ఇప్పాల రవీందర్ రెడ్డి కి షాక్ ఇచ్చిన నారా లోకేష్

25th March 2025

 

తెలుగుదేశం పార్టీ పైనా, ఎన్టీఆర్ పైనా, ఆ పార్టీ నేతలపైనా సోషల్ మీడియా లో అత్యంత హేయంగా, నీచంగా, ద్వేష భావంతో సోషల్ మీడియా లో పోస్టులు పెట్టిన వ్యక్తితో నారాలోకేష్ ఒక మీటింగ్ లో పాల్గొన్నారు. ఆ మీటింగ్ తరువాత, అటువంటి వ్యక్తితో నారాలోకేష్ ఎలా మీటింగ్ లో పాల్గొంటారు, సోయి ఉందా, అంటూ లోకేష్ పై, టీడీపీ సోషల్ మీడియా లో టీడీపీ అభిమానులే దాడి చేసారు.

అసలు ఏమి జరిగింది ?

ప్రఖ్యాత నెట్వర్క్ డివైస్ కంపెనీ సిస్కో తో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక MOU చేసుకోదలించింది. దీని నిమిత్తం ఈ మార్చ్ 25 న సిస్కో కంపెనీ ప్రతినిథులు కొందరు మంత్రి నారా లోకేష్ ని కలిశారు. అదే కంపెనీలో సౌత్ ఇండియా టెరిటరీ ఎక్కౌంట్స్ మేనేజర్ గా ఉన్న ఇప్పాల రవీందర్ రెడ్డి కూడా, ఆ బృందంలో ఒక సభ్యుడిగా హాజరయ్యారు.

ఈ విషయం తెలియని, లోకేష్ అతడిని ఆ కంపెనీ సభ్యుడిగానే భావించారు. ఆ ఇప్పాల తో పాటు, మిగతా కంపెనీ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ మీటింగ్ వీడియోస్ మెయిన్ స్ట్రీమ్ వీడియో తో పాటు సోషల్ మీడియా లో ప్రసారం అయ్యాయి.

ఈ మీటింగ్ లో వున్న ఈ ఇప్పాల రవీందర్ రెడ్డి ని గమనించి టీడీపీ సోషల్ మీడియా హైలైట్ చేయడంతో పాటు, లోకేష్ పైనా, అత్యంత నీచంగా పోస్టులు పెట్టిన ఇటువంటి వ్యక్త్తితో మీటింగ్ లో ఎలా పాల్గొంటారని విమర్శల దాడి మొదలు పెట్టింది.

దీనితో అలెర్ట్ అయిన నారా లోకేష్ లోకేష్ వెంటనే ‘సిస్కో’ కపెనీకి ఒక ఇమెయిల్ పంపించారు.

 

సిస్కో తో, ఆంధ్రప్రదేశ్ ప్రభుతం చేపట్టే, ఏ ప్రాజెక్టులోనూ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ , ఈ ఇప్పాల రవీందర్ రెడ్డి ని, భాగస్వామిని చేయవద్దని, వెంటనే లేఖ రాశారు. ఈ విధంగా లోకేష్ ప్రతి స్పందించారు.

లోకేష్ సిబ్బందికి, అధికారులకు అతను ఎవరో తెలియక పోవచ్చు కానీ, మంత్రి లోకేష్ వద్దకు ఒక కంపెనీ ప్రతినిధుల బృందాన్ని పంపేటప్పుడు ఆ బృందంలో ఎవరెవరు వుంటారో ముందుగా తెలుసుకోవడంలో, సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విఫలమైందని టీడీపీ అభిమానులు విమర్శిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *