దేవగుప్తపు హర వెంకట సూర్య సత్యనారాయణ మూర్తి, అంటే గుర్తుపట్టరు, కానీ తెలుగులో టీవీ5 మూర్తి అనగానే వెంటనే గుర్తుపట్టేస్తారు, అంతలా ప్రభావం చూపాడు, జర్నలిస్ట్, న్యూస్ యాంకర్ మూర్తి. టీవీ5 9pm డిబేట్ కు ఎక్కువమంది వీక్షకులు పెరిగారు అంటే, దానికి కారణం మూర్తి అనడంలో అతిశయోక్తి లేదు.
ఇప్పుడు మూర్తి కి ప్రమోషన్ ఇచ్చి, టీవీ5 CEO గా బాధ్యతలు ఇచ్చారని తెలుస్తోంది. తెలుగు న్యూస్ ఛానళ్లలో రేటింగ్ పరంగా చూసుకుంటే, టీవీ5, ఎప్పుడూ 3,4 స్థానాల్లో వుంటూ, ఒక టాప్ ఛానల్ గా నిలిచింది.
టీవీ5 న్యూస్ ఛానల్ ను, శ్రేయ బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 2 అక్టోబర్ 2007న చిత్తూరుకు చెందిన బీఆర్ నాయుడు (బొల్లినేని రాజగోపాల్ నాయుడు) స్థాపించారు. 29 మార్చి 2017న, బీఆర్ నాయుడు , భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్, హిందూ ధర్మంను ప్రారంభించారు . ఆయనకున్న ఇద్దరు కుమారులు , ఈ ఛానల్ బిజినెస్ డీలింగ్స్ చూసుకుంటూ వుంటారు టీవీ5, గత 5 ఏళ్లుగా టీడీపీ అనుకూల ఛానల్ గా వ్యవహరించింది, జగన్ సీఎం గా వున్నపుడు, ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ, వైసీపీ పై చేసిన పోరాటానికి, టీవీ5 పూర్తి మద్దత్తు ఇచ్చింది, దీనికి తగ్గట్టుగానే, టీవీ5 ఛానల్ డిబేట్ లు వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను గత 5 ఏళ్లు పూర్తి స్థాయిలో ఎండగట్టి, 2024ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిలో , టీవీ5 తన వంతు పాత్ర పోషించింది. ఆ సహాయానికి ఋణం తీర్చుకోడానికే, 2024 లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, బీఆర్ నాయుడి చిరకాల వాంఛ అయిన , టీటీడీ చైర్మన్ పదవిని, బీఆర్ నాయుడు కి ఇచ్చారు సీఎం చంద్రబాబు.
మూర్తి జర్నలిజం కెరీర్ చూసుకుంటే,
మూర్తి ఈనాడు నుంచి జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించారు. దినపత్రికలో విజయవాడ లో వుంటూ , ఈనాడు న్యూస్ పేపర్ కు సంచలన కథనాలు అందించి టాప్ జర్నలిస్టులలో ఒకరిగా నిలిచారు. టీవీ ఛానళ్ల యుగం ప్రారంభమయ్యాక, హైదరాబాద్ వచ్చి, etv2 ఛానెల్ లో కొంత కాలం పని చేసారు. తరువాత చానళ్లు మారారు. ఎన్‌టీవీ, ఏబీఎన్‌లో చాలా కాలం పని చేశారు. ఏబీఎన్ నుండి మహా టీవీ కి వెళ్లారు.చివరికి టీవీ5లోకి వచ్చారు.
మూర్తి, ABN ఛానల్ నుండి మహా న్యూస్ టీవీ ఛానల్‌లో చేరిన తరువాత , ఆ ఛానల్ ఎదుగుదల లో ప్రధాన భూమిక పోషించారు. . ప్రైమ్ టైమ్‌లో మూర్తి నిర్వహించే డిబేట్ ల ద్వారా మహా న్యూస్ వీక్షకుల సంఖ్యను పెంచారు. ముఖ్యంగా కత్తి మహేష్ తో డిబేట్లు, , శ్రీరెడ్డితో కలిసి కాస్టింగ్ కౌచ్‌పై మూర్తి డిబేట్ లు నిర్వహించిన విధానం వల్ల మహా న్యూస్ కు వీక్షకుల సంఖ్య బాగా పెరిగింది. అప్పట్లో, మూర్తి ప్రైమ్ టైమ్ షో కోసం ఎదురు చూసే ఎక్కువమంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు, మూర్తి.
