April 9th 2025
కన్నప్ప సినిమా విడుదల ఎందుకు వాయిదా పడిందో మంచు మనోజ్ చెప్పేసాడు.
ఏ సందర్భం లో అంటే ,
మంచు కుటుంబలో, కొద్దిగా గ్యాప్ తరువాత గొడవలు మళ్లీ మొదలయ్యాయి. మనోజ్ మరలా మోహన్ బాబు ఇంటికి వెళ్లగా , లోపలి అనుమతించలేదు , దానితో గేట్ ముందు మనోజ్ బైఠాయించాడు , ఈ హడావుడితో మీడియా అక్కడ చేరింది. ఈ సందర్భంగా మనోజ్ మీడియా తో మాట్లాడుతూ కొన్ని కామెంట్లు చేసాడు .
”నా కెరీర్‌లో విష్ణు అవసరం కోసం, చాలా త్యాగాలు చేశాను, బయట బ్యానర్‌లో హిట్టు కొట్టినప్పుడల్లా, .. వెంటనే నన్ను లాక్కొచ్చి, సొంత బ్యానర్లో సినిమా చేయమనేవారు, ఓ సినిమాలో లేడీ గెటప్ కూడా వేసాను, . విష్ణు కోసం, ఎంత చేసినా నన్ను ఇప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు” అంటూ తన బాధను వ్యక్తం చేశాడు మనోజ్.
ఇదే ప్రెస్ మీట్ లో కన్నప్ప విడుదల వాయిదా గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.
విష్ణు అసలు, ‘కన్నప్ప’ చిత్రాన్ని ఏప్రిల్ విడుదల చేద్దామని ప్రిపేర్ అయ్యాడు. అదే సమయంలో, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నేను నటించిన మల్టీస్టారర్ ను కన్నప్పకు పోటీగా విడుదల చేద్దామనుకున్నాము . . అదే సమయంలో సాంకేతికత కారణాల వల్ల ‘కన్నప్ప’ , ఏప్రిల్ నెల రిలీజ్ నుండి వాయిదా వేసాము , అని వారు చెబుతున్న్నారు .
అయితే ‘కన్నప్ప’ రిలీజ్ వాయిదాపడటానికి కారణం.. సాంకేతిక కారణాలు కాదు, . ”నా మల్టీ స్టారర్ సినిమా భైరవం, కన్నప్పకు పోటీగా విడుదల చేద్దామనుకొన్నా. నా సినిమాకు భయపడే .. విష్ణు తన కన్నప్పను వాయిదా వేశాడు”, అంటూ కొత్త కారణాన్ని చెప్పాడు మనోజ్.
అసలు కన్నప్ప కానీ, భైరవం కానీ, ఈ సినిమాల గురించి, అంత ఆసక్తి లేదు, ప్రేక్షకులలో . అలాంటిది , ఈ రెండు సినిమాల్లో , ఒక సినిమాని చూసి మరో సినిమా భయపడిపోయి వాయిదా వేసుకోవడం ఏమిటో? అసలు లాజిక్ ఉందా అని, నవ్వుకుంటున్నారు సినీ పరిశీలకులు.
అయితే, కన్నప్ప విడుదల వాయిదా పడింది కాబటి, భైరవం విడుదల కూడా వాయిదా (కన్నప్ప కు పోటీగా ) వేస్తారేమో చూడాలి.