ఈ సినిమా నటులకేమైంది? స్టేజి ఎక్కితే చాలు, నాలుక అదుపు తప్పుతోంది……

Rajendraprasad Controversial comments on David Warner

ఆ మధ్య డైరెక్టర్ నక్కిన త్రినాధరావు, నటుడు శ్రీకాంత్ అయ్యంగార్, మొన్న పృథ్విరాజ్ , నిన్న సీనియర్ నటుడు, హీరో రాజేంద్ర ప్రసాద్.

రాజేంద్ర ప్రసాద్… వయసుతో నిమిత్తం లేకుండా అందరూ అభిమానించే నటుడు, కానీ ఈ మధ్య స్టేజి ఎక్కితే చాలు, నాలుక అదుపుతప్పి మాట్లాడుతున్నారు, పుష్ప సినిమా రిలీజ్ అయ్యాక అనుకుంటాను, “స్మగ్లర్ హీరో ఏమిటండి ” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు, ఆ తరువాత బన్నీ నా కుమారుడు లాంటివాడు, నా వ్యాఖ్యలకు తప్పు అర్ధం తీశారు, అని వాపోయాడు.

రాబిన్‌హుడ్ సినిమా లో కేమియో రోల్ లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ను తీసుకున్నారు, పుష్ప సాంగ్ డాన్స్ లను ఇమిటేట్ చేస్తూ, వార్నర్ తెలుగువాళ్లకే కాక, ఇండియన్స్ కు బాగా దగ్గరయ్యాడు, అతనికున్న ఆ క్రేజ్ చూసే కాబోలు ఈ సినిమాలో చిన్న రోల్ కు తీసుకున్నారు.

ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది, ఆ ఈవెంట్ కు వార్నర్ ను కూడా అతిధిగా పిలిచారు. ఈ ఈవెంట్ లో స్టేజి ఎక్కిన రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ,

‘మా వెంకీ, నితిన్ కలిసి డేవిడ్ వార్నర్‌ను తీసుకొచ్చారు… ఆయన క్రికెట్ ఆడవయ్యా అంటే పుష్ప స్టెప్స్ వేశాడు, దొంగ ముం…. కొడుకు,  మామూలోడు కాదండీ వీడు,  రేయ్ వార్నరూ అని”,  నోటికొచ్చింది మాట్లాడాడు . వచ్చిన ప్రేక్షకులు, అతిధులు నవ్వారు,  డేవిడ్ వార్నర్ కు కూడా అర్ధం కాకున్నా, తన మీద ఏదో జోక్ చేస్తున్నారని తెలిసి చిరు నవ్వు నవ్వాడు, పాపం అర్ధం తెలిస్తే, అక్కడే తిట్టేవాడేమో.

ఈ వ్యాఖ్యల మీద సోషల్ మీడియా లో దుమారం రేగింది. వార్నర్ ను రాజేంద్ర కించపరిచాడనే ,విమర్శల దాడి ఎక్కువవడంతో, రాజేంద్ర ప్రసాద్ ఒక వీడియో చేస్తూ, వార్నర్ ను ఉద్దేశ్యపూర్వకంగా అనలేదని, అంతకు ముందు నేను , వార్నర్ క్లోజ్ గా మాట్లాడుకున్నాము అని, ఆ చనువుతోనే , ఆలా మాట్లాడానని, వార్నర్ ని అవమానించే ఉద్దేశ్యం లేదని చెప్పుకొచ్చాడు. 

అయితే అప్పటికే జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది. రాజేంద్ర ప్రసాద్ మీద కొంత నెగెటివిటీ మొదలయిపోయింది. రాజేంద్ర ప్రసాద్ కు స్టేజి ఎక్కినపుడు, ఏదో హాస్యం గా మాట్లాడాలని, మితిమీరిన పేస్ ఎక్సప్రెషన్స్ తో చాలా సార్లు మాట్లాడుతూ ఉంటాడు. అదే ఇప్పుడు మైనస్ అయింది. ఇదే తప్పు ఇకమీదట రాజేంద్ర ప్రసాద్ చేస్తే, ఇక సినిమా ఫంక్షన్ లకు ఆయన్ని పిలవడం మానేస్తారు. ఓవర్ టాకింగ్, రాజేంద్ర ప్రసాద్ లాంటి సీనియర్ నటుడు తగ్గిస్తే, మంచిది.