అయితే, జనసేన నిధుల సేకరణ కార్యక్రమంలో మూర్తి చేసిన స్టింగ్ ఆపరేషన్ స్టోరీ , రాజకీయ వర్గాలలో ఒక సంచలనం సృష్టిస్తే, , మహా న్యూస్ ఛానల్ లో ఒక వివాదం సృష్టించింది. అయితే, మహా న్యూస్ ఛానెల్ , ఈ స్టోరీ ని అకస్మాత్తుగా ఆపివేసిందని, అలా ఆపెయ్యడం నిజాయితీగల వ్యక్తిగా తనకు అది నచ్చలేదని, అందుకే వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేశానని , మహా న్యూస్ ఛానెల్ నుండి బయటకు వచ్చిన తరువాత, ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో అయన వివరించారు.
మహా న్యూస్ ఛానెల్ టీడీపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ, జనసేన నిధుల సేకరణకు వ్యతిరేకంగా కథనాన్ని ఆపమని ఛానల్ యాజమాన్యం నుండి వత్తిడి రావడంతో, మూర్తి మనస్తాపం చెంది ఛానెల్‌కు రాజీనామా చేశాడు.ఈ విషయం , మూర్తి ఇచ్చిన ఇంటర్వ్యూ వల్లే బయటకు వచ్చింది.
అయితే, అప్పుడు మూర్తి, ABN ఛానల్‌కు తిరిగి వెళ్లడానికి ప్రయత్నించాడు, కానీ మూర్తి గతంలో రెండుసార్లు ABN ను విడిచిపెట్టినందున , ABN యాజమాన్యం, మూర్తి ని ని, మరలా తిరిగి చేర్చుకోవడానికి ఆసక్తి చూపలేదని, అప్పట్లో వార్తలొచ్చాయి.
మహా న్యూస్ నుండి బయటకు వచ్చేసిన మూర్తి టీవీ5 లో చేరారు, ఇప్పటిదాకా కూడా కూడా టీవీ5 లోనే పని చేస్తున్నారు.
TV5 లో తన డిబేట్ లు నిర్వచించే విధానం ద్వారా , మహా న్యూస్‌లో వచ్చిన దానికన్నా ఎక్కువ పేరు సంపాదించాడు మూర్తి .
కేవలం తన ప్రైమ్ టైం డిబేట్ లు చూడటానికే, రాత్రి 9 గంటలకు, టీవీ5 ఛానల్ చూసే ప్రేక్షకులను సంపాదించుకున్నాడు, మూర్తి.
ఇప్పటిదాకా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారి గా ఉండిపోయారు, మూర్తి. జర్నలిజం విలువలకు పూర్తిగా మూర్తి కట్టుబడ్డారు, తప్పుల్ని ప్రశ్నించడానికి ఏ మాత్రం భయపడరు, ఆయనపై కోపంతో ఇతరులు చేసే ఆరోపణలు , వైసీపీ మీడియా లో మూర్తి పై వచ్చే వార్తలు అన్నీ అని తేలిపోయాయి. కొద్ది నెలల క్రితం జ్యోతిష్కుడు వేణు స్వామి చెప్పే జ్యోతిష్కం పై డిబేట్ లు పెట్టి, అతని బండారాన్ని బయటపెట్టి సంచలనం సృష్టించారు మూర్తి . ఎవరి దగ్గరా రూపాయి తీసుకొని, నిఖార్సైన జర్నలిస్టు అయిన మూర్తి , ఇప్పుడు టీవీ5 సీఈఓ నియమింపబడటంతో , టీవీ5 ప్రమాణాలు మరింత పెరిగి , బార్క్ రేటింగ్స్ లో మరింత ముందుకు దూసుకుపోయే అవకాశం వుంది.