢిల్లీ అసెంబ్లీకి బుధవారం (ఫిబ్రవరి 5) ఎన్నికలు జరిగాయి. పోలింగ్ 60.1% నమోదయింది. పోలింగ్ ముగిసిన వెంటనే, అనేక సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ వివరాలు ప్రకటించాయి. మేజర్ సర్వే సంస్థలు, ఈ సారి, ఢిల్లీ పీఠం బిజేపిదే అని తేల్చి చెప్పేసాయి. ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీ 14 మాత్రమే గెలుస్తుందని, చెప్పి, ఎన్నికల కౌంటింగ్ తరువాత ఖచ్చితంగా అవే ఫలితాలు రిపీట్ అయి,చరిత్ర సృష్టించిన కేకే సర్వే మాత్రం, ఈ సారి ఢిల్లీ లో మరలా ఆమ్ ఆద్మీ పార్టీ నే అధికారం లోకి వస్తుందని చెప్పింది. కేకే సర్వే, పంజాబ్ ఎన్నికల సర్వేలో ఫెయిల్ అయినా, మహారాష్ట్ర ఎన్నికల్లో మాత్రం విజయం సాధించింది.
ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 36. kk సర్వేప్రకటించిన దాని ప్రకారం, ఆప్ కచ్చితంగా 39 స్థానాలలో విజయం సాధిస్తుంది. బీజేపీకి 22 స్థానాలలో విజయం దక్కుతుంది. ఇక మిగిలిన తొమ్మిది స్థానాలలో పోరు హోరాహోరీగా ఉంటుంది. వాటిలో కూడా ఓ ఐదు స్థానాలలో మొగ్గు ఆప్ వైపే ఉంది. మిగిలిన నాలుగు స్థానాలలో బీజేపీకి విజయావకాశాలు ఉన్నాయి. అంటే కేకే సర్వే ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీకి 44, బీజేపీకి 26 స్థానాలు దక్కుతాయి.
వివిధ సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ వివరాలు
సుదీర్ఘ కాలం, ఢిల్లీ మద్యం స్కామ్ కేసు లో జైల్లో వుండి, బెయిల్ పై బయటకు వచ్చిన, గత రెండు సార్లు ఢిల్లీ సిఎం గా పని చేసిన, అరవింద్ కేజ్రీవాల్ , ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి, తాను ఏ తప్పు చేయలేదని, తనకు ప్రజాబలం వుందని, ఈ ఎన్నికల్లో నిరూపించుకుని, అప్పుడు మాత్రమే సిఎం అవ్వాలని తలచారు, అందుకే జైల్ నుండి బయటకు వచ్చిన తరువాత, ఆయన సిఎం పదవిలో కొనసాగకుండా, మరో ఆప్ ఎమ్మెల్యే అతిషీ సిఎం గా నియమించారు.
అయితే, ఎగ్జిట్ పోల్స్ లో, బిజేపినే గెలుస్తుందని మెజారిటీ సర్వే సంస్థలు చెప్పినా, ఆ సర్వేలను ఆప్ కొట్టిపారేసింది. తామే అధికారంలోకి వస్తామనే ధీమాను వ్యక్తం చేస్తోంది.