టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు కావస్తున్నా, నామినేటెడ్ పదవుల నియామకం పూర్తి స్థాయిలో జరగకపోవడంతో, టీడీపీ క్యాడర్లో అసంతృప్తి నెలకొంది. టీడీపీ, జనసేనలో ఎమ్మల్యే టికెట్ రాని వారు, అలాగే ఆ పార్టీల్లో, ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసినవారు, గత 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వం పై, కేసులకు భయపడకుండా పోరాటం చేసినవారు, ఇలా ఆశావహుల సంఖ్యా చాలా వుంది. 3 పార్టీల కలయిక కాబట్టి, నామినేటెడ్ పదవులు ప్రకటించేటప్పుడు, చాలా సమీకరణాలు చూసుకోవాలి, 3 పార్టీ లు, కుల సమీకరణాలు, ప్రాంతీయ సమీకరణాలు, ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి, చాలా కసరత్తు చేయాల్సిందే.
టీడీపీ గత ఏడాది సెప్టెంబరులో నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. మహానాడుకల్లా అన్ని పదవులు భర్తీ చేయాలని తెలుగు దేశం పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలో టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో ఆశావాహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏకంగా 60 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. తొలి జాబితాలో 20 కార్పొరేషన్ల చైర్మన్లతోపాటు మొత్తం 99 మందికి అవకాశం కల్పించారు. రెండో జాబితాలో మొత్తం 59 మందికి అవకాశం కల్పించారు. ఇంకా, 214 మార్కెట్ కమిటీలకు పదవులుప్రకటించాలి, అన్ని పదవులకు ఒకే సారి ప్రకటిస్తామని చెప్పినా 47 మార్కెట్ యార్డ్స్ విషయంలోనే క్లారిటీ వచ్చింది.
21 ప్రధాన దేవాలయాలకు చైర్మన్‌లను నియమించాల్సి ఉంది. వాటి పాలక మండళ్లు.. ఇతర పదువులు భర్తీ చేయాల్సినవి భారీగా ఉన్నాయి. పార్టీ కోసం కష్టపడిన వారికే అవకాశాలు కల్పిస్తామని టీడీపీ హైకమాండ్ ఇప్పటికే ప్రకటించింది. కానీ వారెవరో గుర్తించడానికి చేస్తున్న కసరత్తు ఓ కొలిక్కి రావడం లేదు.
నామినేటెడ్ పదవుల కోసం 60వేల దరఖాస్తులు వచ్చాయని చంద్రబాబు ప్రకటించారు. పదవులు రాని వారికి ఇప్పుడు పదవులు పొందుతున్న వారి రెండేళ్ల పదవీకాలం ముగిశాక మిగిలినవారికి కూడా అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇస్తున్నారు. మార్చి నెలాఖరులోపు అన్ని పదవులు భర్తీ చేయాలనుకున్నా.. ముందుకు సాగకపోవడంతో కూటమి నేతలు గట్టిగా పదవుల కోసం పట్టు బడుతున్నారని అనుకోవచ్చు.
తాజాగా నిన్న కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల 3 వ జాబితా ప్రకటించింది. 47 మార్కెట్ కమిటీలకు సంబంధించి ఛైర్మన్లను ప్రకటించింది.
47 మార్కెట్ కమిటీలకు గానూ.. సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేయనుంది. ప్రకటించిన 47 మార్కెట్ కమిటీ ఛైర్మెన్ల పదవుల్లో 37 టిడిపి, 8 జనసేన, 2 బీజేపీ నాయకులకు దక్కాయి.
టీడీపీ త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల ఛైర్మెన్లను ప్రకటించనుంది.
మే లో జరగవబోయే, మహానాడు లోగా, మిగిలిన నామినేటెడ్ పదవులన్నీ పూర్తి చేస్తారని, టీడీపీ క్యాడర్, నాయకులు ఆశగా ఎదురు చూస్తున్నారు.