అలాగే డైరెక్టర్ నక్కిన త్రినాధరావు, చాన్నాళ్ల తరువాత సినిమాల్లో నటించడం మొదలు పెట్టిన, మన్మధుడు ఫేమ్ అన్షు గురించి , స్టేజి మీద మాట్లాడుతూ, బాడీ షేమింగ్ చేస్తూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, విమర్శలు పాలయ్యాడు, ఆ తరువాత క్షమాపణలు చెప్పాడు.

అలాగే

శ్రీకాంత్ అయ్యంగార్… పొట్టేల్ సినిమా సక్సెస్‌ మీట్‌లో , అయన మాట్లాడుతూ.. సినిమా రివ్యూయర్లపై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు… షార్ట్ ఫిల్మ్ తీయడం కూడా రాని నా….లు అంటూ అసభ్య పదజాలంతో దూషించాడు, రివ్యూయర్లు, ఫిలిమ్ జర్నలిస్టులను పెంట మీద పురుగుల్లా, కాదు, ఆ పురుగుల కన్నా హీనమైన వాళ్ళు అని దారుణంగా మాట్లాడతో,  సినీ జర్నలిస్టులు, అతని మీద మండిపడటంతో క్షమాపణలు చెప్పాడు.

ఇక , నిజామాబాద్ లో జరిగిన , ‘సంక్రాంతికి వస్తున్నాము “,  సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, యాంకర్ శ్రీముఖి, రామాయణం ఒక ఫిక్షన్
అని నోరు జారి, ఆ తరువాత ఒక వీడియో రిలీజ్ చేస్తూ క్షమాపణలు చెపింది. అదే ఈవెంట్ లో ప్రొడ్యూసర్ దిల్ రాజు, ఫ్లో లో, తెలంగాణ లో ఎక్కువ తాగడం ఉంటుంది అనే అర్ధం వచ్చే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, తరువాత క్షమాపణలు చెప్పాడు.

ఇక జనసేన లో ఆక్టివ్ గా వున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పృథ్విరాజ్ కూడా, లైలా సినిమా ఫంక్షన్ లో , వైసీపీ పార్టీ ని ఉద్దేశిస్తూ కొన్ని సెటైర్ లు వేయడంతో, సినిమా ఫంక్షన్ లలో పొలిటికల్ డైలాగులు అవసరమా, అది సినిమాను దెబ్బతీస్తుంది కదా, అని అందరూ విమర్శించడంతో, అయన కూడా క్షమాపణలు చెప్పాడు. 

కొంతమంది సినిమా సెలబ్రిటీ లు చేసే ఈ దిగజారుడు లేదా మాట్లాడే ఫ్లో లో చేసే పొరబాటుల వల్ల , మొత్తం సినిమా సెలబ్రిటీలు అందరూ ఇంతే అని ప్రజలు ఏవగించుకునే ప్రమాదం వుంది. సోషల్ మీడియా యాక్టీవ్ గా వున్న ఈ ఈరోజుల్లో , , “మేము పొరబటున లేదా కావాలని మాట్లాడినా, వెంటనే జనం లో, ఆ మాటలు స్ప్రెడ్ అయిపోతాయి, ఆ తరువాత క్షమాపణలు చెప్పినా అప్పటికే జరగాల్సిన డామేజీ జరిగిపోతుంది”, అని, గుర్తు పెట్టుకుని,  స్టేజి ఎక్కేటప్పుడు,  స్పృహలో ఉండటం అలవాటు చేసుకుంటే మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *